Thalaivar 171 Title: రజినీకాంత్ - కనగరాజ్ సినిమాకు టైటిల్ ఖరారు.. పవర్‌ఫుల్‍గా టీజర్: చూసేయండి-thalaivar 171 title rajinikanth lokesh kanagaraj movie title as coolie teaser with powerful action ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thalaivar 171 Title: రజినీకాంత్ - కనగరాజ్ సినిమాకు టైటిల్ ఖరారు.. పవర్‌ఫుల్‍గా టీజర్: చూసేయండి

Thalaivar 171 Title: రజినీకాంత్ - కనగరాజ్ సినిమాకు టైటిల్ ఖరారు.. పవర్‌ఫుల్‍గా టీజర్: చూసేయండి

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 22, 2024 07:23 PM IST

Thalaivar 171 Title - Coolie: రజినీకాంత్ - డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ సినిమా టైటిల్ ఫిక్స్ అయింది. టైటిల్ టీజర్‌ను మూవీ టీమ్ నేడు రిలీజ్ చేసింది. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్‍తో ఈ టీజర్ పవర్‌ఫుల్‍గా ఉంది.

Thalaivar 171 Title: రజినీకాంత్ - కనగరాజ్ సినిమాకు టైటిల్ ఖరారు.. పవర్‌ఫుల్‍గా టీజర్
Thalaivar 171 Title: రజినీకాంత్ - కనగరాజ్ సినిమాకు టైటిల్ ఖరారు.. పవర్‌ఫుల్‍గా టీజర్

Thalaivar 171 Title: తమిళ సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్.. భారీ యాక్షన్ చిత్రాలతో వరుసగా బ్లాక్‍బస్టర్లు కొట్టిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‍లో చిత్రంపై హైప్ విపరీతంగా ఉంది. ఈ సినిమా(Thalaivar 171)పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. లోకేశ్ హైవోల్టేజ్ యాక్షన్ మూవీలో రజినీకాంత్‍ను ఎప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా టైటిల్‍ను మూవీ టీమ్ ఖరారు చేసింది. రజినీ - లోకేశ్ మూవీ టైటిట్ టీజర్ నేడు (ఏప్రిల్ 22) రిలీజ్ చేసింది.

టైటిల్ ఇదే

రజినీకాంత్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‍లో రానున్న ఈ చిత్రానికి ‘కూలీ’ (Coolie) టైటిల్ ఫిక్స్ అయింది. ఇంతకాలం ఈ ప్రాజెక్టును తలైవర్ 171గా పిలువగా.. ఇప్పుడు పేరు ఖరారైంది. కూలీ టైటిల్ రివీల్ చేస్తూ ఓ టీజర్ కూడా తీసుకొచ్చింది మూవీ టీమ్.

వింటేజ్ ఫీల్‍తో యాక్షన్ ఫీస్ట్‌గా టీజర్

పవర్‌ఫుల్ యాక్షన్, వింటేజ్ చిత్రాలను గుర్తుచేసేలా ‘కూలీ’ మూవీ టైటిల్ టీజర్ ఉంది. పోర్టులో అక్రమంగా బంగారు స్మగ్లింగ్ చేస్తున్న బంకర్‌లోకి రజినీకాంత్ ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత అక్కడున్న గ్యాంగ్‍ను రజినీ చితక్కొడతారు.

గోల్డ్ వాచ్‍లతో రజినీ చేసే ఫైట్ హైలైట్‍గా ఉంది. వింటేజ్‍ లుక్‍లో తలైవా అదరగొట్టారు. బంగారాన్ని హైలైట్ చేస్తూ.. మిగిలినదంతా బ్లాక్‍ అండ్ వైట్‍లో ఉండడం ఈ టీజర్లో మరో ఇంట్రెస్టింగ్ విషయంగా ఉంది. గోల్డ్ బిస్కెట్లు, డబ్బుపై పడుకొని రజినీ విజిల్ వేసే షాట్ వారెవా అనిపించింది. 

రంగా (1982) సినిమాలోని ఫేమస్ డైలాగ్‍ను ఈ కూలీ టీజర్లోనూ చెప్పారు రజినీ. తంగా మగన్ (1983) సినిమా బ్యాక్‍గ్రౌండ్‍ను మిక్స్ చేసి.. ఈ టీజర్‌కు పవర్‌ఫుల్ బీజీఎం ఇచ్చారు అనిరుధ్ రవిచందర్.

కూలి టీజర్లో రజినీకాంత్ లుక్ అదిరిపోయింది. యాక్షన్ వింటేజ్ తలైవాను గుర్తు చేస్తోంది. ఇక, యాక్షన్, టేకింగ్‍లో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ మరోసారి తన మార్క్ చూపించారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టారు.

కూలీ సినిమాలో ఇతర నటీనటుల వివరాలను మూవీ టీమ్ ఇప్పటికి వెల్లడించలేదు. త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని పేర్కొంది. 2025లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. సన్‍ పిక్సర్చ్ పతాకంపై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతేడాది ఈ బ్యానర్‌లో రజినీ చేసిన జైలర్ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ అయింది.

వెట్టైయాన్ సినిమా గురించి..

రజినీకాంత్ ప్రస్తుతం వెట్టైయాన్ చిత్రం చేస్తున్నారు. జైభీమ్ ఫేమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి, ఫాహద్ ఫాజిల్, మంజూ వారియర్, రితికా సింగ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. పస్తుతం ఈ చిత్రం షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ ఏడాది అక్టోబర్‌లోనే ఈ మూవీ రిలీజ్ కానుంది. వెట్టైయాన్ షూటింగ్ పూర్తయ్యాక.. కూలీ చిత్రీకరణలో రజినీ పాల్గొంటారు. 

Whats_app_banner