Bujji And Bhairava OTT: ఓటీటీలోకి వచ్చేసిన బుజ్జి అండ్ భైరవ.. కల్కి 2898 ఏడీ థియేటర్ రిలీజ్ కంటే ముందుగానే స్ట్రీమింగ్
Bujji And Bhairava OTT Streaming Now: కల్కి 2898 ఏడీ సినిమాలోని పాత్రలైన బుజ్జి అండ్ భైరవ టైటిల్‌తో ఓటీటీలోకి యానిమెటెడ్ వెబ్ సిరీస్ వచ్చేసింది. ప్రభాస్, కీర్తి సురేష్ వాయిస్ ఇచ్చిన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.
Bujji And Bhairava OTT Release: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక సినిమా కల్కి 2898 ఏడీ. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఎంతటి హైప్ ఉందో తెలిసిందే. ఇటీవలే బుజ్జి పేరుతో ఏఐ రోబోట్ వెహికిల్‌ను చూపించారు. దానికి మహానటి కీర్తి సురేష్ ఇచ్చిన వాయిస్ ఓవర్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. అంతేకాకుండా ఇందులో బుజ్జి అండ్ భైరవ బెస్ట్ ఫ్రెండ్స్‌లో కనిపించనున్నారు.
బుజ్జి అండ్ భైరవ మధ్య బాండింగ్, ఫన్నీ మాటలకు సంబంధించి వదిలిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదే కాకుండా బుజ్జి అండ్ భైరవ టైటిల్‌తో యానిమేటెడ్ వెబ్ సిరీస్‌ను కల్కి 2898 ఏడీ మూవీ కంటే ముందుగా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది తెలయజేస్తూ మే 30న ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్‌కు సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక మేకర్స్ చెప్పినట్లుగా బుజ్జి అండ్ బైరవ యానిమేటెడ్ వెబ్ సిరీస్ మే 31 అర్ధరాత్రి నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో బుజ్జి అండ్ భైరవ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, హిందీతోపాటు మరో భాషలో ఈ వెబ్ సిరీస్ ప్రసారం అవుతోంది. అయితే, ముందుగా ఈ సిరీస్ నుంచి రెండు ఎపిసోడ్స్ మాత్రమే విడుదల చేశారు. కల్కి 2898 ఏడీ సినిమా విడుదల వరకు అంటే జూన్ 27 వరకు ఒక్కో ఎపిసోడ్‌ను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికీ విడుదలైన రెండు ఎపిసోడ్స్ నిడివి మొత్తం కలిపి చూస్తే సుమారు 30 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అంటే ఒక్కో ఎపిసోడ్ నిడివి కేవలం 14, 15 నిమిషాలు మాత్రమే ఉంది. ఈ యానిమేటెడ్ వెబ్ సిరీస్‌తో కల్కి సినిమా ప్రపంచంలోకి మూవీ కంటే ముందుగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తోంది. పాత్రల పరిచయం, వరల్డ్ బిల్డింగ్, బుజ్జి అండ్ భైరవ ఫ్రెండ్‌షిప్‌ను చూపించారు. ఇది బుజ్జి అండ్ భైరవ బ్యాక్ స్టోరీగా ఉంది.
ఇందులో ప్రభాస్, కీర్తి సురేష్ వాయిస్‌లతో పాటు కామెడీ కింగ్ బ్రహ్మానందం పాత్రను కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పటికే రిలీజైలన ట్రైలర్ కామెడీతో పూర్తి వినోదభరితంగా ఉంది. ఇప్పుడు ఈ సిరీస్ కూడా అంతే ఎంటర్టైనింగ్‌గా ఉందని తెలుస్తోంది. కాగా బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ సిరీస్ స్పెషల్ స్క్రీనింగ్‌ను మే 30న నిర్వహించారు. ఇందులో మొదటి ఎపిసోడ్ ప్లే చేశారు. ఈ కార్యక్రమంలో నాగ్ అశ్విన్ ఆసక్తకిర విశేషాలు తెలిపారు.
"అందరికీ హాయ్. బుజ్జి ఎంట్రీకి ఎంతమంది అరుస్తారు? భైరవ ఎంట్రీకి ఎంతమంది అరుస్తారో అని వెయిట్ చేశాను. వాళ్లిద్దరూ కలిసినప్పుడు అన్నిటికంటే ఎక్కువ సౌండ్ వచ్చింది. సినిమాలో విల్ బి మోర్ ఫన్. మరో ఆరుగంటల్లో ప్రపంచమంతా ఒక గ్లింప్స్‌లా మేము క్రియేట్ చేసిన కల్కి వరల్డ్‌కి ఒక చిన్న ఎంట్రీ ఇస్తారు. గత నాలుగైదేళ్లుగా దీని కోసం పని చేస్తున్నాం. సినిమా కంటే ముందే యానిమేషన్ సిరీస్‌ను విడుదల చేయడం మా ప్రొడక్షన్ హౌస్‌కి బోల్డ్ అండ్ డేరింగ్ ఎక్స్‌పరిమెంట్ థింగ్" అని నాగ్ అశ్విన్ తెలిపారు.