Kalki 2898 AD Trailer: రికార్డ్స్ చూసుకో.. ఇంత వరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు.. కల్కి 2898 ఏడీ ట్రైలర్ వచ్చేసింది-kalki 2898 ad trailer released rebel star prabhas deepika padukone amitabh bachchan nag ashwin kamal haasan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalki 2898 Ad Trailer: రికార్డ్స్ చూసుకో.. ఇంత వరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు.. కల్కి 2898 ఏడీ ట్రైలర్ వచ్చేసింది

Kalki 2898 AD Trailer: రికార్డ్స్ చూసుకో.. ఇంత వరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు.. కల్కి 2898 ఏడీ ట్రైలర్ వచ్చేసింది

Hari Prasad S HT Telugu
Jun 10, 2024 07:21 PM IST

Kalki 2898 AD Trailer: కల్కి 2898 ఏడీ ట్రైలర్ వచ్చేసింది. సోమవారం (జూన్ 10) సాయంత్రం సరిగ్గా ఏడు గంటల 15 నిమిషాలకు మేకర్స్ ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు. మొదట 7 గంటలకే అని చెప్పినా.. కాస్త ఆలస్యం చేశారు.

కల్కి 2898 ఏడీ ట్రైలర్ వచ్చేసింది
కల్కి 2898 ఏడీ ట్రైలర్ వచ్చేసింది

Kalki 2898 AD Trailer: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ ట్రైలర్ వచ్చేసింది. ఊహించినట్లే ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ అదుర్స్ అనిపించేలా ఉంది. రికార్డ్స్ చూసుకో.. ఇప్పటి వరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ట్రైలర్ కే హైలైట్ గా నిలిచింది.

కల్కి 2898 ఏడీ ట్రైలర్

ప్రభాస్, దీపికా నటించిన కల్కి 2898 ఏడీ ట్రైలర్ ఊహించినట్లే చాలా గ్రాండ్ గా, ఇప్పటి వరకూ ఇండియన్ సినిమాలో చూడని విధంగా కళ్లు చెదిరిపోయేలా ఉంది.భైరవగా ప్రభాస్, అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ యాక్షన్ సీక్వెన్స్ చూసి నోరెళ్లబెట్టడం ఖాయం. ట్రైలర్ ఆఫ్ ద డెకేడ్ గా ప్రభాస్ అభిమానులు చెబుతున్న కల్కి 2898 ఏడీ నిజంగానే మనల్ని పూర్తిగా ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.

ఈ మూవీ కోసం అమితాబ్ బచ్చన్, దీపికా, కమల్ హాసన్ లాంటి వాళ్లు తెలుగులోనూ సొంతంగా డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇక మూవీలో గెస్ట్ రోల్, విలన్ పాత్ర పోషించిన కమల్ హాసన్ చివర్లో అసలు గుర్తు పట్టని రీతిలో కనిపిస్తాడు. భయపడకు మరో ప్రపంచం వస్తుందనే డైలాగు అతని నోటి వెంట వినిపిస్తుంది.

రెబల్ స్టార్ ఫ్యాన్స్ హంగామా

కల్కి 2898 ఏడీ మూవీ ట్రైలర్ సోమవారం (జూన్ 10) రానుందని చాలా రోజుల ముందే మేకర్స్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ఉదయం నుంచే రెబల్ స్టార్ ఫ్యాన్స్ హడావిడి మొదలైంది. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న థియేటర్లు ప్రభాస్ ఫ్యాన్స్ తో కళకళలాడాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 70 ఎంఎం థియేటర్ దగ్గర డప్పులు కొడుతూ డ్యాన్స్ లు చేస్తూ హంగామా చేశారు.

ఇక విజయవాడ అలంకార్ థియేటర్, తాడేపల్లిగూడెం, కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్, దిల్‌సుఖ్ నగర్ కోణార్క్ థియేటర్, గుంటూరు, ప్రొద్దుటూరు, కాకినాడ లక్ష్మి థియేటర్.. ఇలా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలు ప్రభాస్ ఫ్యాన్స్ డప్పుల మోతతో దద్దరిల్లిపోయాయి. అటు కర్ణాటకలోనూ పలు ప్రాంతాల్లో ప్రభాస్ ఫ్యాన్స్ హడావిడి కనిపించింది. ఆ వీడియోలను కల్కి టీమ్ తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వెళ్లింది.

ఆయా థియేటర్లలో ఎంతో ముందుగానే కల్కి 2898 ఏడీ ట్రైలర్ ప్రీవ్యూ వచ్చింది. తమ అభిమాన నటుడిని చూసి అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అన్ని థియేటర్లలో కల్కి మూవీ ట్రైలర్ రాగానే ఈలలు, చప్పట్లతో మార్మోగిపోయాయి. ట్రైలర్ చివర్లో గాల్లో తేలుతూ వచ్చే ప్రభాస్ ను కూడా ఫ్యాన్స్ ఉత్సాహం రెట్టింపైంది.

కల్కి 2898 ఏడీ మూవీ గురించి..

కల్కి 2898 ఏడీ చిత్రంలో భైరవగా ప్రభాస్ నటించగా.. అశ్వత్థామ పాత్రను బాలీవుడ్ దిగ్గజం అమిత్ బచ్చన్ పోషించారు. తమిళ లెజెండ్ కమల్ హాసన్, దీపికా పదుకొణ్, దిశా పటానీ కీలకపాత్రలు చేశారు. భారత పురాణాల స్పూర్తితో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీగా కల్కిని తెరకెక్కించారు దర్శకుడు నాగ్ అశ్విన్. భారీ వీఎఫ్‍ఎక్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు మరో లోకంలోకి వెళ్లినట్టు ఫీలవుతారని తాను అనుకుంటున్నట్టు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.

కల్కి 2899 ఏడీ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. భారత ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీరైన మూవీగా భారీ బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

టీ20 వరల్డ్ కప్ 2024