Brahmamudi April 16th Episode: భార్య‌పై ప్రేమ‌ను బ‌య‌ట‌పెట్టిన రాజ్ - కావ్య ఫిదా - వెన్నెల ఎంట్రీ-brahmamudi april 16th episode raj express his feelings towards kavya ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi April 16th Episode: భార్య‌పై ప్రేమ‌ను బ‌య‌ట‌పెట్టిన రాజ్ - కావ్య ఫిదా - వెన్నెల ఎంట్రీ

Brahmamudi April 16th Episode: భార్య‌పై ప్రేమ‌ను బ‌య‌ట‌పెట్టిన రాజ్ - కావ్య ఫిదా - వెన్నెల ఎంట్రీ

Nelki Naresh Kumar HT Telugu
Apr 16, 2024 07:11 AM IST

Brahmamudi April 16th Episode: నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌లో రీయూనియ‌న్ పార్టీలో కావ్య మంచి మ‌న‌సు గురించి అంద‌రికి గొప్ప‌గా చెబుతాడు రాజ్‌. సాయం చేయ‌డంలో కావ్య నా కంటే ఎప్పుడు ఓ అడుగు ముందే ఉంటుంద‌ని రాజ్ అంటాడు. రాజ్ మాట‌ల‌తో కావ్య ఎమోష‌న‌ల్ అవుతుంది.

బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌
బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌

Brahmamudi April 16th Episode: రాజ్ టెన్త్ క్లాస్ మేట్స్ రీయూనియ‌న్ మీటింగ్‌లో కావ్య‌పై త‌న మ‌న‌సులో ఉన్న ప్రేమ‌ను బ‌య‌ట‌పెట్టేస్తాడు రాజ్‌. కావ్య‌కు నా మీద కోపం వ‌చ్చిన అది ఒక్క పూట కూడా ఉండ‌దు, మాట‌ల్లో ఇష్టాన్ని చూపిస్తుంది. నా క‌ళ్ల‌ల్లో క‌ష్టాన్ని గ‌మ‌నిస్తుంద‌ని కావ్య మంచి మ‌న‌సు గురించి గొప్ప‌గా చెబుతాడు రాజ్‌. కోల్పోయిన వాటి గురించి ఆలోచించ‌దు. అదే ఆమెలో నాకు న‌చ్చే గుణం అని రాజ్ అంటాడు.

అందులో నుంచి కోలుకోవ‌డం ఎలాగో అదే ఆలోచిస్తుంది. ఎవ‌రికి ఏ సాయం కావాల‌న్న నేను చేస్తాను. కానీ సాయం అందించ‌డంలో త‌ను నా కంటే ఓ అడుగు ముందే ఉంటుంద‌ని కావ్య మంచిత‌నాన్ని అంద‌రికి వివ‌రిస్తాడు. నా భార్య మీద ప్రేమ‌ను మాట‌ల్లో చెప్ప‌డం క‌ష్టం అని అంటాడు. ప్రేమ‌ను చెప్ప‌డం కంటే చూపించ‌డ‌మే న్యాయం అని చెబుతాడు.

కావ్య ఎమోష‌న‌ల్‌...

రాజ్ మాట‌ల‌తో కావ్య ఎమోష‌న‌ల్ అవుతుంది. రాజ్ ఫ్రెండ్స్ అంద‌రూ చ‌ప్ప‌ట్ల‌తో రాజ్‌ను అభినందిస్తారు. ఫ్రెండ్స్‌కు దూరంగా వెళ‌తాడు రాజ్‌. అత‌డి ద‌గ్గ‌ర‌కు కావ్య వ‌స్తుంది. నిజం ఎక్క‌డ వెల్ల‌డ‌వుతుందోన‌ని దూరంగా దూరంగా వ‌చ్చారా? అబ‌ద్ధం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని భ‌య‌ప‌డుతున్నారా అంటూ రాజ్‌ను నిల‌దీస్తుంది. మాట‌లు రెండు ర‌కాలుగా ఉంటాయి. కానీ మ‌న‌సు మాత్రం ఒక‌టే ఉంటుంద‌ని రాజ్‌తో అంటుంది.

ప్ర‌శ్న మీరే...జ‌వాబు మీరే...

