Keerthy Suresh Lip Lock: పెళ్లయిన హీరోతో కీర్తి సురేష్ లిప్ లాక్.. ఓకే చెప్పేసిన మహానటి.. అదృష్టం అంటే అతనిదే!
Keerthy Suresh Lip Lock With Varun Dhawan: మహానటి కీర్తి సురేష్ తొలిసారిగా లిప్ కిస్ సీన్లలో నటించనుందని న్యూస్ చక్కర్లు కొడుతోంది. అది కూడా పెళ్లయిన హీరోతో కీర్తి సురేష్ లిప్ లాక్ చేయనుందట. బేబీ జాన్ సినిమాలో వరుణ్ ధావన్‌తో కీర్తి సురేష్ ఘాటు లిప్ లాక్ సీన్ చేయనుందని సమాచారం.
Keerthy Suresh Lip Kiss: ముద్దుగుమ్మ కీర్తి సురేష్ సౌత్ సినీ పరిశ్రమలోనే అగ్ర కథానాయికగా ఎదిగింది. దక్షిణాదిలోనే మహానటిగా పేరు తెచ్చుకుంది. కీర్తి సురేష్‌కు సౌత్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతలా సౌత్ ఆడియెన్స్‌ను తన నటనతో అట్రాక్ట్ చేసింది మహానటి కీర్తి సురేష్. ఎలాంటి పాత్ర అయినా ఒదిగిపోయి చేయడంలో కీర్తి సురేష్ దిట్ట.
గ్లామర్ రోల్, డీ గ్లామర్ రోల్ ఎలాంటి తరహా పాత్ర అయినా అందుకు తగిన హావా భావాలు, నటనతో మెస్మరైజ్ చేస్తుంది ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఈ మధ్య కాలంలో కీర్తి సురేష్ వరుస ప్రాజెక్ట్స్‌తో చాలా బిజీగా ఉంది. దసరా మూవీతో తెలుగులో భారీ హిట్ అందుకున్న కీర్తి సురేష్ తమిళంలో సైరన్ సినిమాతో మంచి టాక్ తెచ్చుకుంది. ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా నటించి అట్రాక్ట్ చేసింది. కీర్తి సురేష్ తొలిసారిగా పోలీస్‌గా నటించిన సినిమా ఇదే.
అంతేకాకుండా.. ఓ వైపు హీరోయిన్‌గా చేస్తూనే మరోవైపు స్టార్ హీరోలకు చెల్లెలుగా సైతం నటిస్తోంది కీర్తి సురేష్. భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలిగా నటించి అలంరించిన విషయం తెలిసిందే. అలాగే పెద్దన్న సినిమాలో కూడా రజనీకాంత్‌కు సోదరిగా నటించింది కీర్తి సురేష్. ఇక ప్రభాస్ కల్కి 2898 ఏడీలో బుజ్జి అనే వాహనానికి వాయిస్ ఓవర్ అందించింది.
ఇదిలా ఉంటే. దక్షిణాదిలోనే కాకుండా ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టింది కీర్తి సురేష్. అంతేకాకుండా బాలీవుడ్‌లో ఆఫర్స్ రాగానే కీర్తి సురేష్ తన రూట్ మార్చేసింది. ఎప్పుడూ లేని విధంగా హాట్ షో చేస్తూ అలరిస్తోంది. అలాగే తన ఇన్నేళ్ల కెరీర్‌లో ఉన్న పాలసీని బ్రేక్ చేయనుందట కీర్తి సురేష్. ఇప్పటివరకు లిప్ లాక్ సీన్స్ చేయని కీర్తి సురేష్ ఇప్పుడు ఆ రూల్ బ్రేక్ చేయనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. తొలిసారిగా కీర్తి సురేష్ ఘాటు లిప్ కిస్ సీన్ చేయనుందని సమాచారం. అది కూడా పెళ్లయిన హీరోతో లిప్ లాక్ ఉండనుందట.
కీర్తి సురేష్ బాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్న సినిమా బేబి జాన్. తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోగా వరుణ్ ధావన్ చేస్తున్నాడు. ఈ మూవీలోనే వరుణ్ ధావన్‌తో కీర్తి సురేష్ లిప్ లాక్ సీన్ చేయనుందట. బాలీవుడ్‌లో లిప్ లాక్ చాలా కామన్ అనేది తెలిసిన విషయమే. అలాగే బేబి జాన్ మూవీలో కూడా లిప్ లాక్ సీన్ ఉందట. ఈ సన్నివేశానికి ఉన్న ప్రాధాన్యతను కీర్తి సురేష్‌కు డైరెక్టర్ అట్లీ వివరించాడట.
అలాగే సినిమా స్టోరీ చెప్పేముందు లిప్ లాక్ కంపల్సరీ అనే కండిషన్ కూడా పెట్టారట దర్శకనిర్మాతలు. మూవీలో లిప్ కిస్ సీన్ హైలెట్ కానుందని కూడా చెప్పారట. మొదట అందుకు ఒప్పుకోని కీర్తి సురేష్ తర్వాత బాలీవుడ్‌లో రాణించాలంటే ఇలాంటివి తప్పదు అని, లిప్ కిస్ సీన్‌కు ఉన్న ప్రాధాన్యతను బట్టి ఓకే చెప్పిందట మహానటి. ఇన్నాళ్లు సినిమాలో హాట్ షో కూడా చేయని ఇప్పుడు అన్ని హద్దులు దాటి లిప్ కిస్ సీన్ చేసేందుకు కీర్తి సురేష్ ఒప్పుకోవడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.
అలాగే అదృష్టం అంటే అతనిదే, పెట్టి పుట్టావ్ బ్రో అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్, ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా బాలీవుడ్‌లో హీరోగా రాణిస్తున్న వరుణ్ ధావన్ 2021లో నటాషా దలాల్‌ను వివాహం చేసుకున్నాడు. ఇటీవలే నటాషా దలాల్ ప్రెగ్నెంట్ అని వరుణ్ ధావన్ అధికారికంగా ప్రకటించాడు.