Kanguva Postponed: సూర్య ‘కంగువ’ సినిమా రిలీజ్ వాయిదా! కారణం ఇదే-suriya kanguva movie release to postpone due to vettaiyan clash ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kanguva Postponed: సూర్య ‘కంగువ’ సినిమా రిలీజ్ వాయిదా! కారణం ఇదే

Kanguva Postponed: సూర్య ‘కంగువ’ సినిమా రిలీజ్ వాయిదా! కారణం ఇదే

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 25, 2024 08:29 PM IST

Kanguva Postponed: కంగువ సినిమా వాయిదా పడడం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. అక్టోబర్ 10వ తేదీన విడుదల కావాల్సిన ఈ చిత్రం ఆలస్యం కానుంది. సూర్య హీరోగా నటించిన ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఉన్నాయి. దసరాకు రావాల్సిన ఈ చిత్రం పోస్ట్‌పోన్ అవనుందనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

Kanguva Postponed: సూర్య ‘కంగువ’ సినిమా రిలీజ్ వాయిదా! కారణం ఇదే
Kanguva Postponed: సూర్య ‘కంగువ’ సినిమా రిలీజ్ వాయిదా! కారణం ఇదే

తమిళ స్టార్ సూర్య హీరోగా నటిస్తున్న కంగువ చిత్రంపై ఫుల్ హైప్ ఉంది. ఈ ఫ్యాంటసీ యాక్షన్ సినిమాకు సిరుతై శివ దర్శకత్వం వహించారు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ ఈ చిత్రంపై అంచనాలను భారీగా పెంచేసింది. భారీ బడ్జెట్‍తో పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రం రూపొందింది. అక్టోబర్ 10వ తేదీన కంగువ మూవీని రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. అయితే, ఆ తేదీ నుంచి విడుదల వాయిదా పడడం ఖాయమైనట్టు తెలుస్తోంది.

వాయిదా ఇందుకే!

కంగువ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ చేయాలని మేకర్స్ గతంలో నిర్ణయించారు. ఈనెలలో వచ్చిన ట్రైలర్‌లోనూ ఈ డేట్‍నే పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు కంగువ వాయిదా పడనుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

తమిళ సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్ నటించిన వెట్టైయన్ చిత్రం కూడా అక్టోబర్ 10వ తేదీన విడుదల కానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద కంగువ, వెట్టైయన్ పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, డిస్ట్రిబ్యూటర్లు ఈ పోటీ వద్దని కంగువ మేకర్లపై ఒత్తిడి తెచ్చినట్టు రూమర్లు ఉన్నాయి. అందుకే కంగువ చిత్రాన్ని వాయిదా వేసేందుకు టీమ్ నిర్ణయించిందని ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం చక్కర్లు కొడుతోంది.

కంగువ మూవీ దసరా నుంచి దీపావళికి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని రూమర్లు వస్తున్నాయి. అక్టోబర్ 31వ తేదీకి ఈ చిత్రం పోస్ట్‌పోన్ కానుందని తెలుస్తోంది. కొత్త రిలీజ్ డేట్‍ను మేకర్స్ త్వరలోనే ప్రకటిస్తారనే సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

కంగువ గురించి..

కంగువ సినిమాలో సూర్యకు జోడీగా దిశా పటానీ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. నటరాజన్ సుబ్రమణియం, జగపతి బాబు, యోగిబాబు, రెడిన్ కింగ్‍స్లే, కోవై సరళ, వెన్నెల కిశోర్, మన్సూర్ అలీ ఖాన్, రియాజ్ ఖాన్, ఆనంద్ రాజా కీలకపాత్రలు పోషించారు. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించారు.

కంగువ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీకృష్ణ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించారు. సుమారు రూ.300 కోట్ల బడ్జెట్‍తో ఈ మూవీని రూపొందించారని అంచనాలు ఉన్నాయి. కంగువ మూవీ 2డీతో పాటు 3డీలోనూ రానుంది. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో భాషల్లోనూ రిలీజ్ కానుంది. ఈ సినిమాకు స్పందనను బట్టి ఆ తర్వాత కొన్ని విదేశీ భాషల్లోనూ విడుదల చేసే ప్లాన్‍లలో మేకర్స్ ఉన్నారు.

వెట్టైయన్ ఇలా..

రజినీకాంత్ హీరోగా నటిస్తున్న వెట్టైయన్ చిత్రానికి జైభీమ్ ఫేమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్, టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి ఈ చిత్రంలో మెయిన్ రోల్స్ చేస్తున్నారు. మంజు వారియర్, అభిరామి, రితికా సింగ్ కీరోల్స్ పోషించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 10న వెట్టైయన్ విడుదల కానుంది.