Thalaivar 170 Title: రజినీకాంత్ నెక్స్ట్ సినిమా పేరు ఇదే: టైటిల్ టీజర్ రిలీజ్.. మూవీలో అమితాబ్, రానా కూడా..-vettaiyan is the title of thalaivar 170 revealed on rajinikanth birthday ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thalaivar 170 Title: రజినీకాంత్ నెక్స్ట్ సినిమా పేరు ఇదే: టైటిల్ టీజర్ రిలీజ్.. మూవీలో అమితాబ్, రానా కూడా..

Thalaivar 170 Title: రజినీకాంత్ నెక్స్ట్ సినిమా పేరు ఇదే: టైటిల్ టీజర్ రిలీజ్.. మూవీలో అమితాబ్, రానా కూడా..

Thalaivar 170 - Vettaiyan: రజినీకాంత్ తదుపరి సినిమాకు టైటిల్ ఫిక్స్ అయింది. రజినీ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం పేరును మూవీ యూనిట్ వెల్లడించింది.

Thalaivar 170 Title: రజినీకాంత్ నెక్స్ట్ సినిమా పేరు ఇదే: టైటిల్ టీజర్ రిలీజ్

Thalaivar 170 - Vettaiyan: జైలర్ సినిమాతో ఈ ఏడాది భారీ బ్లాక్‍బాస్టర్ హిట్ కొట్టారు తమిళ సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్. తదుపరి ఆయన జైభీమ్ ఫేమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. రజినీకాంత్‍కు ఇది 170వ చిత్రం కావడంతో ఈ ప్రాజెక్టును తొలుత ‘తలైవర్ 170’గా పిలిచారు. అయితే, నేడు (డిసెంబర్ 12) రజినీ 73వ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా అధికారిక టైటిల్‍ను మూవీ యూనిట్ వెల్లడించింది. టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేసింది.

తలైవర్ 170 చిత్రానికి.. ‘వెట్టైయన్’ (Vettaiyan) టైటిల్ ఖరారైంది. ఈ టైటిల్‍ను ప్రకటించేందుకు ఓ టీజర్‌ను కూడా మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఈ టీజర్లో రజినీకాంత్ ఎంట్రీ స్టైలిష్‍గా ఉంది. తన మార్క్ స్వాగ్‍తో తలైవా మరోసారి అదరగొట్టారు. గ్లాసెస్ పెట్టుకోవడం, గన్‍తో కాల్చడం సహా మొత్తంగా ‘వెట్టైయన్ టైటిల్ టీజర్‌లోనే స్టైలిష్‍గా కనిపించారు రజినీ. వేట మొదలైనప్పుడు.. ఆహారం తప్పక దొరుకుతుంది అని తమిళంలో డైలాగ్ చెప్పారు రజినీ.

‘వెట్టైయన్' చిత్రంలో బాలీవుడ్ దిగ్గజ యాక్టర్ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి, మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్, మంజూ వారియర్, రితికా సింగ్, దసరా విజయన్ లాంటి ప్రముఖ నటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. జైభీమ్ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన టీజే జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని పవర్ ఫుల్ యాక్షన్ మూవీగా రూపొందించనున్నారు.

‘వెట్టైయన్' మూవీలో అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కొన్ని యథార్థ ఘటనల ఆధారంగానే వెట్టైయన్ సినిమాను డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో రజినీ నటించనున్నారని టాక్. ఈ విషయాలపై త్వరలోనే క్లారిటీ రానుంది.