OTT Horror Movie: రీరిలీజ్‌లోనూ రికార్డులు తిరగరాస్తున్న హారర్ మూవీ.. ఏ ఓటీటీలో చూడాలంటే?
OTT Horror Movie: ఓ హారర్ మూవీ రీరిలీజ్ లోనూ రికార్డులు తిరగరాస్తోంది. నిజానికి తొలిసారి రిలీజైనప్పటి కంటే కూడా ఇప్పుడే ఎక్కువ కలెక్షన్లు రాబట్టేలా కనిపిస్తోంది. మరి ఈ హారర్ మూవీ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?
OTT Horror Movie: హారర్ జానర్ సినిమాలకు ఓటీటీల్లో ఎంత ఫాలోయింగ్ ఉంటుందో తెలుసు కదా. అయితే ఇప్పుడో హారర్ మూవీ రీరిలీజ్ లోనూ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాస్తోంది. ఫస్ట్ వీకెండ్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ మూవీ రూ.7.5 కోట్లు వసూలు చేయడం విశేషం. మనం మాట్లాడుకుంటున్న ఆ హారర్ మూవీ పేరు తుంబాద్.
తుంబాద్ రీరిలీజ్ బాక్సాఫీస్
తుంబాద్ మూవీ 2018లో తొలిసారి రిలీజైంది. 100 ఏళ్లుగా ఎవరూ వెళ్లని లొకేషన్లలో తీసిన ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే రూ.15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా.. మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర రూ.12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో ఓ ఫ్లాప్ గా నిలిచిపోయింది. కానీ ఇప్పుడు రీరిలీజ్ లో ఫస్ట్ వీకెండే ఏకంగా రూ.7.5 కోట్లు రాబట్టడం విశేషం.
తుంబాద్ మూవీ గత శుక్రవారం (సెప్టెంబర్ 13) థియేటర్లలో రీరిలీజైంది. తొలి రోజు రూ.1.6 కోట్లు రాగా.. తర్వాతి రెండు రోజులు కలెక్షన్లు వరుసగా పెరుగుతూ వెళ్లాయి. శనివారం రెండో రోజు రూ.2.6 కోట్లు, మూడో రోజు ఆదివారం రూ.3.25 కోట్లు వచ్చాయి. దీంతో మొత్తంగా మూడు రోజుల్లో రూ.7.5 కోట్లు రాబట్టింది. ఓ చిన్న సినిమా రీరిలీజ్ లో ఇంత భారీ వసూళ్లు సాధించడం నిజంగా విశేషమే.
తుంబాద్ ఓటీటీ స్ట్రీమింగ్
తుంబాద్ మూవీ రీరిలీజ్ లోనూ తొలి మూడు రోజుల్లోనే రూ.7.5 కోట్లు సాధించిన తొలి సినిమాగా నిలిచింది. అయితే 2018లో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో మాత్రం ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు రీరిలీజ్ లో ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు.
రానున్న రోజుల్లో మరో రూ.6 కోట్లు వసూలు చేస్తే మాత్రం మూవీ హిట్ గా నిలుస్తుంది. ప్రస్తుతం మూవీ జోరు చూస్తుంటే.. అదేమంత పెద్ద విషయంలా కనిపించడం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో పెద్దగా కొత్త సినిమాలు కూడా ఏవీ లేవు. సోమవారం (సెప్టెంబర్ 16) కూడా హాలీడే కావడంతో తుంబాద్ వసూళ్లు తగ్గకపోవచ్చు.
ఇక తుంబాద్ మూవీకి సీక్వెల్ కూడా వస్తోంది. తుంబాద్ 2 పేరుతో ఈ మూవీ ఫస్ట్ పార్ట్ రీరిలీజ్ సందర్భంగానే సీక్వెల్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ హారర్ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీలో లీడ్ రోల్ పోషించిన సోహమ్ షా ఈ విషయాన్ని కన్ఫమ్ చేశాడు.