Suriya on Kanguva Release: కంగువ రిలీజ్ వాయిదాపై హింట్ ఇచ్చిన సూర్య.. ఆయన సినిమానే ముందు రావాలన్న స్టార్ హీరో-rajinikanth vettaiyan best to come first suriya hits kanguva release date postpone ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Suriya On Kanguva Release: కంగువ రిలీజ్ వాయిదాపై హింట్ ఇచ్చిన సూర్య.. ఆయన సినిమానే ముందు రావాలన్న స్టార్ హీరో

Suriya on Kanguva Release: కంగువ రిలీజ్ వాయిదాపై హింట్ ఇచ్చిన సూర్య.. ఆయన సినిమానే ముందు రావాలన్న స్టార్ హీరో

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 01, 2024 02:37 PM IST

Suriya on Kanguva Release: వెట్టైయన్, కంగువ సినిమాల బాక్సాఫీస్ క్లాష్ ఉంటుందేమోనని కోలీవుడ్‍లో కొంతకాలంగా ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ రెండు చిత్రాల పోటీ ఎలా ఉంటుందోనన్న క్యూరియాసిటీ ఏర్పడింది. అయితే, కంగువ వాయిదా పడుతుందని రూమర్లు వచ్చాయి. ఈ దిశగా ఇప్పుడు హింట్ ఇచ్చారు హీరో సూర్య.

Suriya on Kanguva Release: కంగువ రిలీజ్ వాయిదాపై హింట్ ఇచ్చిన సూర్య.. ఆయన సినిమానే ముందు రావాలన్న స్టార్ హీరో
Suriya on Kanguva Release: కంగువ రిలీజ్ వాయిదాపై హింట్ ఇచ్చిన సూర్య.. ఆయన సినిమానే ముందు రావాలన్న స్టార్ హీరో

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో నటించిన ‘వెట్టైయన్‍‍’, స్టార్ హీరో సూర్య భారీ బడ్జెట్ చిత్రం కంగువ ఒకే రిలీజ్ డేట్‍ను ఫిక్స్ చేసుకోవడంతో ఉత్కంఠ నెలకొంది. దసరా సందర్భంగా అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేస్తామని ఆ మూవీ టీమ్స్ ప్రకటించాయి. భారీ అంచనాలు ఉన్న కంగువ, సూపర్ స్టార్ వెట్టైయన్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆసక్తి నెలకొంది. అయితే, కంగువ సినిమా వాయిదాకే మొగ్గుచూపుతుందనేలా హీరో సూర్య తాజాగా కామెంట్స్ చేశారు.

తన సోదరుడు కార్తీ హీరోగా నటించిన మేయళగన్ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్‍కు సూర్య హాజరయ్యారు. ఈ సందర్భంగా కంగువ, వెట్టైయన్ క్లాష్ గురించి మాట్లాడారు. కంగువ వాయిదా పడుతుందన్నట్టుగా దాదాపు చెప్పేశారు.

తమిళ సినిమాకు గుర్తింపు ఆయన

సూపర్ స్టార్ రజినీకాంత్ మీద గౌరవంతో ఆయన మూవీ వెట్టైయన్‍కు పోటీగా రాకుండా, కంగువను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నామనేలా సూర్య చెప్పారు. “అక్టోబర్ 10న వెట్టైయన్ చిత్రం వస్తోంది. గౌరవంతో ఆ సినిమాకు మనం దారి ఇవ్వాలి. ఆయన (రజినీకాంత్) నాకు చాలా సీనియర్. నేను పుట్టినప్పుడే ఆయన నటనలోకి వచ్చారు. తమిళ సినిమాకు ఆయన ఐడెంటిటీగా ఉన్నారు. సూపర్ స్టార్ సినిమానే ముందుగా వస్తే బాగుంటుంది. మీరందరూ నాతో ఉన్నారని నమ్ముతున్నా” అని సూర్య చెప్పారు.

1000 మంది, రెండున్నరేళ్లు

తమిళ సినిమాలో కంగువ స్పెషల్ సినిమాగా ఉంటుందని సూర్య చెప్పారు. ఇందుకోసం రెండున్నరేళ్లుగా 1000 మందికి పైగా పని చేశారని తెలిపారు. తాము పడిన కష్టం ఫలిస్తుందనే నమ్మకం పూర్తిగా ఉందనున్నారు. “తమిళ సినిమాలో కంగువ చిత్రాన్ని ప్రత్యేకంగా ముందుకు తీసుకొచ్చేందుకు రెండున్నరేళ్లకుపైగా 1000 కంటే ఎక్కువ మంది రేయింబవళ్లు కష్టపడ్డారు. దర్శకుడు శివ నుంచి నటీనటులు, టెక్నిషియన్లు అందరూ క్లిష్టమైన పరిస్థితుల్లో చాలా శ్రమించారు. ఈ కష్టం ఊరికే పోదని నాకు నమ్మకం ఉంది. ఈ మూవీ వచ్చినప్పుడు ప్రేక్షకులు ప్రేమ, గౌరవం ఇస్తారని అనుకుంటున్నా” అని సూర్య చెప్పారు.

కంగువ సినిమా పసిపాపలా అని సూర్య తెలిపారు. “కంగువ పసిపాప లాంటిది. పుట్టిన రోజే ఆ పాప పుట్టిన రోజు ఉంటుంది. పుట్టిన రోజును వేడుక సెలెబ్రేట్ చేసుకునేందుకు పండుగ చేయాలి. మీరందరూ నాతో ఉన్నారని నమ్ముతున్నా. కంగువ టీమ్ కోసం ప్రార్థించండి. ఆ రోజు అందరికీ ముఖ్యమైనదిగా చేద్దాం” అని సూర్య అన్నారు.

కంగువ రిలీజ్ వాయిదా పడడం ఖాయం అన్నట్టుగా సూర్య చెప్పేశారు. ఈ చిత్రం అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 31వ తేదీన వాయిదా పడుతుందనే రూమర్లు వస్తున్నాయి. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‍పై మూవీ టీమ్ ప్రకటన చేసే అవకాశం ఉంది.

కంగువ చిత్రాన్ని ఫ్యాంటసీ యాక్షన్ చిత్రంగా దర్శకుడు శివ తెరకెక్కించారు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‍తో ఈ చిత్రాన్ని స్టూడియోగ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లు రూపొందించాయి. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాలం భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. మరిన్ని భాషల్లోనూ తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో సూర్యతో పాటు బాబీ డియోల్, దిశా పటానీ, నటరాజన్ సుబ్రమణియం, జగపతి బాబు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు.