Manasilaayo Song: రజినీకాంత్ ‘వెట్టైయన్’ నుంచి తొలి సాంగ్ వచ్చేసింది.. అదిరిపోయే మాస్ బీట్ ఇచ్చిన అనిరుధ్-first song manasilaayo released from rajinikanth vettaiyan movie anirudh ravichander gave mass beat ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Manasilaayo Song: రజినీకాంత్ ‘వెట్టైయన్’ నుంచి తొలి సాంగ్ వచ్చేసింది.. అదిరిపోయే మాస్ బీట్ ఇచ్చిన అనిరుధ్

Manasilaayo Song: రజినీకాంత్ ‘వెట్టైయన్’ నుంచి తొలి సాంగ్ వచ్చేసింది.. అదిరిపోయే మాస్ బీట్ ఇచ్చిన అనిరుధ్

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 09, 2024 06:24 PM IST

Vettaiyan First Single - Manasilaayo Song: వెట్టైయన్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. రజినీకాంత్ సింపుల్ స్టెప్‍లతో అదరగొట్టారు. ఈ పాటకు మాస్ బీట్ అందించారు అనిరుధ్ రవిచందర్.

Manasilaayo Song: రజినీకాంత్ ‘వెట్టైయన్’ నుంచి తొలి సాంగ్ వచ్చేసింది.. అదిరిపోయే మాస్ బీట్ ఇచ్చిన అనిరుధ్
Manasilaayo Song: రజినీకాంత్ ‘వెట్టైయన్’ నుంచి తొలి సాంగ్ వచ్చేసింది.. అదిరిపోయే మాస్ బీట్ ఇచ్చిన అనిరుధ్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న వెట్టైయన్ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ స్టార్ దగ్గుబాటి రానా, మలయాళ యాక్టర్ ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్ కూడా ఈ చిత్రంలో లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ మల్టీస్టారర్ యాక్షన్ డ్రామా మూవీకి జైభీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ తరుణంలో వెట్టైయన్ నుంచి తొలి పాట నేడు (సెప్టెంబర్ 9) రిలీజ్ అయింది.

ఫాస్ట్ బీట్‍తో.. స్టైలిష్‍గా రజినీ

వెట్టైయన్ నుంచి మనసిలాయో అంటూ ఫస్ట్ సాంగ్ నేడు వచ్చింది. లిరికల్ సాంగ్‍ను మూవీ టీమ్ తీసుకొచ్చింది. తలైవా రజినీకాంత్ మరోసారి తన మార్క్ స్టైలిష్ సింపుల్ స్టెప్‍లతో మెప్పించారు. మంజూ వారియర్ డ్యాన్స్‌తో దుమ్మురేపారు. ఇక రజినీతో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ డ్యాన్స్ కూడా ఈ లిరికల్ వీడియోలో ఉంది.

మనసిలాయో పాటకు ఫాస్ట్ మాస్ బీట్ ఇచ్చారు అనిరుధ్. మరోసారి తలైవాకు అదిరిపోయే సాంగ్ అందించారు. ఈ పాట కూడా హిట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రజినీకాంత్ గత మూవీ జైలర్‌కు అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ పెద్ద బలంగా నిలిచింది. ఇప్పుడు వెట్టైయన్‍కు కూడా తొలి పాటతోనే అనిరుధ్ మెప్పించారు.

ఏఐ సాయంతో..

మనసిలాయో పాట కోసం ప్రముఖ దిగ్గజ సింగర్ మలేసియా వాసుదేవన్ గాత్రాన్ని ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీ సాయంతో తీసుకొచ్చారు అనిరుధ్ రవిచందర్. ఆయన గొంతును రీక్రియేట్ చేశారు. మలేసియా వాసుదేవన్ గాత్రంతో పాటు యుగేంద్రన్ వాసుదేవన్, అనిరుధ్ రవిచందర్, దీప్తి సురేశ్ కూడా ఈ పాటను ఆలపించారు. సూపర్ సుబ్బు, విష్ణు ఇడవన్ ఈ పాటకు లిరిక్స్ అందించారు. ప్రస్తుతం తమిళంలోనే ఈ పాట వచ్చింది. త్వరలోనే తెలుగులోనూ రానుంది.

రిలీజ్ డేట్‍పై క్లారిటీ

వెట్టైయన్ సినిమా అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ అవుతుందని మూవీ టీమ్ గతంలోనే వెల్లడించింది. అయితే, వాయిదా పడుతుందనే కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. అయితే, అక్టోబర్ 10నే వస్తుందని ఈ సాంగ్‍తో మరోసారి క్లారిటీ ఇచ్చింది వెట్టైయన్ టీమ్. దీంతో టెన్షన్ వీడింది.

స్టార్ హీరో సూర్య నటించిన కంగువ చిత్రం కూడా అక్టోబర్ 10వ తేదీన రావాల్సి ఉంది. అయితే, రజినీకాంత్ చిత్రంతో పోటీ వద్దనుకొని వాయిదా వేసుకునేందుకు కంగువ టీమ్ డిసైడ్ అయింది. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఈవెంట్‍లో సూర్య కూడా చెప్పారు. రజినీపై తమకు అపారమైన గౌరవం ఉందని, ఆయన మూవీనే ముందు రావాలని చెప్పారు.

వెట్టైయన్ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించారు. ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 10వ తేదీన తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడలో రిలీజ్ చేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేసింది. వెట్టైయన్‍లో రజినీ, అమితాబ్, రానా, ఫాహద్‍తో పాటు రితికా సింగ్, దుషరా విజయన్, రోహిణి, రావు రమేశ్, రక్షణ్ కీరోల్స్ చేశారు.