OTT Spy Thriller: ఓటీటీలో దుమ్మురేపుతున్న స్పై థ్రిల్లర్ చిత్రం.. మూడు రోజుల్లోనే మైల్‍స్టోన్ దాటేసిన మూవీ
Berlin - Spy Thriller OTT Movie: బెర్లిన్ చిత్రం ఓటీటీలో దూసుకెళుతోంది. నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చిన ఈ మూవీ ఆరంభం నుంచి మంచి వ్యూస్ దక్కించుకుంటోంది. దీంతో ఈ స్పై థ్రిల్లర్ సినిమా మూడు రోజుల్లోనే ఓ మైలురాయి అధిగమించింది.
‘బెర్లిన్’ చిత్రం మంచి అంచనాలతో ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజిల్స్, హాబిటాట్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‍బోర్న్ సహా మరిన్ని ఈవెంట్లలో ఈ స్పై థ్రిల్లర్ చిత్రం ప్రదర్శితమైంది. అనంతరం ఇటీవలే ఓటీటీలోకి డైరెక్ట్‌గా స్ట్రీమింగ్‍కు వచ్చేసింది బెర్లిన్ మూవీ. అపర్‌శక్తి ఖురానా, ఇష్వాక్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. మంచి ఆరంభం అందుకుంది.
50 మిలియన్ మినిట్స్ దాటి..
బెర్లిన్ చిత్రం గత శుక్రవారం సెప్టెంబర్ 13వ తేదీన జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. హిందీలో స్ట్రీమ్ అవుతోంది. అయితే, ఈ చిత్రం తొలి మూడు రోజుల్లోనే 50 మిలియన్ వాచ్ మినిట్స్ మైల్‍స్టోన్‍ను దాటేసింది. ఈ విషయాన్ని జీ5 ఓటీటీ నేడు (సెప్టెంబర్ 16) అధికారికంగా వెల్లడించింది.
బెర్లిన్ చిత్రం 50 మిలియన్ వాచ్ నిమిషాలు అధిగమించిందంటూ ఓ పోస్టర్ రివీల్ చేసింది జీ5. బెర్లిన్ కేసులో అందరూ లాక్ అయ్యారంటూ రాసుకొచ్చింది. “గూఢచర్యం ఇంత కంటే బాగా ఎప్పుడూ కనిపించలేదు. స్పై గేమ్‍లో బెర్లిన్ అదరగొట్టింది” అని సోషల్ మీడియాలో జీ5 పోస్ట్ చేసింది.
బెర్లిన్ మూవీకి అతుల్ సబర్వాల్ దర్శకత్వం వహించారు. విదేశీ గూఢచారిగా అనుమానించి ఓ బధిరుడిని విచారించడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ట్విస్టులు, టర్నులతో ఈ థ్రిల్లర్ చిత్రం ముందుకు నడుస్తుంది. ఈ చిత్రంలో అపర్‌శక్తి ఖురానా, ఇష్వాక్‍తో పాటు రాహుల్ బోస్, అనుప్రియ గోయెంక, కబీర్ బేడీ, జిగర్ మెహతా, రితేశ్ శ్రీనివాస్ కీలకపాత్రల్లో నటించారు.
బెర్లిన్ చిత్రాన్ని జీ స్టూడియోస్, యిప్పీకీ యాయ్ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై మానవ్ శ్రీవాత్సవ్, ఉమేశ్ కేఆర్ భన్సాల్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీకి శ్రీదత్త నమ్‍జోషి సినిమాటోగ్రఫీ చేయగా.. ఇరెనే ధార్ మాలిక్ ఎడిటింగ్ చేశారు.
బెర్లిన్ మూవీ స్టోరీ ఇలా..
1993 బ్యాక్‍డ్రాప్‍లో ఢిలీల్లో బెర్లిన్ మూవీ సాగుతుంది. మాట, వినికి సరిగా లేని బధిరుడైన అశోక్ కుమార్ (ఇష్వాక్ సింగ్)ను ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుంటారు. అతడిని విదేశీ గూఢచారిగా అనుమానిస్తున్నారు. భారత పర్యటనకు రష్యా అధ్యక్షుడు వచ్చే ముందే ఇది జరుగుతుంది. అశోక్‍ను విచారించేందుకు సైన్ లాంగ్వేజ్ నిపుణుడైన పుష్కిన్ వర్మ (అపర్‌శక్తి ఖురానా)ను ఇంటెలిజెన్స్ అధికారి జగదీశ్ సోంధీ (రాహుల్ బోస్) తీసుకొస్తారు. అశోక్‍ను పుష్కిన్ విచారిస్తారు. ఈ క్రమంలో చాలా విషయాలు, ట్విస్టులు బయటికి వస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకీ అశోక్ ఎవరు? విచారణలో ఏం తేలింది? అనే విషయాలు బెర్లిన్ చిత్రంలో ప్రధానంగా ఉంటాయి.
జీ5లో ‘డీమోంటి కాలనీ 2’
తమిళ హారర్ థ్రిల్లర్ చిత్రం ‘డీమోంటి కాలనీ 2’.. సెప్టెంబర్ 27వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. తమిళం, తెలుగులో స్ట్రీమింగ్ అవనుంది. అరుళ్‍నిథి, ప్రియా భవానీ శంకర్ లీడ్ రోల్ చేసిన ఈ సీక్వెల్ మూవీకి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆగస్టులో థియేటర్లలోకి వచ్చి మంచి హిట్ అయింది. ఇప్పుడు సెప్టెంబర్ 27న జీ5లోకి డీమోంటి కాలనీ స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది.