Bujji And Bhairava Review: బుజ్జి అండ్ భైరవ రివ్యూ.. కీర్తి సురేష్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ ప్రీల్యూడ్ ఆకట్టుకుందా?-bujji and bhairava review in telugu kalki 2898 ad prelude review telugu prabhas keerthy suresh b and b review telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bujji And Bhairava Review: బుజ్జి అండ్ భైరవ రివ్యూ.. కీర్తి సురేష్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ ప్రీల్యూడ్ ఆకట్టుకుందా?

Bujji And Bhairava Review: బుజ్జి అండ్ భైరవ రివ్యూ.. కీర్తి సురేష్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ ప్రీల్యూడ్ ఆకట్టుకుందా?

Sanjiv Kumar HT Telugu
Jun 01, 2024 10:24 AM IST

Bujji And Bhairava Animated Series Review In Telugu: కల్కి 2898 ఏడీ యానిమేటెడ్ వెబ్ సిరీస్‌లో బుజ్జి (కీర్తి సురేష్), భైరవ (ప్రభాస్) పాత్రల ప్రపంచాన్ని చెప్పేలా బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ వెబ్ సిరీస్‌ను ఓటీటీలో స్ట్రీమింగ్ చేశారు. మరి సిరీస్ ఎలా ఉందో బీ అండ్ బీ రివ్యూలో తెలుసుకుందాం.

బుజ్జి అండ్ భైరవ రివ్యూ.. కీర్తి సురేష్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ ప్రీల్యూడ్ ఆకట్టుకుందా?
బుజ్జి అండ్ భైరవ రివ్యూ.. కీర్తి సురేష్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ ప్రీల్యూడ్ ఆకట్టుకుందా?

టైటిల్: బుజ్జి అండ్ భైరవ

నటీనటులు: ప్రభాస్ (యానిమేటెడ్ రోల్), కీర్తి సురేష్ (వాయిస్ ఓవర్), బ్రహ్మానందం

డైరెక్టర్: నాగ్ అశ్విన్

మ్యూజిక్ డైరెక్టర్: సంతోష్ నారాయణన్

నిర్మాణ సంస్థ: వైజయంతీ మూవీస్

ఓటీటీ ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో

స్ట్రీమింగ్ డేట్: మే 31, 2024

Bujji And Bhairava Review In Telugu: ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ ప్రధాన తారాగణంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సినిమా 'కల్కి 2898 ఏడీ'. ఈ మూవీ జూన్ 27న విడుదల కానుంది. ఈ మూవీ రిలీజ్ కంటే ముందుగానే కల్కిలోని పాత్రలు అయిన బుజ్జి (కీర్తి సురేష్), భైరవ (ప్రభాస్) పాత్రలను పరిచయం చేస్తూ అమెజాన్ ప్రైమ్ వీడియోలో కల్కి 2898 ఏడీ ప్రీల్యూడ్ యానిమేటెడ్ వెబ్ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేశారు.

B And B Review Telugu: మే 31 నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న బుజ్జి అండ్ భైరవ (బీ అండ్ బీ) యానిమేటెడ్ సిరీస్ నుంచి రెండు ఎపిసోడ్స్ విడుదల అయ్యాయి. తర్వాత వారానికొకటి చొప్పున ఈ ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. మరి ఈ రెండు ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఎలా ఉందో బుజ్జి అండ్ భైరవ రివ్యూలో (బీ అండ్ బీ రివ్యూ) (B & B Review Telugu) తెలుసుకుందాం.

కథ:

BU- JZ- 1 అనే కోడ్ నేమ్‌తో ఉన్న ఒక ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ డివైజ్‌ను (కీర్తి సురేష్) ఓ వెహికిల్‌కు అటాచ్ చేస్తారు. ఆ ఏఐ సరైనా గైడెన్స్ ఇస్తూ 99 మిషన్స్ సక్సెస్ అయ్యేలా చేస్తుంది. కానీ, 100వ మిషన్ పూర్తయ్యేసరికి ఓ అటాక్ జరుగుతుంది. అందులో ఆ ఏఐ వెహికిల్ ధ్వంసం అయిపోతుంది. దాంతో 100 మిషన్స్ కంప్లీట్ చేసి కాంప్లెక్స్‌కు షిఫ్ట్ అవ్వాలనే ఏఐ కోరిక మధ్యలోనే ఆగిపోతుంది.

భైరవ స్టోరీ

మరోవైపు భైరవ (ప్రభాస్) మిలియన్ల యూనిట్లు (2898 సంవత్సరంలో డబ్బు) సంపాదించి కాంప్లెక్స్‌కు షిఫ్ట్ కావలనేది కలగా ఉంటుంది. రెండేళ్లుగా అద్దె చెల్లించట్లేదని ఇంటి ఓనర్ (బ్రహ్మానందం) భైరవను ఖాళీ చేయమని పోరు పెడుతుంటాడు. ఇలాంటి సమయంలో ఆ ఏఐ భైరవకు దొరుకుతుంది. దాని కోడ్ నేమ్‌ను బుజ్జిగా చదివి పేరు పెడతాడు. బుజ్జి సలహాతో ఓ కారు తయారు చేస్తాడు భైరవ.

