Demonte Colony 2 OTT: ఓటీటీలోకి వస్తున్న హారర్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఊహించని ట్విస్టులతో మూవీ!-tamil horror thriller movie demonte colony 2 streaming in zee5 ott from september 27 also in telugu language ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Demonte Colony 2 Ott: ఓటీటీలోకి వస్తున్న హారర్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఊహించని ట్విస్టులతో మూవీ!

Demonte Colony 2 OTT: ఓటీటీలోకి వస్తున్న హారర్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఊహించని ట్విస్టులతో మూవీ!

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 16, 2024 06:21 PM IST

Demonte Colony 2 OTT Release Date: డీమోంటి కాలనీ 2 చిత్రం థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకుంది. ఈ హారర్ థ్రిల్లర్ చిత్రం స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. మంచి ట్విస్టులు ఉండే ఈ మూవీ ఎప్పుడు, ఏ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుందో ఇక్కడ చూడండి.

OTT Horror Thriller: ఓటీటీలోకి వస్తున్న తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఊహించని ట్విస్టులతో మూవీ!
OTT Horror Thriller: ఓటీటీలోకి వస్తున్న తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఊహించని ట్విస్టులతో మూవీ!

తమిళ హారర్ చిత్రం ‘డీమోంటి కాలనీ 2’ మంచి హిట్ అయింది. ఆగస్టు 15వ తేదీన తమిళంలో రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగులోనూ ఈ మూవీ ఆగస్టు 23న విడుదలైంది. ఈ మూవీకి అంతటా మంచి రెస్పాన్స్ వచ్చింది. కలెక్షన్లను కూడా బాగానే రాబట్టింది. 2015లో వచ్చిన సూపర్ హిట్ మూవీ డీమెంటి కాలనీకి సీక్వెల్‍గా రావటంతో ఈ మూవీపై మంచి హైప్ ఏర్పడింది. అందుకు తగ్గట్టే మెప్పించింది. డీమోంటి కాలనీ చిత్రానికి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు.

డీమోంటి కాలనీ 2 చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‍పై అధికారిక ప్రకటన వచ్చేసింది.

స్ట్రీమింగ్ ఎప్పుడు?

డీమోంటి కాలనీ 2 మూవీ సెప్టెంబర్ 27వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ నేడు (సెప్టెంబర్ 16) అధికారికంగా వెల్లడించింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం సెప్టెంబర్ 27న స్ట్రీమింగ్‍కు రానుంది.

“చీకటి మళ్లీ వస్తోంది.. ప్రతీకారం వేచిఉంది. జీ5లో సెప్టెంబర్ 27 నుంచి తమిళం, తెలుగులో డీమోంటి కాలనీ 2 స్ట్రీమింగ్ అవుతుంది” అని జీ5 నేడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సెప్టెంబర్ 27నే ఈ మూవీ ఓటీటీలోకి వస్తుందని కొంతకాలంగా రూమర్లు వస్తుండగా.. ఇప్పుడు అఫీషియల్‍గా ఫిక్స్ చేసేసింది.

డీమోంటి కాలనీ 2 మూవీని డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించారు. ఉత్కంఠభరితంగా పక్కా హారర్ థ్రిల్లర్‌లా రూపొందించారు. ట్విస్టులతో థ్రిల్ చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఓ ఫ్రెండ్స్ గ్రూప్ ఓ చైన్‍ను దొంగతనం చేసేందుకు ప్రయత్నించగా.. ఓ దెయ్యం మేలుకోవడం, ఆ తర్వాత ఎదురయ్యే ఘటనలు, సవాళ్ల చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది.

డీమోంటి కాలనీ 2 చిత్రంలో అరుళ్‍నిథి, ప్రియా భవానీ శంకర్ జోడీగా నటించారు. అర్చన్ రవీంద్రన్, అంటి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్, ముత్తుకుమార్, మీనాక్షి గోవిందరాజన్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందించారు.

కలెక్షన్లు ఇలా..

డీమోంటి కాలనీ 2 సినిమా రూ.15కోట్లలోపు బడ్జెట్‍తోనూ రూపొందిందని అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ మొత్తంగా రూ.55కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. హిట్ అయింది. తమిళంలో మంచి వసూళ్లను దక్కించుకుంది. తెలుగులోనూ బాగానే కలెక్షన్లు సొంతం చేసుకుంది. బీటీజీ యూనివర్సల్, వైట్ నైట్స్ ఎంటర్‌టైన్‍మెంట్, జ్ఞానముత్తు పట్టారై బ్యానర్లు ఈ మూవీని సంయుక్తంగా నిర్మించాయి.

ఇటీవలే ‘రఘుతాత’

జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఇటీవలే రఘుతాత సినిమా స్ట్రీమింగ్‍కు వచ్చింది. కీర్తి సురేశ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ పొలిటికల్ కామెడీ మూవీ సెప్టెంబర్ 13న జీ5 ఓటీటీలో అడుగుపెట్టింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఆగస్టు 15న థియేటర్లోల రిలీజైన రఘుతాత.. నెలలోగానే జీ5లో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రానికి సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. 1960ల బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రం సాగుతుంది.