Tamil Hit Remake: తమిళ హిట్ మూవీని రీమేక్ చేస్తున్న హీరో.. కమల్ హాసన్ అమల క్లాసిక్ హిట్ చెడగొట్టకండి అంటూ!-ashok selvan plan to remake kamal haasan amala tamil hit movie satya 1988 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ashok Selvan Plan To Remake Kamal Haasan Amala Tamil Hit Movie Satya 1988

Tamil Hit Remake: తమిళ హిట్ మూవీని రీమేక్ చేస్తున్న హీరో.. కమల్ హాసన్ అమల క్లాసిక్ హిట్ చెడగొట్టకండి అంటూ!

Sanjiv Kumar HT Telugu
Mar 30, 2024 01:15 PM IST

Kamal Haasan Amala Sathya Remake: లోక నాయకుడు కమల్ హాసన్, సీనియర్ నటి అమల జోడీగా నటించిన కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ తమిళ హిట్ మూవీ సత్య. తమిళంలో సూపర్ హిట్ అయిన సత్య సినిమాను కోలీవుడ్ యంగ్ హీరో రీమేక్ చేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.

తమిళ హిట్ మూవీని రీమేక్ చేస్తున్న హీరో.. కమల్ హాసన్ అమల క్లాసిక్ హిట్ చెడగొట్టకండి అంటూ!
తమిళ హిట్ మూవీని రీమేక్ చేస్తున్న హీరో.. కమల్ హాసన్ అమల క్లాసిక్ హిట్ చెడగొట్టకండి అంటూ!

Kamal Haasan Amala Tamil Hit Movie Remake: యూనివర్సల్ హీరో కమల్ హాసన్, కింగ్ నాగార్జున భార్య, ఒకప్పటి హీరోయిన్ అమల కలిసి దాదాపుగా మూడు చిత్రాల్లో నటించారు. వాటిలో కల్ట్ క్లాసిక్ తమిళ హిట్ మూవీగా ఘనత సాధించింది సత్య. 1988లో తమిళంలో విడుదలైన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే ఈ ఏడాది జనవరిలో కమల్ హాసన్ కల్ట్ క్లాస్ సత్య సినిమా 36 ఏళ్లు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా సత్య సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. కమల్, అమల అక్కినేని జంటగా నటించిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. 1988లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆ ఏడాది తమిళ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. అయితే, ఇప్పుడు ఈ కల్ట్ క్లాసిక్ హిట్ మూవీని తమిళ యంగ్ హీరో రీమేక్ చేస్తున్నాడని తెలుస్తోంది.

ఆ కోలీవుడ్ యంగ్ హీరో ఎవరో కాదు. అతనే అశోక్ సెల్వన్. ఈ యంగ్ హీరో ఇప్పటికే తెలుగు ప్రేక్షకులుకు బాగా సుపరిచితం. ఇటీవలే పోర్ తోళిల్ అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాడు. అశోక్ సెల్వన్ హీరోగా, పోర్ తోళిల్ డైరెక్టర్ విఘ్నేష్ రాజా దర్శకత్వంలో కమల్ హాసన్ అమల్ సత్య సినిమాను రీమేక్ చేయనున్నట్లు బుధవారం (మార్చి 27) వార్తలు వెలువడ్డాయి. అయితే, ఈ న్యూస్ బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కమల్ హాసన్ పాత్ర అయిన సత్యను అశోక్ సెల్వన్ చేస్తున్నారనే వార్తలు ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో వైరల్ అయ్యాయి. దీనిపై చాలా మంది యూజర్లు నెగెటివ్ కామెంట్స్ చేశారు. "సత్య నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ. అందులో కమల్, ఇళయరాజా స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. దయచేసి చెడగొట్టకండి" అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. "నేను ఆ సినిమా చూడలేదు. కానీ ఇతరులు చూశారు. అతనితో సత్య రీమేక్ వద్దు" అని మరొక యూజర్ కామెంట్ చేస్తూ సాడ్ ఎమోజీ షేర్ చేశాడు.

1988లో వచ్చిన 'సత్య' సినిమా గురించి చెప్పాలంటే, ఎలాంటి అన్యాయాన్ని సహించలేని, నిరంతరం గొడవలకు దిగే సత్య (సత్యమూర్తి) అనే నిరుద్యోగ కుర్రాడి పాత్రలో కమల్ హాసన్ నటించారు. ఒక రోజు సేల్స్ గర్ల్ గీత (అమల అక్కినేని)ని చూసి ప్రేమలో పడతాడు. ఇంతలో, ఒక అవినీతి రాజకీయ నాయకుడు సత్యను తన అవసరాల కోసం మారుస్తాడు. ఆపై రాజకీయ నాయుకుడి అసలు స్వరూపం తెలుసుకున్న సత్య ఏం చేశాడన్నది కథ.

అయితే, సత్య మూవీ కూడా బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ నటించిన అర్జున్ అనే హిందీ సినిమాకు రీమేక్. కానీ డైరెక్టర్ సురేష్ కృష్ణ, కమల్, సంగీత దర్శకుడు ఇళయరాజా ఈ చిత్రంపై చెరగని ముద్ర వేసి తమిళ కల్ట్ క్లాసిక్‌గా మార్చారు. ఈ యాక్షన్ ప్యాక్డ్ చిత్రంలో కమల్ హాసన్ రగ్డడ్ లుక్‌లో అలరించారు. ఆయన వయెలెన్స్, నటనతోపాటు అమలతో రొమాంటిక్ సన్నివేశాలతో ఆకట్టుకున్నారు. అందులో కమల్ హాసన్ గడ్డం లుక్, హుందాతనం, రగ్గడ్ యాటిట్యూడ్ సినిమా విడుదలైనప్పుడు ఐకానిక్‌ ట్రెండ్ సెట్ చేసింది. మరి ఈ సినిమాను అశోక్ సెల్వన్ రీమేక్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి.

WhatsApp channel