హైలెట్స్

భైరవ కారు తయారు చేసిన తర్వాత ఏమైంది? భైరవను బుజ్జి ఎందుకు మోసం చేయాలనుకుంది? కాంప్లెక్స్‌కు బుజ్జి వెళ్లలేకపోడానికి కారణం ఏంటీ? బుజ్జి ఐడియాతో భైరవ ఏం సాధించాడు? కల్కి, భైరవ ఇద్దరూ ఒక్కరేనా? కాదా? అనేది తెలియాలంటే బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ సిరీస్ చూడాల్సిందే.

విశ్లేషణ:

కల్కి మూవీ 2898లో జరుగుతుందని టైటిల్‌ను బట్టి అర్థం అవుతోంది. దానికంటే రెండేళ్ల ముందు అంటే క్రీ. శ. 2896 నుంచి బుజ్జి అండ్ భైరవ స్టోరీని చూపించారు. ఈ సిరీస్‌తో కల్కి వరల్డ్ బిల్డింగ్, భవిష్యత్తులో ఉండే నిర్మాణాలు, సాంకేతిక, రూపాయి కరెన్సీని యూనిట్‌లలో లెక్కించడం వంటి ఇతర విషయాలను పరిచయం చేశారు.

కమల్ హాసన్ పోలికలతో

కల్కి 2898 ఏడీ సినిమా విడుదల సమయానికి ఆ ప్రపంచం ఎలా ఉంటుందో అలవాటు చేసే ప్రయత్నంగా ఈ యానిమేటెడ్ వెబ్ సిరీస్‌ను రిలీజ్ కంటే ముందుగా ఓటీటీలోకి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. సిరీస్‌లో ఓ విగ్రహాన్ని చూపించారు. అది కమల్ హాసన్ పోలికలతో ఉంటుంది. ఇంకా మూవీలో అశ్వత్ధామ, ఇతర పాత్రల గురించి పెద్దగా హింట్ ఇవ్వలేదు.

భైరవ, కల్కి ఇద్దరూ ఒక్కరేనా?

మహా విష్ణువు పదో అవతారం అయిన కల్కి శంభల నగరంలో జన్మిస్తాడు. కానీ, ఇందులో భైరవ కాశీలో పుట్టినట్లు చూపించారు. దీంతో భైరవ, కల్కి ఇద్దరూ ఒక్కరేనా.. కాదా అనే సస్పెన్స్ క్రియేట్ చేశారు. కాకపోతే శంభల నగరానికి సంబంధించిన అంశాలను ఈ ప్రీల్యూడ్‌లో చూపించారు. కాంప్లెక్స్‌కు వెళ్తున్న వాహానాలపై శంభల నగరానికి చెందిన రెబల్స్ అటాక్ చేసి ఆహారం దోచుకుంటారు. ఇలా కల్కి జన్మ ప్రాంతానికి ఓ రెఫరెన్స్ ఇచ్చారు.

డిజిటల్ లైఫ్ లీడ్ చేస్తున్నట్లు

ఇక సిరీస్‌లో ఫ్యూచరిస్టిక్‌గా అందరూ డిజిటల్ లైఫ్ లీడ్ చేస్తున్నట్లుగా చూపించారు. రూపాయి కరెన్సీ యూనిట్‌లోకి మారడం గమనించొచ్చు. సిరీస్‌లో ప్రభాస్, బ్రహ్మానందం మధ్య వచ్చిన కామెడీ ఆకట్టుకునేలా ఉంది. టెక్కికల్ పరంగా అదిరిపోయింది. ఈ వరల్డ్ బిల్డింగ్, సినిమాటోగ్రఫీ, బీజీఎమ్ నెక్ట్స్ లెవెల్‌లో ఉన్నాయి.

14 నిమిషాల నిడివి

ఫైనల్‌గా చెప్పాలంటే 14 నిమిషాల నిడివితో ఉన్న రెండు ఎపిసోడ్ల కల్కి 2898 ఏడీ ప్రీల్యూడ్ యానిమేటెడ్ వెబ్ సిరీస్ బుజ్జి అండ్ భైరవ సరదాగా సాగిపోతుంది. చూసేయడం మరింత ఈజీగా ఉంది. కల్కి 2898 ఏడీ మూవీ చూసేటప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ రాకుండా చేసిన ప్రయత్నంగా ఈ బీ అండ్ బీ అని చెప్పుకోవచ్చు.

రేటింగ్: 2.75/5

Whats_app_banner