Tamil OTT: ఓటీటీలో కీర్తి సురేష్ మూవీ రికార్డ్ - 24 గంటల్లో యాభై మిలియన్ల వ్యూస్
Keerthy Suresh: కీర్తి సురేష్ లేటెస్ట్ మూవీ రఘు తాత ఓటీటీలో రికార్డ్ వ్యూస్‌తో అదరగొడుతోంది.కామెడీ డ్రామా కథాంశంతో రూపొందిన ఈ మూవీ ఇటీవలే జీ5 ఓటీటీలో రిలీజైంది. 24 గంటల్లోనే రఘు తాత మూవీకి యాభై మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ వ్యూస్ వచ్చినట్లు జీ5 ఓటీటీ ప్రకటించింది.
Keerthy Suresh: ఓటీటీలో కీర్తి సురేష్ రఘు తాత మూవీ రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతున్నది. కామెడీ డ్రామా కథాంశంతో రూపొందిన ఈ మూవీ ఇటీవలే జీ5 ఓటీటీలో రిలీజైంది. 24 గంటల్లోనే రఘు తాత మూవీ యాభై మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ వ్యూస్‌ను సొంతం చేసుకున్నది. రీసెంట్ టైమ్‌లో ఓటీటీలో ఒక్కరోజులో హయ్యెస్ట్ వ్యూస్ దక్కించుకున్న మూవీగా రఘు తాత నిలిచింది.
ఓటీటీలో మూడు భాషలు...
రఘు తాత మూవీకి సుమన్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈమూవీతోనే అతడు డైరెక్టర్ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ కామెడీ డ్రామా మూవీని నిర్మించాడు.
థియేటర్లలో కేవలం తమిళంలోనే రిలీజైన ఈ మూవీ ఓటీటీలో మాత్రం తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్న ఈ మూవీ ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది. జీ5లో టాప్ ట్రెండింగ్ మూవీస్ లిస్ట్‌లో ఒకటిగా రఘు తాత నిలిచింది.
స్త్రీ వివక్షకు వ్యతిరేకంగా...
రఘు తాత మూవీలో కీర్తి సురేష్‌తో పాటు రవీంద్ర విజయ్, ఎమ్ ఎస్ భాస్కర్ కీలక పాత్రల్లో నటించారు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రఘు తాత మూవీని తెరకెక్కించాడు దర్శకుడు సుమన్ కుమార్. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో హిందీ భాష తప్పనసరిగా నేర్చుకోవాలనే రూల్ పట్ల తమిళనాడులో ప్రజల్లో ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో దర్శకుడు సుమన్ కుమార్ ఈ కథను రాసుకున్నారు.
హిందీ వ్యతిరేకతతో పాటు పురుషాధిక్యతతో కూడిన సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్షను వినోదాత్మక కోణంలో చూపించారు. ఈ సినిమాలో కయల్ పాత్రలో కీర్తి సురేష్ నాచురల్ యాక్టింగ్‌తో అదరగొట్టింది.
రఘు తాత మూవీ కథ ఇదే...
కయల్ (కీర్తి సురేష్) బ్యాంకు ఉద్యోగి. 25 ఏళ్లు వచ్చినా పెళ్లిచేసుకోదు. తల్లిదండ్రులు మాత్రం కయల్‌కు ఎలాగైనా పెళ్లిచేయాలనే ప్రయత్నాల్లో ఉంటారు. రంగు అనే ప్రభుత్వ అధికారి హిందీ భాషను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలంటూ కయల్ ఊళ్లో ఏక్తా సభను నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తాడు.
తాతయ్య రఘోత్తమ్‌తో (ఎమ్ఎస్ భాస్కర్) కలిసి ఏక్తా సభ జరగకుండా అడ్డుకుంటుంది కయల్. మాతృభాషను కాపాడుతున్న వీరవనితగా ఊళ్లోవాళ్లందరూ కయల్‌ను గౌరవిస్తుంటారు. హిందీ భాషపై ద్వేషంతో ప్రమోషన్‌ను కాదంటుంది.
తాతయ్య క్యాన్సర్ బారిన పడటంతో అతడి చివరి కోరిక మేరకు తమిళ్ సెల్వన్ (రవీంద్ర విజయ్) తో కయల్ పెళ్లికి సిద్ధపడుతుంది. కయల్ ముందు మంచివాడిగా నటించే సెల్వన్ నిజస్వరూపం అనుకోకుండా బయటపడుతుంది.
సెల్వన్‌తో తన పెళ్లి జరగకుండా ఉండేందుకు కయల్ ఏం చేసింది? హిందీ ని ద్వేషించే కయల్ ఆ బాషను ఎందుకు నేర్చుకోవాలని అనుకుంటుంది? కయల్ హిందీ నేర్చుకుంటున్న విషయం ఊళ్లో వాళ్లకు ఎలా తెలిసింది అన్నదే రఘు తాత మూవీ కథ.