ప్ర‌శ్న మీరే జ‌వాబు మీరే...నిజం మీరే అబ‌ద్ధం మీరే..మంచి మీరే చెడు మీరే...సుఖాల్ని దుఃఖాల్ని ఒకే దోసిట‌లో నుంచి దార‌పోసే మ‌హానుభావుడు మీరే అంటూ రాజ్‌కు క్లాస్‌కు పీకుతుంది కావ్య‌. మీ స్నేహితులంద‌రికి మ‌నం అన్యోన్యంగా క‌నిపిస్తున్నాం. కానీ అది నిజం కాదు. నేను మీకు భార్య‌గా ప‌నికిరాను. ఆ బాబు నాకు కొడుకు కాదు. వాడి అమ్మ వేరే ఎక్క‌డో ఉంది. ఇక్క‌డున్న ఎవ‌రికి క‌నిపించ‌ని నిజం ఇది. కాస్తైనా గిల్టీగా అనిపించ‌డం రాజ్‌ను క‌డిగేస్తుంది కావ్య‌.

ప్రేమ నిజ‌మైతే బాగుండు...

నిన్ను మోసం చేశాన‌ని అనిపిస్తుంద‌ని కావ్య‌కు స‌మాధాన‌మిస్తాడు రాజ్‌. నేను మోసం గురించి మాట్లాడ‌టం లేదు...నామీద మీరు చూపించిన ప్రేమ నిజ‌మైతే బాగుండున‌నే ఆవేద‌న‌తో మాట్లాడుతున్నాన‌ని కావ్య అంటుంది.

మీ మాట‌ల్లో కొంత‌ నిజం క‌నిపించింద‌ని చెబుతుంది. అవ‌న్నీ పూర్తిగా నిజ‌మైతే బాగుండున‌ని అనిపించింది. వెంట‌నే బాబుతో పాటు వాడి త‌ల్లి గుర్తొచ్చింది. ప‌చ్చి అబ‌ద్దాన్నీ కూడా అంద‌మైన మాట‌ల్లో చెప్పార‌ని తెలిసి విర‌క్తి పుట్టింద‌ని కావ్య ఆవేద‌న‌కు లోన‌వుతుంది.

ఆ బిడ్డ ఎవ‌రు? వాడి త‌ల్లి ఎవ‌రో చెప్పాల‌ని రాజ్‌ను గ‌ట్టిగా అడుగుతుంది కావ్య‌. కానీ రాజ్ స‌మాధానం చెప్ప‌కుండా అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు.

రుద్రాణి ప్లాన్‌...

స్వ‌ప్న ద‌గ్గ‌ర నుంచి ఆస్తి పేప‌ర్స్ కొట్టేయ‌డానికి రుద్రాణి వేసిన ప్లాన్ రివ‌ర్స్ అవుతుంది. ఆమెతో బండెడు చాకిరీ చేయిస్తుంది. ఆ ప‌నులు చేయ‌డం చేత‌కాక రుద్రాణి త‌ల‌ప‌ట్టుకుంటుంది. స్వ‌ప్న‌ను మాట‌ల్లో పెట్టి ఆమె చేత మ‌త్తు మందు క‌లిపిన జ్యూస్ తాగిస్తాడు రాజ్‌.

స్వ‌ప్న నిద్ర‌పోయిన త‌ర్వాత ఆమె ద‌గ్గ‌ర నుంచి ఆస్తి పేప‌ర్స్ కొట్టేయ‌డ‌మే కాకుండా వేలిముద్ర కూడా తీసుకోవాల‌ని రాహుల్‌, రుద్రాణి ఫిక్స‌వుతారు. స్వ‌ప్న రూమ్‌లోకి వెళ్ల‌బోతూ డిన్న‌ర్‌లోకి స్పెష‌ల్స్ చేయ‌మ‌ని రుద్రాణికి ఆర్డ‌ర్స్ వేస్తుంది. ఆమె ఆర్డ‌ర్స్‌ను స‌హించ‌లేక‌పోతుంది రుద్రాణి.

రీయూనియ‌న్‌లో...

రాజ్ గురించి కూడా రీయూనియ‌న్ మీట్‌లో చాలా గొప్ప‌గా చెబుతుంది కావ్య‌. భ‌ర్త‌ను త‌క్కువ చేసి మాట్లాడిన అత‌డి ఫ్రెండ్స్‌కు క్లాస్ పీకుతుంది. భ‌ర్త‌తో పాటు అత‌డి వైపు ఉన్న కుటుంబ‌స‌భ్యులంద‌రితో ఆద‌రాభిమానాల‌తో ఉండాల‌ని చెబుతుంది. భార్య‌ల‌ను న‌మ్మొద్ద‌ని రాజ్ స్నేహితులు కూడా మాట్లాడుకుంటుంటారు.

