Aditi Siddharth Wedding: పెళ్లితో ఒక్కటైన అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్.. ఫొటోలు వైరల్
Aditi Siddharth Wedding: అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్ పెళ్లితో ఒక్కటయ్యారు. నిశ్చితార్థం చేసుకున్న ఆరు నెలల తర్వాత ఈ జంట ఇప్పుడు కలిసి ఏడు అడుగులు వేయడం విశేషం. వీళ్ల పెళ్లి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Aditi Siddharth Wedding: చాలాకాలంగా డేటింగ్ లో ఉన్న సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ జంట మొత్తానికి పెళ్లి చేసుకున్నారు. ఎన్నో రోజుల పాటు తమ రిలేషన్షిప్ ను సీక్రెట్ గా మెయింటేన్ చేసి ఈ ఏడాది మార్చిలో నిశ్చితార్థం జరుపుకున్న వీళ్లు.. తాజాగా సోమవారం (సెప్టెంబర్ 16) పెళ్లి చేసుకున్నాడు. ఈ ఫొటోలను అదితి, సిద్ధార్థ్ తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా షేర్ చేసుకున్నారు.
సిద్ధార్థ్, అదితి పెళ్లి
సిద్ధార్థ్, అదితి పెళ్లి సింపుల్ గా జరిగింది. ఈ ఫొటోలను వాళ్లు షేర్ చేసిన తర్వాతగానీ ఆ విషయం ఎవరికీ తెలియలేదు. తమ పెళ్లి విషయాన్ని సిద్ధార్థ్ ఓ బ్యూటీఫుల్ పోస్ట్ తో వెల్లడించాడు. "నువ్వే నా సూర్యుడు.. నువ్వే నా చంద్రుడు.. నువ్వే నా నక్షత్రాలన్నీ.. శాశ్వతమైన పిక్సీ సోల్‌మేట్స్ గా ఉండటానికి, నవ్వులకు, నిత్యనూతనమైన ప్రేమ, లైట్, మ్యాజిక్ మిసెస్ అండ్ మిస్టర్ ఆదు సిద్దూ" అనే క్యాప్షన్ తో సిద్దార్థ్ ఆ ఫొటోలను పంచుకున్నాడు.
మొదట డెస్టినేషన్ వెడ్డింగ్ ఉంటుందని భావించినా.. ఈ జంట ముందుగా చెప్పినట్లే ఆ చారిత్రక ఆలయంలోనే పెళ్లి చేసుకోవడం విశేషం. తెలంగాణలోని వనపర్తి దగ్గర్లో ఉన్న ఈ గుడిలోనే వీళ్ల ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఈ ఆలయానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. అదితి తల్లి ఒకప్పటి వనపర్తి జాగీర్ చివరి రాజా రామేశ్వర రావు కూతురే కావడం విశేషం. దీంతో వనపర్తిలోనే అదితి ఎంగేజ్మెంట్, పెళ్లి చేసుకుంది.
ఈ ఫొటోల్లో వీళ్ల జంట చాలా బాగా అనిపిస్తోంది. అదితి బీజ్ కలర్ లెహెంగా శారీలో, సిద్ధార్థ్ వైట్ షర్ట్, ధోతీలో కనిపించారు. ఇద్దరు లవ్ బర్డ్స్ తమ మధ్య ఎంత ప్రేమ ఉందో ఈ ఫొటోల ద్వారా మరోసారి చూపించారు. మొదటి ఏడు ఫొటోల్లో వీళ్ల వెడ్డింగ్ షూట్ కు సంబంధించినవి ఉండగా.. చివరి మూడు ఫొటోల్లో వాళ్ల పెళ్లి తంతుకు సంబంధించిన ఫొటోలు చూడొచ్చు.
మార్చిలో ఎంగేజ్‌మెంట్
సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ ఈ ఏడాది మార్చిలో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. నిజానికి అప్పుడే వాళ్లు పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చినా.. తర్వాత తన చేతికి ఉన్న రింగ్ చూపిస్తూ అదితి తమ నిశ్చితార్థం జరిగిందని చెప్పింది. ఈ సెలబ్రిటీ కపుల్ 2021లో మహా సముద్రం అనే సినిమాలో కలిసి నటించారు.
ఆ మూవీ సెట్స్ లోనే వీళ్లు ప్రేమలో పడ్డారు. అయితే రెండున్నరేళ్ల పాటు తమ రిలేషన్షిప్ పై వీళ్లు నోరు విప్పలేదు. అయితే తరచూ బయట కలిసి కనిపించడం, రీల్స్ చేయడం ద్వారా తాము డేటింగ్ చేస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. మొత్తానికి మార్చిలో ఎంగేజ్మెంట్ ద్వారా తాము ఒక్కటి కాబోతున్నట్లు వెల్లడించారు.
ఇక ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యారు. నిజానికి ఇది సిద్ధార్థ్ కు మూడో పెళ్లి కాగా.. అదితికి రెండో పెళ్లి. అదితి గతంలో హిందీ నటుడు సత్యదీప్ మిశ్రాను పెళ్లి చేసుకొని తర్వాత విడిపోయింది. అతడు ఆ తర్వాత నీనా గుప్తా కూతురు మసాబాను పెళ్లి చేసుకున్నాడు.