Telugu Tv Shows Trp Ratings: తెలుగు టీవీ షోస్ లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్ -బిగ్‌బాస్ టాప్ -సెకండ్ ప్లేస్‌లో కామెడీ షో
Telugu Tv Shows Trp Ratings: లేటెస్ట్ టీవీ షోస్ టీఆర్‌పీ రేటింగ్‌లో బిగ్‌బాస్ 8 అదరగొట్టింది. బిగ్‌బాస్ వీక్ ఎపిసోడ్స్‌కు అర్బన్ ఏరియాస్‌లో 5.79 టీఆర్‌పీ వచ్చింది. బిగ్‌బాస్ తర్వాత శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం సెకండ్ ప్లేస్‌లో నిలిచింది.
Telugu Tv Shows Trp: తెలుగు టీవీ షోస్ లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ వచ్చేశాయి. టీవీ షోస్ టీఆర్‌పీలో బిగ్‌బాస్ 8 టాప్‌లో కొనసాగుతోంది. వీకెండ్‌లోనే కాదు...వీక్ ఎపిసోడ్స్‌లో టీఆర్‌పీ పరంగా బిగ్‌బాస్ అదరగొడుతోంది. బార్క్ ప్రకటించిన లాస్ట్ వీక్ టీవీ షోస్ టీఆర్‌పీ రేటింగ్‌లో బిగ్‌బాస్ ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా...ఆదివారం విత్ స్టార్ మా పరివారం సెకండ్ ప్లేస్‌ను దక్కించుకున్నవి.
బిగ్‌బాస్ వీక్ ఎపిసోడ్స్
బిగ్‌బాస్ 8 తెలుగు వీక్ ఎపిసోడ్స్‌కు అర్బన్, రూరల్ ఏరియాల్లో 4.73 టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. అర్బన్ ఏరియాలో బిగ్‌బాస్‌కు ఆదరణ ఎక్కువగా కనిపిస్తోంది. 5.79 టీఆర్‌పీ వచ్చింది.
ఆదివారం విత్ స్టార్ మా పరివారం
బిగ్‌బాస్ తర్వాత శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం రెండో స్థానంలో కొనసాగుతోంది.అర్బన్, రూరల్ ఏరియాల్లో కలిపి ఈ షోకు 4.56 టీఆర్‌పీ రాగా...అర్బన్ ఏరియాలో 4.29 వచ్చింది. ప్రతి వారం సీరియల్ స్టార్స్ ఆటపాటలతో సందడి చేస్తుండటంతో ఈ ఫన్ గేమ్ షో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. సెప్టెంబర్ 15 నాటి ఎపిసోడ్‌తో ఆదివారం విత్ స్టార్ మా పరివారం 100 ఎపిసోడ్స్‌ను పూర్తిచేసుకున్నది.
శ్రీదేవి డ్రామా కంపెనీ
మూడో స్థానంలో ఈటీవీలో టెలికాస్ట్ అవుతోన్న కామెడీ షో శ్రీదేవి డ్రామా కంపెనీ నిలిచింది. ఈ షోకు 4.15 టీఆర్‌పీ వచ్చింది. శ్రీదేవి డ్రామా కంపెనీ తర్వాత 3.02తో ఢీ డ్యాన్స్ షో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. జబర్ధస్థ్ 2.76, సుమ అడ్డా 1.97 టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్నాయి. పాడుతా తీయగాకు 2.18 టీఆర్‌పీ వచ్చింది.
స్టార్ మా డామినేషన్
టీషోస్ టీఆర్‌పీ రేటింగ్‌లో స్టార్ మా ఛానెల్ షోస్ టాప్‌లో ఉన్నాయి. ఇదివరకు టీవీ షోస్‌లో ఈటీవీ డామినేషన్ కొనసాగేది. ఈటీవీని స్టార్ మా దాటేసింది.బిగ్‌బాస్, ఆదివారం విత్ స్టార్ మా పరివారం రెండు స్టార్ మాలోనే టెలికాస్ట్ అవుతోన్నాయి. స్టార్ మా షోస్ తర్వాత ఈటీవీ షోస్ డామినేషన్ కనిపిస్తోంది. జీ తెలుగు షోస్ ఆడియెన్స్‌ను అంతగా మెప్పించలేకపోయాయి.
డ్రామా జూనియర్స్
లేటెస్ట్ టీఆర్‌పీలో జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న డ్రామా జూనియర్స్ 2.13 టీఆర్‌పీ రేటింగ్‌ను దక్కించుకున్నది. మిగిలిన జీ5 షోస్ కూడా పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయాయి.
బిగ్‌బాస్ లాంఛింగ్ ఎపిసోడ్ ఏకంగా 18.9 టీఆర్‌పీ రేటింగ్‌ను దక్కించుకొని రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు బిగ్‌బాస్ చరిత్రలో సీజన్ ఫోర్ లాంఛింగ్ ఎపిసోడ్‌కు మాత్రమే 18. 5 టీఆర్‌పీ వచ్చింది. సీజన్ ఫోర్ రికార్డును సీజన్ 8 అధిగమించింది. ఈ సారి కూడా బిగ్‌బాస్ వీకెండ్స్ ఎపిసోడ్స్ భారీగా టీఆర్‌పీ రానున్నట్లు సమాచారం.