Kalki 2898 AD Release Date: ఉత్కంఠకు తెర.. కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్ ఖరారు.. అధికారికంగా ప్రకటించిన మూవీ టీమ్-kalki 2898 ad release date announced officially prabhas nag ashwin movie will release on june 27 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalki 2898 Ad Release Date: ఉత్కంఠకు తెర.. కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్ ఖరారు.. అధికారికంగా ప్రకటించిన మూవీ టీమ్

Kalki 2898 AD Release Date: ఉత్కంఠకు తెర.. కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్ ఖరారు.. అధికారికంగా ప్రకటించిన మూవీ టీమ్

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 27, 2024 05:51 PM IST

Kalki 2898 AD Release Date: కల్కి 2898 ఏడీ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ గ్లోబల్ చిత్రం రిలీజ్ డేట్‍ను మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది.

Kalki 2898 AD Release Date: ఉత్కంఠకు తెర.. కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్ ఖరారు.. అధికారికంగా ప్రకటించిన మూవీ టీమ్
Kalki 2898 AD Release Date: ఉత్కంఠకు తెర.. కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్ ఖరారు.. అధికారికంగా ప్రకటించిన మూవీ టీమ్

Kalki 2898 AD Release Date: సినీ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న అప్‍డేట్ వచ్చేసింది. 'కల్కి 2898 ఏడీ' సినిమా కొత్త రిలీజ్ డేట్ ఖరారైంది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ మూవీ విడుదల తేదీని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 ఏడీ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. కొత్త రిలీజ్ డేట్ వివరాలు ఇక్కడ చూడండి.

రిలీజ్ డేట్ ఇదే

కల్కి 2898 ఏడీ సినిమా జూన్ 27వ తేదీన రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (ఏప్రిల్ 27) అధికారింగా వెల్లడించింది. అంటే నేటి నుంచి సరిగ్గా రెండు నెలల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

అద్భుతంగా కొత్త పోస్టర్

జూన్ 27వ తేదీన కల్కి 2898 ఏడీ రిలీజ్ కానున్నట్టు ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఇందులో ప్రభాస్‍తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణ్ ఉన్నారు. యుద్ధరంగంలో వీరు ముగ్గురు నిల్చున్నట్టుగా ఈ పోస్టర్ ఉంది. ఈ పోస్టర్ క్వాలిటీ అద్భుతంగా కనిపిస్తోంది. బ్యాక్‍గ్రౌండ్‍లో చక్రం నుంచి ప్రభాస్, అమితాబ్, దీపికా ఇంటెన్స్ లుక్ వరకు ఈ పోస్టర్ అదిరిపోయింది. “మెరుగైన రేపటి కోసం అన్ని శక్తులు కలిశాయి” అని వైజయంతీ మూవీస్ ట్వీట్ చేసింది.

కల్కి 2898 ఏడీ మూవీని మే 9వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ గతంలో ప్రకటించింది. అయితే, ఎన్నికల సందర్భంగా వాయిదా వేయకతప్పలేదు. కొత్త విడుదల తేదీపై చాలా ఆలోచనలు చేసింది మూవీ టీమ్. గ్లోబల్ రేంజ్‍లో విడుదల చేయాల్సి ఉండటంతో తర్జనభర్జనలు పడింది. ఎట్టకేలకు జూన్ 27న కల్కి చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించింది.

విష్ణుమూర్తి పదో అవతారంగా భావించే కల్కి స్ఫూర్తితో ఈ మూవీలో ప్రభాస్ పాత్ర ఉండనుంది. బైరవ అనే క్యారెక్టర్‌ను ఈ చిత్రంలో చేశారు రెబల్ స్టార్. అశ్వత్థామ పాత్రను ఈ మూవీలో పోషించారు అమితాబ్ బచ్చన్. ఇటీవలే అశ్వత్థామ క్యారెక్టర్‌కు సంబంధించి గ్లింప్స్ వచ్చింది. ఈ గ్లింప్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రతీ ఫ్రేమ్ హాలీవుడ్ రేంజ్‍లో ఉందంటూ ప్రశంసలు వచ్చాయి. మహాభారతంతో మొదలై భవిష్యత్తు వరకు.. 6000 సంవత్సరాల కాలం ఈ చిత్రంలో ఉంటుందని దర్శకుడు నాగ్అశ్విన్ గతంలోనే చెప్పారు.

కల్కి 2898 ఏడీ చిత్రంలో తమిళ సీనియర్ స్టార్ లోకనాయకుడు కమల్ హాసన్ కూడా నటిస్తున్నారు. ఈ మూవీలో తనది క్యామియో రోల్ అని ఆయన ఇటీవల చెప్పారు. రాజేంద్ర ప్రసాద్, పశుపతి, దిశా పటానీ కూడా ఈ మూవీలో కీలకపాత్రలు పోషించారు. యంగ్ హీరోలు దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ కూడా ఈ మూవీలో కనిపిస్తారనే రూమర్లు ఉన్నాయి.

కల్కి 2898 ఏడీ మూవీని సుమారు రూ.600 కోట్ల భారీ బడ్జెట్‍తో వైజయంతీ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ మూవీ కోసం ఓ కొత్త ప్రపంచాన్నే దర్శకుడు నాగ్ అశ్విన్ సృష్టించారని తెలుస్తోంది. హాలీవుడ్ రేంజ్ క్వాలిటీతో ఉండే వీఎఫ్‍ఎక్స్ ఈ చిత్రంలో ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఈ మూవీకి సంతోశ్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. భారతీయ భాషలతో పాటు కొన్ని విదేశీ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కానుందని తెలుస్తోంది.

IPL_Entry_Point