OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి రానున్న రజినీకాంత్ సినిమా.. థియేటర్ వెర్షన్ కంటే డిఫరెంట్‍గా ఉంటుందంట!-rajinikanth sports action drama movie lal salaam to release on netflix soon with directors cut team found hard disk ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: ఎట్టకేలకు ఓటీటీలోకి రానున్న రజినీకాంత్ సినిమా.. థియేటర్ వెర్షన్ కంటే డిఫరెంట్‍గా ఉంటుందంట!

OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి రానున్న రజినీకాంత్ సినిమా.. థియేటర్ వెర్షన్ కంటే డిఫరెంట్‍గా ఉంటుందంట!

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 16, 2024 03:55 PM IST

Lal Salaam OTT: లాల్ సలామ్ సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలో ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చేసింది. త్వరలోనే ఈ మూవీ స్ట్రీమింగ్‍కు రానున్నట్టు కనిపిస్తోంది. ఈ విషయాన్ని దర్శకురాలు ఐశ్వర్య రజినీకాంత్ వెల్లడించారు. పోయిన హార్డ్‌డిస్క్ దొరికినట్టు వెల్లడించారు. ఆ వివరాలివే..

Lal Salaam OTT: దొరికిన హార్డ్‌డిస్క్.. ఓటీటీలోకి రానున్న రజినీకాంత్ సినిమా.. థియేటర్ వెర్షన్ కంటే డిఫరెంట్‍గా ఉంటుందంట!
Lal Salaam OTT: దొరికిన హార్డ్‌డిస్క్.. ఓటీటీలోకి రానున్న రజినీకాంత్ సినిమా.. థియేటర్ వెర్షన్ కంటే డిఫరెంట్‍గా ఉంటుందంట! (twitter)

లాల్ సలామ్ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అనే నిరీక్షణ సుదీర్ఘంగా కొనసాగుతోంది. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్యమైన పాత్ర పోషించిన ఈ మూవీ ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఈ మూవీకి రజినీ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించారు. విష్ణు విశాల్, విక్రాంత్ లీడ్ రోల్స్ చేశారు. ఈ మూవీ థియేటర్లలో రిలీజై ఎనిమిది నెలలు దాటినా ఇప్పటి వరకు ఓటీటీలోకి రాలేదు.

లాల్ సలామ్ ఓటీటీకి వస్తోందంటూ కొన్నిసార్లు రూమర్లు వచ్చినా.. అలా జరగలేదు. అసలు స్ట్రీమింగ్ ఆలస్యానికి కారణం కూడా స్పష్టంగా వెల్లడి కాలేదు. అయితే, ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు డైరెక్టర్ ఐశ్వర్య రజినీకాంత్. దీంతో లాల్ సలామ్ ఓటీటీ విషయంలో క్లారిటీ వచ్చేసింది.

చిక్కిన హార్డ్‌డిస్క్

లాల్ సలామ్‍కు సంబంధించిన ఓ హార్డ్‌డిస్క్ పోయిందని, దాంట్లో ముఖ్యమైన సీన్లు ఉన్నాయని మూవీ రిలీజ్ తర్వాత ఐశ్వర్య రజినీకాంత్ చెప్పారు. ఆ సీన్లు ఉంటే మూవీ మరో రేంజ్‍లో ఉండేదని అన్నారు. ఈ చిత్రం విఫలమయ్యేందుకు అది కూడా ఓ కారణమని చెప్పారు. అయితే, ఇప్పుడు ఆ హార్డ్‌డిస్క్ దొరికిందని తాజాగా వెల్లడించారు ఐశ్వర్య. దీంతో త్వరలోనే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్‍కు వస్తుందని తెలిపారు.

డిఫరెంట్ వెర్షన్

లామ్ సలామ్‍ థియేటర్ వెర్షన్ కంటే ఓటీటీ వెర్షన్ చాలా డిఫరెంట్‍గా ఉంటుందని ఐశ్వర్య వెల్లడించారు. హార్డ్‌డిస్క్‌లో ఉన్న ముఖ్యమైన సీన్లతో కలిపి డైరెక్టర్ వెర్షన్‍ను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు తీసుకొస్తామని చెప్పారు. ఇప్పుడు యాడ్ చేయబోయే సీన్లకు బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేసేలా సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్‍తోనే చర్చించినట్టు వెల్లడించారు.

లాల్ సలామ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు నెట్‍ఫ్లిక్స్‌తో పాటు సన్ నెక్స్ట్ కూడా దక్కించుకుంది. దీంతో రెండు ఓటీటీల్లో ఈ మూవీ స్ట్రీమింగ్‍కు వస్తున్నాయి. ఓటీటీ వెర్షన్ రెడీ అయ్యాక స్ట్రీమింగ్ డేట్ వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.

లాల్ సలామ్ మూవీని మత కలహాల అంశంతో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు ఐశ్వర్య. అయితే, ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. రజినీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్‍తో పాటు లివింగ్ స్టోన్, సెంథిల్, జీవిత, కేఎస్ రవికుమార్, తంబి రామయ్య, నిరోషా ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు.

లాల్ సలామ్ సినిమా సుమారు రూ.80కోట్ల బడ్జెట్‍తో రూపొందిందని అంచనా. అయితే, ఈ చిత్రం రూ.20కోట్లలోపే కలెక్షన్లు దక్కించుకుంది. ప్లాఫ్‍గా నిలిచింది. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ మూవీని నిర్మించారు.

కాగా, రజినీకాంత్ ప్రస్తుతం టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టైయన్ చిత్రం చేస్తున్నారు. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, దగ్గుబాటి రానా, ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రం కూడా రజినీ చేస్తున్నారు.