Kalki 2898 AD OTT: థియేటర్ల కంటే ముందే ఓటీటీలోకి రానున్న భైరవ, బుజ్జి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..-kalki 2898 ad ott prelude bujji bhairava set to debut on amazon prime video ott on may 31 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalki 2898 Ad Ott: థియేటర్ల కంటే ముందే ఓటీటీలోకి రానున్న భైరవ, బుజ్జి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Kalki 2898 AD OTT: థియేటర్ల కంటే ముందే ఓటీటీలోకి రానున్న భైరవ, బుజ్జి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Kalki 2898 AD Prelude OTT Release Date: కల్కి 2898 ఏడీ సినిమా నుంచి ఓటీటీలోకి ఓ సర్‌ప్రైజ్ వస్తోంది. భైరవ, బుజ్జి యానిమేటెడ్ ప్రిల్యూడ్ ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. డేట్ కూడా ఖరారైంది.

Kalki 2898 AD Prelude OTT: థియేటర్ల కంటే ముందే ఓటీటీలోకి రానున్న భైరవ, బుజ్జి

Kalki 2898 AD Prelude OTT: కల్కి 2898 ఏడీ మూవీ టీమ్ ప్రమోషన్లలో దూకుడు పెంచేసింది. ఈ సినిమాలో ఉండే ఫ్యూచరస్టిక్ స్పెషల్ కారు ‘బుజ్జి’ని ఇటీవలే పరిచయం చేయగా.. చాలా పాపులర్ అయింది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. భైరవ పాత్ర పోషిస్తున్నారు. ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 27వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే, ఈలోగానే భైరవ, బుజ్జి ఓటీటీలోకి రానున్నారు. ఈ యానిమేటెడ్ ప్రిల్యూడ్ స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ అయింది.

ప్రైమ్ వీడియోలో..

కల్కి 2898 ఏడీ నుంచి రానున్న ఈ ప్రిల్యూడ్ యానిమేషన్ రూపంలో ఉండనుంది. బుజ్జిభైరవ పేరుతో ఇది రానుంది. మే 31వ తేదీన బుజ్జిభైరవ ప్రిల్యూడ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (మే 27) అధికారికంగా వెల్లడించింది.

ఇంట్రెస్టింగ్‍గా టీజర్

ఈ బుజ్జిభైరవ యానిమేషన్ ప్రిల్యూడ్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్‌మెంట్‍ కోసం నేడు టీజర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. భైరవ (ప్రభాస్).. బుజ్జి కారుకు వెల్డింగ్ చేస్తుండగా కొందరు పిల్లలు వస్తారు. “ఎప్పుడూ వెల్డింగ్ చేస్తుంటావ్.. ఈ వేసవి అంతా ఎదురుచూస్తూనే సరిపోయింది. సెలవులు అయిపోతున్నాయి” అని పిల్లలు అంటారు. ఇంకొన్ని రోజులు అని ప్రభాస్.. “అంటే మేం ముసలోళ్లం అయిపోతున్నాం. ఇప్పుడే చూపించు” అని పిల్లలు డిమాండ్ చేశారు. సర్‌ప్రైజ్ చూపిచ్చేద్దామా అని బుజ్జి బ్రెయిన్‍ను ప్రభాస్ అడుగుతారు. ఆ తర్వాత యానిమేషన్ రూపంలో బుజ్జిభైరవ విజువల్స్ కనిపిస్తాయి. మే 31న బుజ్జిభైరవ.. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వస్తారని ఇలా అనౌన్స్ చేసింది మూవీ టీమ్.

యానిమేషన్ రూపంలో..

కల్కి 2898 ఏడీ నుంచి రానున్న ఈ బుజ్జిభైరవ ప్రిల్యూడ్ యానిమేషన్ రూపంలో ఉండనుంది. భైరవ, స్పెషల్ కారు బుజ్జిని పరిచయం చేసేలా ఈ వీడియో ఉంటుంది. మే 31న ఈ ప్రిల్యూడ్‍ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసేయచ్చు. ఈ చిత్రంలో బుజ్జి బ్రెయిన్‍కు స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.

బుజ్జికారుకు ఇప్పటికే ఫుల్ క్రేజ్ వచ్చింది. ఆరు టన్నుల బరువుతో ఫ్యూచరిస్టిక్‍ డిజైన్‍తో ఉన్న ఈ కారును కల్కి 2898 ఏడీ మూవీ కోసమే తయారు చేయించారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఓ భారీ ఈవెంట్ ద్వారా ఈ బుజ్జి కారును ఇటీవలే ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రభాస్ ఈ కారుతో ఇచ్చిన ఎంట్రీ అదిరిపోయింది. అలాగే, బుజ్జితో భైరవ గ్లింప్స్ కూడా అద్భుతమైన విజువల్స్‌తో ఆకట్టుకుంది.

కల్కి 2898 ఏడీ చిత్రాన్ని భారీ బడ్జెట్‍తో వైజయంతీ మూవీస్ నిర్మించింది. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ ఇస్తున్నారు. ప్రభాస్‍తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్ ఈ మూవీలో కీలకపాత్రలు చేశారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తిగా ఫినిష్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తవుతున్నాయి. జూన్ మొదటి వారం లేకపోతే రెండో వారంలో ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ రెడీ అవుతోంది.