భార్య‌ను కాకుండా ఇంకెవ‌రిని న‌మ్ముతావు. నిన్నే నమ్ముకొని త‌ల్లిదండ్రుల‌ను, అన్న‌ద‌మ్ముల‌ను, అక్కాచెలెళ్ల‌ను అంద‌రిని వ‌ద‌లుకొని నీ ఇంటి పేరును, గోత్రాన్ని, నీ వంశాన్ని మోయ‌డానికి వ‌చ్చిన నా భార్య‌ను కాకుండా ఇంకెవ‌రిని న‌మ్ముతారు. భార్య త‌ప్ప మ‌న‌కోసం బ్ర‌తికేవాళ్లు ఎవ‌రూ ఉండ‌ర‌ని త‌న స్నేహితుల‌కు బుద్ధిచెబుతాడు రాజ్‌.

క‌డ‌దాక మ‌న‌కు తోడునీడ‌గా ఉండేది భార్య మాత్ర‌మేన‌ని అంటాడు. భార్య‌కు భ‌ర్త‌, ఇళ్లు, పిల్ల‌లు ఇదే ప్ర‌పంచం అని అంటాడు. రాజ్ స‌మాధానంతో అంద‌రూ రియ‌లైజ్ అవుతారు. రాజ్‌, కావ్య ఒకేలా ఆలోచించ‌డం చూసి శ్వేత షాక‌వుతుంది. వెన్నెల రాక‌తో కావ్య, రాజ్ వీడిపోతారా, క‌లిసిపోతారా అర్థం కాక శ్వేత టెన్ష‌న్ ప‌డుతుంది.

బిడ్డ త‌ల్లి ఎంట్రీ...

రాజ్ కొడుకు ఏడుపు మొద‌లుపెడ‌తాడు. పాలు ప‌ట్టించేందుకు కావ్య‌, రాజ్ ప్ర‌య‌త్నించిన ఏడుపు ఆప‌డు. అప్పుడే ఓ యువ‌తి వ‌చ్చి రాజ్ చేతుల‌లో నుంచి బిడ్డ‌ను తీసుకుంటుంది. నీకు అస‌లు మాన‌వ‌త్వం ఉందా? మ‌న‌స‌నేది లేదా? త‌ల్లిని బిడ్డ‌ను వేరు చేస్తావా? నాకు చెప్ప‌కుండా నా బిడ్డ‌ను తీసుకెళ‌తావా అంటూ రాజ్‌పై ఫైర్ అవుతుంది.

నా బిడ్డ నా కోసం ఎంత బెంగ‌పెట్టుకున్నాడో అంటూ కోప్ప‌డుతుంది. వీడు లేకుండా నేను బ‌త‌క‌లేన‌ని అంటుంది. కాస్తైనా క‌నిక‌రం లేకుండా ఎలా తీసుకెళ‌తావ‌ని అంటుంది. ఆమె మాట‌ల‌తో రాజ్‌, కావ్య షాక‌వుతారు. శ్వేత కూడా ఏం మాట్లాడ‌కుండా సెలైంట్‌గా ఉండిపోతుంది.

నీరజ ఫ్రాంక్‌...

ఇదంతా ఫ్రాంక్ అని ఆ అమ్మాయి అంటుంది. తాను మీ టెన్త్ క్లాస్‌మేట్ నీర‌జ‌న‌ని, త‌న‌ను గుర్తుప‌ట్ట‌లేదా అని రాజ్‌తో అంటుంది. ఆమె మాట‌ల‌తో అంద‌రూ షాక్ నుంచి తేరుకుంటారు. వెన్నెల పార్టీకి రాక‌పోవ‌డంతో ఆమెకు ఫోన్ చేస్తుంది శ్వేత‌. ఇంకో ఇర‌వై నిమిషాల్లో పార్టీ ద‌గ్గ‌ర‌కు చేరుకుంటాన‌ని వెన్నెల స‌మాధాన‌మిస్తుంది. రాజ్ వ‌చ్చాడా అని శ్వేత అడుగుతుంది వెన్నెల‌. రాలేద‌ని శ్వేత అబ‌ద్ధం ఆడుతుంది.

రాజ్ టెన్ష‌న్‌...

వెన్నెల వ‌స్తోన్న విష‌యాన్ని టైమ్ చూసి రాజ్ ముందుకు బ‌య‌ట‌పెడ‌తారు శ్వేత‌, కావ్య‌. వెన్నెల వ‌స్తుంద‌ని తెలియ‌గానే రాజ్ టెన్ష‌న్ ప‌డ‌తాడు. వెన్నెల పార్టీకి వ‌స్తే తాను ఆడుతున్న నాట‌కం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని కంగారు ప‌డ‌తాడు. అప్పుడే వెన్నెల పార్టీలోకి ఎంట్రీ ఇస్తుంది. అక్క‌డితో నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ముగిసింది.

IPL_Entry_Point