OTT Top Movies: ఓటీటీల్లోకి ఈమధ్యే వచ్చిన ఈ టాప్ 10 మూవీస్, వెబ్ సిరీస్ మిస్ కావద్దు.. ఇప్పటి వరకూ ఎన్ని చూశారు?-ott top movies web series to watch on netflix prime video aha video etv win sonyliv disney plus hotstar zee5 jio cinema ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Top Movies: ఓటీటీల్లోకి ఈమధ్యే వచ్చిన ఈ టాప్ 10 మూవీస్, వెబ్ సిరీస్ మిస్ కావద్దు.. ఇప్పటి వరకూ ఎన్ని చూశారు?

OTT Top Movies: ఓటీటీల్లోకి ఈమధ్యే వచ్చిన ఈ టాప్ 10 మూవీస్, వెబ్ సిరీస్ మిస్ కావద్దు.. ఇప్పటి వరకూ ఎన్ని చూశారు?

Hari Prasad S HT Telugu
Sep 16, 2024 10:54 AM IST

OTT Top Movies: ఓటీటీల్లోకి ఈ మధ్యే కొన్ని టాప్ సినిమాలు, వెబ్ సిరీస్ వచ్చాయి. వరుస హాలీడేస్ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, ఆహా వీడియో, ఈటీవీ విన్, సోనీలివ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమాల్లాంటి ఓటీటీల్లో ఈ మూవీస్, వెబ్ సిరీస్ ఉన్నాయి.

ఓటీటీల్లోకి ఈమధ్యే వచ్చిన ఈ టాప్ 10 మూవీస్, వెబ్ సిరీస్ మిస్ కావద్దు.. ఇప్పటి వరకూ ఎన్ని చూశారు?
ఓటీటీల్లోకి ఈమధ్యే వచ్చిన ఈ టాప్ 10 మూవీస్, వెబ్ సిరీస్ మిస్ కావద్దు.. ఇప్పటి వరకూ ఎన్ని చూశారు?

OTT Top Movies: ఓటీటీల్లో కచ్చితంగా చూడాల్సిన టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్ ఏవో ఇక్కడ ఇస్తున్నాం. మీరు వాటిలో ఎన్ని చూశారు? ఇంకా ఎన్ని చూడాలో తెలుసుకోండి. వరుస హాలిడేస్ ఉండటంతో చూడని వాటిని కూడా కవర్ చేసేయండి. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో గత వారం చాలా సినిమాలు, సిరీస్ ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో బెస్ట్ ఇక్కడ ఇస్తున్నాం.

ఓటీటీల్లోని టాప్ 10 మూవీస్, వెబ్ సిరీస్ ఇవే

కమిటీ కుర్రోళ్లు - ఈటీవీ విన్

గత నెలలో థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించిన తెలుగు రూరల్ కామెడీ డ్రామా కమిటీ కుర్రోళ్లు ఈటీవీ విన్ ఓటీటీలోకి గత వారమే వచ్చింది. సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మనల్ని చిన్నతనంలోకి తీసుకెళ్లి అన్ని ఎమోషన్స్ ను కలిగించే సినిమా ఇది.

మారుతీనగర్ సుబ్రమణ్యం - ఆహా వీడియో

రావు రమేష్ లీడ్ రోల్లో నటించిన మూవీ మారుతీనగర్ సుబ్రమణ్యం. ఈ సినిమా కూడా గత నెలలోనే రిలీజైంది. ఆహా వీడియోలోకి ఈ శుక్రవారం (సెప్టెంబర్ 20) ఈ కామెడీ డ్రామా స్ట్రీమింగ్ కు రానుంది. మంచి టైంపాస్ మూవీ. 

మిస్టర్ బచ్చన్ - నెట్‌ఫ్లిక్స్

బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడినా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న మిస్టర్ బచ్చన్ మూవీకి ఓటీటీలో మంచి రెస్పాన్సే వస్తోంది. ఒకవేళ థియేటర్లలో మిస్ అయి ఉంటే డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై ఈ మూవీ చూసేయండి.

తలవన్ - సోనీలివ్

సోనీలివ్ ఓటీటీలోకి వచ్చిన తాజా మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ తలవన్. మంచి థ్రిల్ కోసం ఎదురు చూస్తుంటే ఈ సినిమాను మిస్ కావద్దు. సెప్టెంబర్ 10 నుంచి సినిమా సోనీలివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

బెర్లిన్ - జీ5 ఓటీటీ

స్పై థ్రిల్లర్ జానర్లో వచ్చిన మూవీ బెర్లిన్. జీ5 ఓటీటీ ఒరిజినల్ అయిన ఈ సినిమా.. నేరుగా ఓటీటీలోకే వచ్చింది. రష్యా అధ్యక్షుడిపై హత్యాయత్నం అనే అతిపెద్ద కేసులో ఓ మూగ, చెవిటి వ్యక్తిని ఇరికించడానికి జరిగే ప్రయత్నాన్ని ఈ మూవీ చాలా బాగా చూపించింది.

బ్యాడ్ న్యూస్ - ప్రైమ్ వీడియో

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో వచ్చి హిట్ కొట్టిన మూవీ బ్యాడ్ న్యూస్. ఇద్దరి ద్వారా కవలలకు తల్లి అయిన ఓ బోల్డ్ పాత్రలో యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రి నటించిన ఈ సినిమా.. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

బెంచ్ లైఫ్ - సోనీలివ్

బెంచ్ లైఫ్ ఓ తెలుగు వెబ్ సిరీస్. సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఐటీ కంపెనీల్లో బెంచ్ పై ఉండే ఉద్యోగుల జీవితం చుట్టూ తిరిగే ఓ ఫన్నీ వెబ్ సిరీస్ ఇది. నాలుగు ఎపిసోడ్లే ఉన్న ఈ సిరీస్ మంచి టైంపాస్ అని చెప్పొచ్చు.

ఖల్బలీ రికార్డ్స్ - జియో సినిమా

తాజాగా జియో సినిమా ఓటీటీలోకి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఖల్బలీ రికార్డ్స్. మ్యూజిక్ ఇండస్ట్రీలో ఆధిపత్యం కోసం ప్రయత్నించే రెండు కంపెనీల చుట్టూ తిరిగే కథే ఈ వెబ్ సిరీస్. ర్యాప్ మ్యూజిక్ ఇష్టపడే వాళ్లు కచ్చితంగా చూడాల్సిన సిరీస్ ఇది.

కాల్ మీ బే - ప్రైమ్ వీడియో

ప్రైమ్ వీడియోలో లైగర్ బ్యూటీ అనన్య పాండే నటించిన వెబ్ సిరీస్ కాల్ మీ బేకి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. గోల్డెన్ స్పూన్ తో పుట్టిన ఓ పేజ్ 3 గర్ల్.. ఓ చిన్న తప్పుతో జీవితం తలకిందులై ఓ సాధారణ జర్నలిస్టుగా మారి తన జీవితాన్ని మళ్లీ ఎలా మలుపు తిప్పుకుందో ఈ సిరీస్ లో చూడొచ్చు.

సెక్టార్ 36 - నెట్‌ఫ్లిక్స్

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న మరో మూవీ సెక్టార్ 36. యదార్థ ఘటనల ఆధారం తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నోయిడా సమీపంలోని నిఠారీలో 2006లో జరిగిన వరుస హత్యల నేపథ్యంలో సాగే మూవీ ఇది.