Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ చిత్రంలో మృణాల్‍తో పాటు అలనాటి హీరోయిన్ కూడా!
Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ సినిమాలో కొందరు స్టార్లు క్యామియో రోల్స్ చేస్తున్నారని బజ్ ఉంది. ఈ క్రమంలోనే ఈ చిత్రంలో అలనాటి తార శోభనతో పాటు యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా కనిపించనున్నారట.
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 ఏడీ మూవీకి క్రేజ్ పీక్స్‌లో ఉంది. ఈ భారీ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఈనెల జూన్ 27వ తేదీన విడుదల కానుంది. అయితే, ఈ చిత్రంలో కొందరు నటీనటుల సర్‌ప్రైజ్ క్యామియో రోల్స్ ఉంటాయని మొదటి నుంచి రూమర్లు ఉన్నాయి. ఈ క్రమంలో కొందరి పేర్లు కూడా బయటికి వచ్చాయి. అయితే, ఈ విషయాన్ని మూవీ టీమ్ ఇప్పటికీ రహస్యంగానే ఉంచుతోంది. అయితే, కల్కి చిత్రంలో క్యామియో రోల్స్ చేశారంటూ మరో ఇద్దరి పేర్లు తాజాగా బయటికి వచ్చాయి.
కల్కిలో మృణాల్, శోభన
కల్కి 2898 ఏడీ చిత్రంలో అలనాటి హీరోయిన్, సీనియర్ నటి శోభన, యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ క్యామియో రోల్స్ చేశారనే సమాచారం బయటికి వచ్చింది. వీరిద్దరూ ఈ మూవీలో కనిపించనున్నారనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. వైజయంతీ మూవీస్ నిర్మించిన సీతారామం సినిమాతోనే మృణాల్ టాలీవుడ్‍లోకి ఎంట్రీ ఇచ్చారు. కల్కి కూడా ఇదే బ్యానర్ ప్రొడక్షన్‍లో వస్తోంది.
కల్కి 2898 ఏడీ చిత్రంలో నేచురల్ స్టార్ నాని, రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ కూడా కనిపిస్తారని ఎప్పటి నుంచో రూమర్లు ఉన్నాయి. శోభన, మృణాల్ ఈ చిత్రంలో క్యామియో రోల్స్ చేశారని తాజాగా సమాచారం చక్కర్లు కొడుతోంది. అయితే, క్యామియో రోల్స్ గురించి కల్కి టీమ్ ఇప్పటి వరకు ఎలాంటి విషయాలు రివీల్ చేయలేదు. మరి ఈ చిత్రంలో ఎవరెవరు కనిపిస్తారో చూడాలి.
ట్రైలర్ డేట్ ఇదే!
కల్కి 2898 ఏడీ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మూటీ టీమ్ రెడీ అయిందని తెలుస్తోంది. జూన్ 7వ తేదీన ట్రైలర్ రానుందని టాక్. ముంబైలో జరిగే ఈవెంట్‍లో ట్రైలర్ లాంచ్ చేసేలా మూవీ టీమ్ ప్లాన్ చేసిందని సమాచారం. ట్రైలర్ రిలీజ్ డేట్‍ను అతిత్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.
మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్‍గా వస్తున్న కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్‍తో పాటు బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, దీపికా పదుకొణ్, దిశా పటానీ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. బుజ్జి అనే స్పెషల్ కారు ఈ చిత్రానికి మరో హైలైట్‍గా ఉంది. ఇప్పటికే ఆ కారును ఫుల్ క్రేజ్ వచ్చేసింది. బుజ్జిభైరవ పేరుతో ఇటీవలే యానిమేటెడ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.
కల్కి 2898 ఏడీ సినిమా ప్రమోషన్లను జోరుగా చేసేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. భారీగా, విభిన్నంగా ప్రమోషన్లను చేసేందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రణాళిక సిద్ధం చేశారని తెలుస్తోంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో చేసే అవకాశం ఉంది. ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రీ-రిలీజ్ ఈవెంట్లు నిర్వహించాలని కూడా ఆలోచిస్తున్నట్టు టాక్. భారీ బడ్జెట్‍తో వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.
టాపిక్