Farm Loan Waiver : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్, రూ.2 లక్షల రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు-hyderabad cm revanth reddy key orders on farm loan waivers by august 15th ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Farm Loan Waiver : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్, రూ.2 లక్షల రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Farm Loan Waiver : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్, రూ.2 లక్షల రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Jun 10, 2024, 09:54 PM IST Bandaru Satyaprasad
Jun 10, 2024, 09:54 PM , IST

  • Farm Loan Waiver : ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పంట రుణమాఫీకి విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

రుణమాఫీకి సంబంధించి విధివిధానాలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. పంట రుణమాఫీ, ఇతర అంశాలపై వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. 

(1 / 6)

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రూ.2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. పూర్తి స్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలని తెలిపారు. 

(2 / 6)

రుణమాఫీ కటాఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. కేవలం బ్యాంకుల నుంచే కాకుండా, పీఏసీఎస్ నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. 

(3 / 6)

రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసేందుకు  పూర్తి స్థాయి వివరాలతో పాటు అవసరమైన అంచనా వ్యయాన్ని రూపొందించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రుణమాఫీకి సంబంధించి విధివిధానాలను రూపొందించి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు

(4 / 6)

ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15లోగా పంట రుణమాఫీ చేసి తీరాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు తేల్చి చెప్పారు. 

(5 / 6)

ఈ సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖా అధికారులు పాల్గొన్నారు. 

(6 / 6)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు