OTT Movie: రాజ్ తరుణ్ నయా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..-raj tarun malvi malhotra action drama movie tiragabadara saami ott streaming date confirmed to release on aha ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movie: రాజ్ తరుణ్ నయా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

OTT Movie: రాజ్ తరుణ్ నయా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 16, 2024 03:04 PM IST

Tiragabadara Saami OTT Release Date: తిరగబడరా సామీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. స్ట్రీమింగ్ డేట్ తాజాగా కన్ఫర్మ్ అయింది. ఈ యాక్షన్ డ్రామా మూవీలో రాజ్‍ తరుణ్ హీరోగా నటించారు. ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రానుందంటే..

OTT Movie: రాజ్ తరుణ్ నయా మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
OTT Movie: రాజ్ తరుణ్ నయా మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా హీరోహీరోయిన్లుగా ‘తిరగబడరా సామీ’ చిత్రం వచ్చింది. ఈ మూవీ ఆగస్టు 2వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. కాగా, రాజ్ తనను మోసం చేశాడని, ఇదంతా మాల్వీ వల్లే అంటూ లావణ్య ఆరోపించడం దుమారం రేపింది. ఈ సినిమా రిలీజ్‍కు ముందే రచ్చ జరిగింది. ఈ వివాదం మధ్యలోనే థియేటర్లలోకి వచ్చిన ‘తిరగబడరా సామీ’ పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది.

స్ట్రీమింగ్ డేట్ ఇదే

తిరగబడరా సామీ చిత్రం ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో సెప్టెంబర్ 19వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. త్వరలో వస్తుందంటూ ఇటీవలే ఆహా వెల్లడించింది. అయితే, ఇప్పుడు డేట్ ఖరారైంది. సెప్టెంబర్ 19న ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్‍కు రానుంది.

తిరగబడరా సామీ చిత్రానికి రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించారు. లవ్ స్టోరీ, యాక్షన్‍తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాజ్ తరుణ్, మాల్వీతో పాటు మన్నారా చోప్రా, రఘుబాబు, మకరంద్ దేశ్‍పాండే, తాగుబోతు రమేశ్, ప్రగతి, మకరంద్ దేశ్‍పాండే, బిత్తిరి సత్తి ఈ మూవీలో కీలకపాత్రలు పోషించారు.

తిరగబడరా సామీ మూవీకి మిక్స్డ్ టాక్ రావటంతో థియేటర్లలో పెద్దగా ఆడలేదు. అంతకు ముందు వారమే పురుషోత్తముడు చిత్రంతో రాజ్‍కు నిరాశ ఎదురుకాగా.. ఈ మూవీ కూడా ప్లాఫ్ అయింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ పరాజయాలు ఎదురయ్యాయి. తిరగబడరా సామీ మూవీని సురక్ష్ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై శివకుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి జీవన్ బాబు సంగీతం అందించారు.

తిరగబడరా సామీ స్టోరీలైన్

చిన్నతనంలోనే గిరి (రాజ్ తరుణ్) ఓ జాతరలో తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి అనాథలా పెరుగుతాడు. హైదరాబాద్‍ ఉంటాడు. తనలా తల్లిదండ్రులకు దూరమైన వారిని ఇళ్లకు చేర్చడమే లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ టీవీ ఇంటర్వ్యూలో చూసి గిరిని ఇష్టపడుతుంది శైలజ (మాల్వీ మల్హోత్రా). ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. శైలజ కోసం కొండారెడ్డి (మకరంద్ దేశ్‍పాండే) వెతుకుతుంటాడు. ఈ క్రమంలో శైలజ రూ.2వేల కోట్ల ఆస్తికి వారసురాలు అని గిరికి తెలుస్తుంది. శైలజను పట్టించాలని గిరిని కూడా కొండారెడ్డి బెదిరిస్తాడు. ఆ తర్వాత గిరి ఏం చేశాడు? శైలజను కాపాడుకున్నాడా? ఆమెతో కొండారెడ్డికి ఉన్న సంబంధం ఏంటి? అనే విషయాలు తిరగబడరా సామీ చిత్రంలో ప్రధానంగా ఉంటాయి.

రాజ్ తరుణ్ వివాదం

రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్నారు నటి లావణ్య. మాల్వీ మల్హోత్రా వల్లే తనను రాజ్ వదిలేశాడని అన్నారు. పోలీస్ కేసులు కూడా నమోదు చేశారు. ఈ తతంగం పెద్ద దుమారం రేపింది. లావణ్య చాలాసార్లు ఆరోపణలు చేశారు. ఇటీవల రాజ్, మాల్వీ ముంబైలోని ఓ ఇంట్లో ఉండగా.. లావణ్య అక్కడికి వెళ్లారు. దీంతో రచ్చరచ్చ అయింది.

రాజ్ తరుణ్ హీరోగా నటించిన భలే ఉన్నాడే చిత్రం సెప్టెంబర్ 13న రిలీజ్ అయింది. ఈ మూవీ కూడా మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. దీంతో రాజ్‍కు మరోసారి నిరాశే ఎదురైంది. సుమారు రెండు నెలల్లోనే మూడు ఫ్లాఫ్‍లు ఎదురయ్యాయి.