Mathu Vadalara 2: మత్తు వదలరా 2 కలెక్షన్స్ - ఫస్ట్ వీకెండ్‌లోనే లాభాల్లోకి అడుగుపెట్టిన క్రైమ్ కామెడీ మూవీ
Mathu Vadalara 2: మత్తు వదలరా 2 మూవీ ఫస్ట్ వీకెండ్‌లోనే లాభాల్లోకి అడుగుపెట్టినట్లు సమాచారం. మూడు రోజుల్లో ఈ మూవీ 16.2 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. క్రైమ్ కామెడీ కథాంశంతో రూపొందిన ఈ మూవీలో శ్రీసింహా, సత్య, ఫరియా అబ్దుల్లా కీలక పాత్రలు పోషించారు.
Mathu Vadalara 2 Collection: మత్తు వదలరా 2 మూవీ ఫస్ట్ వీకెండ్‌లోనే లాభాల్లోకి అడుగుపెట్టింది. మూడు రోజుల్లోఈ క్రైమ్ కామెడీ మూవీకి 16.2 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఫస్ట్, సెకండ్ డే కంటే ఆదివారం రోజు ఈ సీక్వెల్ మూవీ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టడం గమనార్హం. తొలిరోజు మత్తు వదలరా 2కు కోటి ముప్పై లక్షల వరకు షేర్ కలెక్షన్స్ రాగా... మూడో రోజు కోటి తొంభై లక్షల వరకు షేర్ కలెక్షన్స్ దక్కించుకున్నది.
మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్...
ఆదివారం నాటికి 16.2 కోట్ల గ్రాస్, ఎనిమిది కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్ ఈ మూవీకి వచ్చాయి.వరల్డ్ వైడ్‌గా ఎనిమిది కోట్ల వరకు మత్తు వదలరా 2 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఆదివారం నాటి కలెక్షన్స్‌తో ఈ సీక్వెల్ మూవీ బ్రేక్ టార్గెట్‌ను రీచ్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. సోమవారం నుంచి వచ్చే కలెక్షన్స్ మొత్తం లాభాలేనని చెబుతోన్నారు. రీసెంట్ టైమ్‌లో టాలీవుడ్‌లో ఫస్ట్ వీకెండ్‌లోనే లాభాల్లోకి అడుగుపెట్టిన చిన్న సినిమాగా మత్తు వదలరా 2నిలిచింది.
సత్య కామెడీ హైలైట్...
మత్తు వదలరా 2 మూవీలో శ్రీసింహా కోడూరి, సత్య, ఫరియా అబ్దుల్లా కీలక పాత్రల్లో నటించారు.2019లో రిలీజైన బ్లాక్‌బస్టర్ మూవీ మత్తు వదలరాకు సీక్వెల్‌గా దర్శకుడు రితేష్ రానా ఈ మూవీని తెరకెక్కించారు. కథలోని ట్విస్ట్‌లతో పాటు సత్య కామెడీ ఈ మత్తు వదలరా 2 మూవీకి హైలైట్‌గా నిలుస్తోంది. మరోవైపు వరుసగా హాలీడేస్ రావడం, పోటీగా పెద్ద సినిమాలు థియేటర్లలో లేకపోవడం కూడా ఈ మూవీకి కలిసివచ్చింది.
మత్తు వదలరా కథ ఇదే...
మత్తు వదలరా మూవీకి కొనసాగింపుగా ఈ సీక్వెల్ కథను రాసుకున్నాడు డైరెక్టర్ రితేష్ రానా. డెలివరీ ఏజెంట్స్ ఉద్యోగాలు పోవడంతో బాబు మోహన్ (శ్రీసింహా కోడూరి), ఏసుదాసు( సత్య) అడ్డదారుల్లోమ హీ టీమ్‌లో ఇన్వేస్టిగేషన్ ఆఫీసర్స్‌గా జాయిన్ అవుతారు. కిడ్నాప్ కేసులను డీల్ చేస్తుంటారు. తన కూతురు రియా కిడ్నాప్ అయ్యిందని దామిని (ఝాన్సీ) అనే మహిళ బాబు, ఏసులను సంప్రదిస్తుంది.
హీ టీమ్ ద్వారా కాకుండా తామే సొంతంగా ఈ కేస్‌ను డీల్ చేయాలని బాబు, ఏసు నిర్ణయించుకుంటారు. అనుకోకుండా రియా డెడ్‌బాడీ బాబు, ఏసు కారులోనే దొరుగుతుంది. బాబు, ఏసులను హంతకులుగా అనుమానించిన హీ టీమ్ ఆఫీసర్ మైఖేల్ (సునీల్) వారిని వెంటాడుతుంటాడు? అసలు రియా ఎలా చనిపోయింది?
ఈ మర్డర్ కేసులో బాబు, ఏసులను ఇరికించింది ఎవరు? జూనియర్ ఆర్టిస్ట్ అయిన దామిని రియా తల్లిగా ఎందుకు యాక్ట్ చేసింది? రియా హత్యకు సినీ హీరో యువ(వెన్నెలకిషోర్)కు ఏమైనా సంబంధం ఉందా? ఈ కేసులోకి నిధి ( ఫరియా అబ్లుల్లా ) ప్రకాష్ (అజయ్), దీప (రోహిణి) ఎలా వచ్చారు అనే క్రైమ్ అంశాలకు కామెడీని జోడించి ఈ మూవీని తెరకెక్కించాడు.
మత్తు వదలరా 3 కూడా…
మత్తు వదలరా 2 మూవీకి కాలభైరవ మ్యూజిక్ అందించాడు. మత్తు వదలరా ఫ్రాంచైజ్‌లో మూడో పార్ట్ ను కూడా రూపొందించబోతున్నట్లు ఇటీవలే దర్శకుడు ప్రకటించాడు.