Shekar Basha Remuneration: శేఖర్ బాషా బిగ్‌బాస్ రెమ్యునరేషన్ రోజుకు ఎంతంటే? - రెండు వారాల్లో దక్కింది తక్కువే!
Shekar Basha : బిగ్‌బాస్ 8 తెలుగు సెకండ్ వీక్‌లో శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేషన్ విషయంలో శేఖర్ బాషాకు అన్యాయం జరిగిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తోన్నారు. కాగా రెండు వారాలు హౌజ్‌లో కొనసాగినందుకు శేఖర్ బాషాకు ఐదు లక్షల రెమ్యునరేషన్ దక్కినట్లు ప్రచారం జరుగుతోంది.
Shekar Basha Remuneration: బిగ్‌బాస్ 8 తెలుగు నుంచి సెకండ్ వీక్‌లో ఊహించని విధంగా శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌లో ఒకరిగా బిగ్‌బాస్‌హౌజ్‌లోకి అడుగుపెట్టిన శేఖర్ బాషా రెండు వారాల్లోనే బయటకురావడం ఫ్యాన్స్ షాకింగ్‌గా ఫీలవుతున్నారు.
హౌజ్‌లో అడుగుపెట్టిన ఫస్ట్ డే నుంచి ఫన్ డైలాగ్స్‌తో అంతో ఇంతో ఆడియెన్స్‌తో పాటు కంటెస్టెంట్స్‌ను ఎంటర్‌టైన్‌చేస్తూ వచ్చాడు శేఖర్. ఎలిమినేషన్ ఓటింగ్‌లోనూఆడియెన్స్ నుంచి శేఖర్ బాషాకే ఎక్కువగా ఓట్లు పడ్డాయి. అయినా మిగిలిన కంటెస్టెంట్స్‌లో శేఖర్ బాషాకు ఉన్న వ్యతిరేకత కారణంగా అతడు హౌజ్ నుంచి బయటకు రావాల్సివచ్చింది.
ఆదిత్యం ఓం వర్సెస్ శేఖర్ బాషా...
సండే ఎపిసోడ్‌లో చివరగా నామినేషన్స్‌లో ఉన్న ఆదిత్య ఓం, శేఖర్ బాషాలలో ఎవరు బిగ్‌బాస్‌లో కొనసాగాలో, ఎవరు హౌజ్ నుంచి ఎలిమినేట్ కావాలో కంటెస్టెంట్స్ డిసైడ్ చేయాలని నాగార్జున టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో ఒక్క కిరాక్ సీత మినహా మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ శేఖర్ బాషా ఎలిమినేట్ కావాలని అన్నారు.
సిల్లీ రీజన్స్…
శేఖర్ బాషాలో గేమ్ పట్ల ఫోకస్, కసి కనిపించడం లేదని, టాస్క్‌లలో డల్‌గా ఉంటున్నాడని, అతడిలో జోష్ తగ్గిందంటూ అందరూ ఒకేలా సిల్లీ రీజన్స్ చెప్పారు. శేఖర్ బాషా కంటే ఆదిత్య ఓం ఆటతీరు ఏమంత గొప్పగా లేదు. కానీ బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్‌ల విషయంలో శేఖర్ బాషా కంటే కొంత ఆదిత్యం ఓం కొంత యాక్టివ్‌గా కనిపిస్తున్నాడు. అదే ఎలిమినేషన్ విషయంలో శేఖర్‌కు మైనస్‌గా మారింది. ఆదిత్యకు ప్లస్సయింది.
ఎలిమినేట్ అయిన తర్వాత ఆదిత్య ఓంపై శేఖర్ బాషా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఆదిత్యను ఫేక్ కంటెస్టెంట్‌గా శేఖర్ బాషా పేర్కొన్నాడు. ఆదిత్య తనను మూడుసార్లు నామినేట్ చేసినా స్పోర్టివ్‌గా తీసుకున్నానని, కానీ తాను ఒక్కసారి ఆదిత్యను నామినేట్ చేసినందుకే సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టాడని శేఖర్ బాషా అన్నాడు.
రాంగ్ డెసిషన్...
ఎలిమినేషన్ విషయంలో శేఖర్ బాషాకు అన్యాయం జరిగిందని ఫ్యాన్స్‌తో పాటు మాజీ కంటెస్టెంట్స్ చెబుతోన్నారు. శేఖర్ బాషా ఎలిమినేషన్ రాంగ్ డెసిషన్ అంటూ మాజీ కంటెస్టెంట్ గీతా రాయల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
వేస్ట్ కంటెస్టెంట్స్‌ను హౌజ్‌లో కొనసాగిస్తూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌ను బయటకు పంపిస్తున్నారని, ఇలాగైనే బిగ్‌బాస్ 8 సక్సెస్ కావడం కష్టమేనంటూ గీతూరాయల్ అన్నది. ఫ్యాన్స్ కూడా శేఖర్ బాషా ఎలిమినేట్ కావాల్సిన కంటెస్టెంట్ కాదని అంటున్నారు. జెలసీతోనే అతడిని కంటెస్టెంట్స్ అందరూ బయటకు పంపించారని చెబుతోన్నారు.
రోజుకు 35 వేలు...
రెండు వారాల్లోనే బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయినా శేఖర్ బాషా మోస్తారు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. రోజుకు 35 వేల చొప్పున...వారానికి రెండు లక్షల యాభై వేల రెమ్యునరేషన్‌తో శేఖర్ బాషా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్లు చెబుతోన్నారు. రెండు వారాలు బిగ్‌బాస్ హౌజ్‌లో ఉన్న శేఖర్ బాషా మొత్తంగా ఐదు లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. కనీసం నాలుగు వారాలు హౌజ్‌లో కొనసాగితే మంచి రెమ్యునరేషన్ శేఖర్ బాషాకు దక్కేదని కామెంట్స్ పెడుతోన్నారు.