Saripodhaa Sanivaaram OTT: నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న నాని లేటెస్ట్ బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ డేట్‌పై బజ్-saripodhaa sanivaaram ott release date nani latest blockbuster may stream from 26th september on netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Saripodhaa Sanivaaram Ott: నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న నాని లేటెస్ట్ బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ డేట్‌పై బజ్

Saripodhaa Sanivaaram OTT: నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న నాని లేటెస్ట్ బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ డేట్‌పై బజ్

Hari Prasad S HT Telugu
Sep 16, 2024 08:50 AM IST

Saripodhaa Sanivaaram OTT Release Date: నాని నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ సరిపోదా శనివారం నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ పై బజ్ క్రియేటైంది.

నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న నాని లేటెస్ట్ బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ డేట్‌పై బజ్
నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న నాని లేటెస్ట్ బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ డేట్‌పై బజ్

Saripodhaa Sanivaaram OTT Release Date: సరిపోదా శనివారం మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోందా? థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే నాని నటించిన ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైందా? తాజాగా సోషల్ మీడియాలో క్రియేటైన బజ్ చూస్తుంటే.. ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సరిపోదా శనివారం ఓటీటీ రిలీజ్ డేట్

నాని నటించిన సరిపోదా శనివారం మూవీ సెప్టెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత నెల 29న థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమాతో నాని హ్యాట్రిక్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే అలాంటి మూవీ నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ కు వస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే దీనిపై ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఒక్క హిందీలో తప్ప తెలుగుతోపాటు మిగతా అన్ని భాషల్లోనూ ఈ సరిపోదా శనివారం మూవీ సెప్టెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనపిస్తున్నాయి. వివేక్ ఆత్రేయ నటించిన ఈ యాక్షన్ డ్రామాలో ఎస్‌జే సూర్య విలన్ కాగా.. ప్రియాంకా అరుల్ మోహన్ ఫిమేల్ లీడ్ గా కనిపించింది.

రూ.100 కోట్ల క్లబ్‌లోకి సరిపోదా శనివారం

ఇక సరిపోదా శనివారం మూవీ రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఈ ఘనత సాధించిన మూడో నాని సినిమాగా నిలిచింది. థియేటర్లలో రిలీజైన 18వ రోజు ఈ మూవీ రూ.100 కోట్ల రికార్డు అందుకోవడం విశేషం. నాని 16 ఏళ్ల కెరీర్లో ఇలా రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన సినిమాలు గతంలో రెండు ఉన్నాయి.

2012లో వచ్చిన ఈగ తొలిసారి రూ.107 కోట్లతో నిలిచింది. ఆ తర్వాత గతేడాది రిలీజైన దసరా మూవీ రూ.121 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి వరకూ నాని కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా దసరానే నిలుస్తోంది. తొలి రోజు నుంచే సినిమాకు వచ్చిన పాజిటివ్ రివ్యూలు సరిపోదా శనివారం మూవీకి కలిసి వచ్చాయి.

సరిపోదా శనివారం ఎలా ఉందంటే?

సరిపోదా శనివారంలో శ‌నివారం మాత్ర‌మే హీరో త‌న కోపాన్ని ప్ర‌ద‌ర్శిస్తాడ‌నే పాయింట్ మాత్ర‌మే కొత్త‌గా ఉంది. మిగిలిన క‌థ మొత్తం పాత వాస‌న‌ల‌తోనే సాగుతుంది. విల‌న్ పాత్ర ఎంత బాగా ఎలివేట్ అయితే హీరో క్యారెక్ట‌ర్ అంత స్క్రీన్‌పై షైన్ అవుతుంద‌నే సూత్రాన్ని ద‌ర్శ‌కుడు బ‌లంగా న‌మ్మాడు. అందుకే సూర్య‌లోని శాడిజాన్ని పీక్స్‌లో చూపించాడు.

అలాంటి విల‌న్‌ను హీరో ఎదుర్కొంటాడ‌నే క్యూరియాసిటీ చివ‌రి వ‌ర‌కు ఆడియెన్స్‌లో క‌లిగిస్తూ కామెడీ, యాక్ష‌న్‌తో పాటు చిన్న ల‌వ్‌స్టోరీతో చివ‌రి వ‌ర‌కు సినిమాను నడిపించాడు.

స‌రిపోదా శ‌నివారం సినిమాకు నాని, ఎస్‌జే సూర్య ఇద్ద‌రు హీరోల‌నే చెప్పొచ్చు. చివ‌రి వ‌ర‌కు నువ్వానేనా అన్న‌ట్లుగా ఇద్ద‌రి క్యారెక్ట‌ర్స్ సాగుతాయి. సూర్య పాత్ర‌లో నాని అద‌ర‌గొట్టాడు. త‌న‌దైన శైలి ఎమోష‌న్స్ పండిస్తూనే యాక్ష‌న్స్ ఎపిసోడ్స్‌తో మెరిశాడు. ద‌యానంద్ పాత్రకు ఎస్ జే సూర్య వంద‌శాతం న్యాయం చేశాడు.

కొన్ని చోట్ల యాక్టింగ్ విష‌యంలో నానిని డామినేట్ చేశాడు. ఓ వైపు విలనిజాన్ని పండిస్తూనే న‌వ్వించాడు. ప్రియాంక మోహ‌న్ న‌ట‌న ఒకే అనిపిస్తుంది. ముర‌ళీశ‌ర్మ, సాయికుమార్‌, శుభ‌లేఖ సుధాక‌ర్ వంటి సీనియ‌ర్ యాక్ట‌ర్ల అనుభ‌వాన్ని డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ బాగా వాడుకున్నాడు.