Daavudi Song from Devara: దేవర నుంచి మూడో పాట రిలీజ్.. డ్యాన్స్‌తో దుమ్మురేపిన ఎన్టీఆర్, జాన్వీ.. వీడియో సాంగ్ చూసేయండి-daavudi song from devara movie release as third single jr ntr janhvi kapoor dance steps is mind blowing ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Daavudi Song From Devara: దేవర నుంచి మూడో పాట రిలీజ్.. డ్యాన్స్‌తో దుమ్మురేపిన ఎన్టీఆర్, జాన్వీ.. వీడియో సాంగ్ చూసేయండి

Daavudi Song from Devara: దేవర నుంచి మూడో పాట రిలీజ్.. డ్యాన్స్‌తో దుమ్మురేపిన ఎన్టీఆర్, జాన్వీ.. వీడియో సాంగ్ చూసేయండి

Daavudi Song from Devara: దేవర మూవీ నుంచి మూడో పాట వచ్చేసింది. పుల్ జోష్ ఉన్న ట్యూన్‍తో ఈ సాంగ్ ఉంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ డ్యాన్స్, వారి మధ్య కెమిస్ట్రీ వారెవా అనేలా ఉన్నాయి.

Daavudi Song from Devara: దేవర నుంచి మూడో పాట రిలీజ్.. డ్యాన్స్‌తో దుమ్మురేపిన ఎన్టీఆర్, జాన్వీ

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర చిత్రం నుంచి ఎంతో ఎదురుచూస్తున్న మరో సాంగ్ వచ్చేసింది. ఇప్పటికే రెండు పాటలు చార్ట్‌బస్టర్లు అవటంతో మూడో సాంగ్‍పై చాలా హైప్ క్రియేట్ అయింది. ఫాస్ట్ బీట్‍తో డ్యాన్స్ అదిరిపోయేలా ఉంటుందని తెలియడంతో క్యూరియాసిటీ పెరిగిపోయింది. దేవర నుంచి ఆ మూడో పాట నేడు (సెప్టెంబర్ 4) రిలీజ్ అయింది.

డ్యాన్స్ అదుర్స్

దేవర నుంచి ‘దావుదీ’ అంటూ వచ్చిన ఈ మూడో సాంగ్ ఫుల్ జోష్‍తో ఉంది. ఎన్టీఆర్ డ్యాన్స్ ఇరగదీశారు. ఒకప్పటి వింటేజ్ ఎన్టీఆర్ కనిపించారు. ఫుల్ జోష్ ఉండే స్టెప్‍లతో దుమ్మురేపారు. హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా అదరగొట్టారు. మంచి గ్రేస్‍తో స్టెప్స్ వేశారు. ఈ పాట పక్కా డ్యాన్స్ నంబర్‌గా ఉంది. ఫాస్ట్ బీట్‍తో ఆకట్టుకునే ట్యూన్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్. దావుదీ సాంగ్ లిరికల్ వీడియోలా కాకుండా వీడియో సాంగ్‍నే మూవీ టీమ్ రిలీజ్ చేసింది.

దేవర చిత్రంలో ఈ దావుదీ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ట్రెండీ పదాలతో పాటను రాశారు. క్యాచీగా కొన్ని గెర్బీష్ పదాలు కూడా ఉన్నాయి. ఈ సాంగ్‍ను నకాశ్ అజీజ్, ఆకాశ పాడారు. మొత్తంగా మంచి వైబ్‍తో ఈ పాట ఉంది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశారు.

దేవర నుంచి ఈ మూడో పాట తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వచ్చింది. తెలుగు, హిందీ, కన్నడలో నకాశ్ అజీజ్, ఆకాశ ఈ పాటను ఆలపించారు. తమిళం, మలయాళంలో నకాశ్‍తో రమ్య బెహరా పాడారు. ఆయా భాషలకు లిరిక్ రైటర్లు వేర్వేరుగా ఉన్నారు. ఈ పాట కూడా మంచి పాపులర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

త్వరలో ప్రమోషన్లు షురూ!

దేవర సినిమా ఈనెల సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పాటలు మరింత హైప్ పెంచేశాయి. త్వరలోనే ప్రమోషన్లను మొదలుపెట్టేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేసిందని సమాచారం. పాన్ ఇండియా రేంజ్‍లో ప్రమోషన్లకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం కావటంతో నేషనల్ వైడ్‍గా ఈ చిత్రానికి ఫుల్ క్రేజ్ ఉంది.

దేవర చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో హైవోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, జాన్వీ హీరోహీరోయిన్లుగా నటించగా.. విలన్‍గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ చేశారు. ఈ మూవీపై హిందీలోనూ చాలా హైప్ ఉంది. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, కలైయారాసన్, నరైన్, మురళీశర్మ, అభిమన్యు సింగ్ కీలకపాత్రలు పోషించారు.


దేవర షూటింగ్ ఇప్పటికే ఫినిష్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ట్రైలర్ కూడా రెడీ అవుతోందని తెలుస్తోంది. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ప్రొడ్యూజ్ చేస్తున్నాయి.