Swimming With Menstrual Cup : మెన్‌స్ట్రువల్ కప్‌ ఉపయోగించి ఈత కొడితే ఏం కాదా?-is swimming with menstrual cup during period good or bad know dos and donts ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Swimming With Menstrual Cup : మెన్‌స్ట్రువల్ కప్‌ ఉపయోగించి ఈత కొడితే ఏం కాదా?

Swimming With Menstrual Cup : మెన్‌స్ట్రువల్ కప్‌ ఉపయోగించి ఈత కొడితే ఏం కాదా?

Anand Sai HT Telugu
Jun 10, 2024 08:00 PM IST

swimming with menstrual cup : ఈత కొట్టడం ఆరోగ్యానికి మంచిది. అయితే పీరియడ్స్ సమయంలో మహిళలు నీటిలోకి దిగడంపై రకరకాల అపొహలు ఉన్నాయి. అయితే ఆ సమయంలో మెన్‌స్ట్రువల్ కప్ ఉపయోగించి ఈత కొట్టడం సరైనదేనా?

మెన్‌స్ట్రువల్ కప్‌ ఉపయోగించి స్విమ్ చేయవచ్చా?
మెన్‌స్ట్రువల్ కప్‌ ఉపయోగించి స్విమ్ చేయవచ్చా? (Unsplash)

పీరియడ్స్ సమయంలో నీటిలో ఆడకూడదు, నదిలోకి వెళ్లకూడదు, ఈత కొట్టకూడదు అని ఇంట్లో అమ్మమ్మలు చెప్పడం వింటుంటాం. మీరు కూడా ఈ విషయాన్ని విని ఉండవచ్చు. అలాగే ఈ సమయంలో నీటిలోకి దిగడానికి కూడా సంకోచిస్తాం కదా? ప్యాడ్ ధరించి నీటిలోకి వచ్చినప్పుడు చికాకుగా ఉంటుంది. అయితే మెన్‌స్ట్రువల్ కప్ ధరించి ఈత కొట్టవచ్చా అనే సందేహం చాలా మందికి ఉంది.

yearly horoscope entry point

ఋతుస్రావం సమయంలో స్విమ్మింగ్ చేయవచ్చు. కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. మెన్‌స్ట్రువల్ కప్ ధరించడం కూడా ఒక పద్ధతి ఉంది. అయితే భద్రతపై దృష్టి పెట్టుకోవాలి. మెన్‌స్ట్రువల్ కప్ ధరించి ఈత కొట్టడం సురక్షితం. ఈ సమయంలో ఈ కప్ ధరించడం టాంపోన్ కంటే మంచిది. ఎందుకంటే దాని ద్వారా జననేంద్రియ ప్రాంతంలో నీరు వెళ్లకుండా.. బ్లడ్ లీక్ అవుతుందని మీరు చింతించాల్సిన పని లేదు.

అలాగే మెన్‌స్ట్రువల్ కప్ ధరించి 12 గంటల పాటు మార్చాల్సిన అవసరం లేదు. మీరు సరైన పరిమాణంలో ఉన్న కప్పును ఉపయోగిస్తే లీక్ అవుతుందని భయపడాల్సిన అవసరం లేదు. నీటిలో హాయిగా ఆడుకోవచ్చు. సరైన పరిమాణాన్ని తప్పనిసరిగా ఉపయోగించాలి. మీ కోసం సరైన సైజు మెన్‌స్ట్రువల్ కప్‌ని ఉపయోగించాలి. సరైన సైజు మెన్‌స్ట్రువల్ కప్ లీక్ అవ్వదు.

ఈత కొట్టే ముందు మెన్‌స్ట్రువల్ కప్‌ను ఖాళీ చేయండి. 30 ఎంఎల్ రక్తం ఇందులో ఉంటుంది. రక్తస్రావం సహజంగా ఉంటే త్వరగా నిండదు. అది 8 గంటల వరకు ఉపయోగించవచ్చు. భద్రత కోసం ప్రతి 6 గంటలకు మార్చడం మంచిది. మొదటిసారి ఉపయోగించి ఈత కొట్టినప్పుడు మెన్‌స్ట్రువల్ కప్ అసౌకర్యంగా ఉంటుంది. కానీ ఒకసారి అలవాటు చేసుకుంటే చాలా సెట్ అయిపోతుంది.

మెన్‌స్ట్రువల్ కప్ ఉపయోగించి ఈత కొట్టడం కష్టం కాదు. వాడుతున్నప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మొదట్లో కొంత తడబాటు ఉండవచ్చు. మెన్‌స్ట్రువల్ కప్ శుభ్రత చాలా ముఖ్యం. శుభ్రం చేసి వాడాలి. మీరు దానిని గోరువెచ్చని నీటిలో వేసి వాడండి. మెన్‌స్ట్రువల్ కప్ శుభ్రత పాటించకపోతే, ఇన్‌ఫెక్షన్ రావచ్చు. రుతుక్రమం ముగిసిన తర్వాత వేడి నీళ్లలో వేసి బాగా తుడిచి చిన్న కవర్ లో పెట్టాలి. మళ్లీ ఉపయోగించే ముందు వేడి నీటితో ఒక్కసారి కడగండి.

పీరియడ్స్ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. నీటిలో దిగితే ఏం కాదు.. కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదమే. మెన్‌స్ట్రువల్ కప్‌ సరైన పద్ధతిలో వాడి మీరు ఈత కొట్టవచ్చు.

Whats_app_banner