Bigg Boss Shekar Basha: అందుకే బయటికి పంపారు.. ఆమె గెలిస్తే సంతోషం: శేఖర్ బాషా.. బిగ్‍బాస్ స్క్రిప్టెడ్ ఆరోపణలపై స్పందన-shekar basha reveals reason on his elimination from bigg boss 8 telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Shekar Basha: అందుకే బయటికి పంపారు.. ఆమె గెలిస్తే సంతోషం: శేఖర్ బాషా.. బిగ్‍బాస్ స్క్రిప్టెడ్ ఆరోపణలపై స్పందన

Bigg Boss Shekar Basha: అందుకే బయటికి పంపారు.. ఆమె గెలిస్తే సంతోషం: శేఖర్ బాషా.. బిగ్‍బాస్ స్క్రిప్టెడ్ ఆరోపణలపై స్పందన

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 16, 2024 03:59 PM IST

Bigg Boss Shekar Basha: తనను బిగ్‍బాస్ హౌస్ నుంచి పంపించేందుకు కంటెస్టెంట్లు ఎందుకు నిర్ణయించుకున్నారో శేఖర్ బాషా వెల్లడించారు. ప్రేమతో తనను ఎలిమినేట్ చేశారని తెలిపారు. బిగ్‍బాస్ టైటిల్ ఎవరు గెలిస్తే బాగుంటుందో కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Bigg Boss Shekar Basha: అందుకే బయటికి పంపారు.. ఆమె గెలిస్తే సంతోషం: శేఖర్ బాషా.. బిగ్‍బాస్ స్క్రిప్టెడ్ ఆరోపణలపై స్పందన
Bigg Boss Shekar Basha: అందుకే బయటికి పంపారు.. ఆమె గెలిస్తే సంతోషం: శేఖర్ బాషా.. బిగ్‍బాస్ స్క్రిప్టెడ్ ఆరోపణలపై స్పందన

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ నుంచి ఆర్జే శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యారు. రెండో వారంలోనే హౌస్ నుంచి బయటికి వచ్చేశారు. శేఖర్ బయటికి రావడం బిగ్‍బాస్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ప్రేక్షకుల ఓటింగ్ కాకుండా.. హౌస్‍మేట్స్ ఓట్లతో ఈ ఎలిమినేషన్ జరిగింది. శేఖర్ బాషా ఎలిమినేషన్ పట్ల సోషల్ మీడియాలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాగా, ఎలిమినేట్ అయిన శేఖర్ బాషా తాజాగా మీడియాతో మాట్లాడారు.

కంటెస్టెంట్ల నిర్ణయానికి కారణం ఇదే

శేఖర్ బాషా భార్య మగబిడ్డకు జన్మనిచ్చారని అతడు హౌస్‍లో ఉన్నప్పుడే హోస్ట్ నాగార్జున చెప్పారు. దీంతో శేఖర్ ఎమోషనల్ అయ్యారు. తన కుమారుడిని చూడాలనే శేఖర్ బయటికి వచ్చేందుకు నిర్ణయించుకున్నారనే అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే ఎలిమినేషన్‍ను కంటెస్టెంట్లే చేస్తారని నాగ్ చెప్పారు. శేఖర్ బాషాను బయటికి పంపేందుకు హౌస్‍మేట్స్ నిర్ణయించారు. దీంతో ఆయన ఎలిమినేట్ అయ్యారు. తనను ఎలిమినేట్ చేయాలని కంటెస్టెంట్లు ఎందుకు డిసైడ్ అయ్యారో శేఖర్ బాషా వెల్లడించారు.

కుమారుడిని చూసుకోవాలనే ఆశ బలంగా ఉందని తాను కంటెస్టెంట్లందరికీ చెప్పానని, దీంతో సింపతీ చూపించి బయటికి పంపాలనే ఎలిమినేట్ చేశారని శేఖర్ బాషా అన్నారు. ఎలిమినేట్ అయినా పర్లేదా అని వారు అడిగినప్పుడు.. సరేనని కొందరికి తాను చెప్పానని అన్నారు. అందుకే ప్రేమతోనే బయటికి పంపారని తెలిపారు. తాను ఎలిమినేట్ అయ్యేందుకు పృథ్వి, సోనియా కారణంగా కాదని చెప్పేశారు.

ప్రేక్షకుల ఓటింగ్‍తో కాకుండా బిగ్‍బాస్ చరిత్రలో హౌస్‍మేట్ల ఓట్లతో ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్‍గా నిలువడం ఎలా ఉందనే ప్రశ్న కూడా శేఖర్ బాషాకు ఎదురైంది. బిడ్డను చూద్దామనే కోరిక బలంగా ఉందని అనుకొని, వారు తనను ప్రేమతో ఎలిమినేషన్ చేశారని, ఎవరినీ తప్పు పట్టవద్దని చెప్పారు.

బిగ్‍బాస్ స్క్రిప్టెడా?

బిగ్‍బాస్ స్క్రిప్టెడ్ అనే ఆరోపణలు వస్తున్నాయని, దీనిపై స్పందించాలని శేఖర్ బాషాకు ప్రశ్న వచ్చింది. దీనికి ఆయన స్పందించారు. బిగ్‍బాస్ స్క్రిప్టెడ్ అనేది పచ్చి అబద్ధమని చెప్పారు. బిగ్‍బాస్ స్క్రిప్టెడ్ కాదని కుండబద్దలు కొట్టారు.

తెలుగమ్మాయి సీత గెలిస్తే బాగుంటుంది

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍ టైటిల్‍ను కిర్రాక్ సీత గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నట్టు శేఖర్ బాషా తెలిపారు. సీత తెలుగమ్మాయి అని శేఖర్ చెప్పారు. ఆమె మంచి స్ఫూర్తితో గేమ్ ఆడుతున్నారని అన్నారు. కన్నడ కంటెస్టెంట్లు ఉన్నారని, వారు ముందుగా ఒకరికొకరు తెలియడంతో మాట్లాడుకొని ఆడుతున్నారని చెప్పారు.

వెల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందా?

బిగ్‍బాస్ తెలుగు 8 హౌస్‍లో శేఖర్ బాషా బాగానే ఎంటర్‌టైన్‍ చేశారు. తన మార్క్ పంచ్‍లతో నవ్వించే ప్రయత్నం చేశారు. దీంతో ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. నామినేషన్లలో ఉన్నా శేఖర్ బాషాకు ఓటింగ్ బాగానే వచ్చింది. అయితే, కంటెస్టెంట్ల ఓటింగ్‍తో ఎలిమినేట్ అయ్యారు. రెండో వారంలోనే బయటికి వచ్చేశారు. అయితే, శేఖర్ బాషా మళ్లీ హౌస్‍లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు వినిపిస్తున్నాయి. మూడు, నాలుగు వారాల తర్వాత వైల్డ్ కార్డ్ ద్వారా మళ్లీ హౌస్‍లోకి అడుపెడతాడని టాక్. ఏం జరుగుతుందో చూడాలి.