Kalki 2898 AD Amitabh: కల్కి 2898 ఏడీలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్.. డీ-ఏజింగ్ టెక్నాలజీతో ఓ అద్భుతం
Kalki 2898 AD - Amitabh Bachchan: కల్కి 2898 ఏడీ సినిమా నుంచి అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్‌ను మూవీ టీమ్ రివీల్ చేసింది. గ్లింప్స్‌లో ఓ అద్భుతం చేసింది. అయితే, రిలీజ్ డేట్‍ను వెల్లడించకుండా నిరాశపరిచింది.
Kalki 2898 AD - Amitabh Bachchan: కల్కి 2898 ఏడీ సినిమా నుంచి మరో అప్‍డేట్ వచ్చింది. ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్న బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ గురించి గ్లింప్స్‌ను నేడు (ఏప్రిల్ 21) రిలీజ్ చేసింది మూవీ టీమ్. అయితే, విడుదల తేదీపై సందిగ్ధత మాత్రం కొనసాగింది. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించలేదు. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ మూవీకి నాగ్అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేడు అమితాబ్ బచ్చన్ గ్లింప్స్‌తో పాటు కొత్త రిలీజ్ డేట్‍ను మూవీ టీమ్ ప్రకటిస్తుందని అంచనాలు వచ్చినా... ఆ విషయంలో మాత్రం నిరాశే మిగిలింది. అయితే, డీ-ఏజింగ్ టెక్నాలజీతో ఈ గ్లింప్స్‌లో ఓ అద్బుతం చేసింది నాగ్ అశ్విన్ టీమ్.

అమితాబ్ బచ్చన్ పాత్ర ఇదే
కల్కి 2898 చిత్రంలో అశ్వత్థామ పాత్రను అమితాబ్ బచ్చన్ పోషిస్తున్నారు. ద్రోణాచార్య పుత్ర అశ్వత్థామగా ఆయన నటిస్తున్నారు. ఈ పాత్ర గురించి నేడు (ఏప్రిల్ 21) గ్లింప్స్ రిలీజ్ చేసింది మూవీ టీమ్.
“మీకు మరణం లేదా.. మీరు భగవంతుడా.. ఎవరు మీరు” అని ఓ పిల్లాడు అడుగడంతో ఈ గ్లింప్స్ మొదలవుతుంది. "ద్వాపరయుగం నుంచి దశావతారం కోసం నేను వేచిచూస్తున్నా. గురు ద్రోణాచార్య కుమారుడు అశ్వత్థామను నేను” అని అమితాబ్ బచ్చన్ చెబుతారు. ఈ గ్లింప్స్ ఆకట్టుకునేలా ఉంది. పురాతమైన దేవాలయంలో ఈ గ్లింప్స్ సాగింది.
డీ-ఏజింగ్‍తో యంగ్ అమితాబ్
De-aging Technology: ఈ గ్లింప్స్‌లో డీ-ఏజింగ్ టెక్నాలజీని దర్శకుడు నాగ్అశ్విన్ ఉపయోగించారు. దీని ద్వారా.. అమితాబ్ బచ్చన్‍ను యువకుడిలా చూపించారు. ఈ గ్లింప్స్‌లో ఇది హైలైట్‍గా నిలిచింది. కోరమీసంతో లాంగ్ హెయిర్‌లో అమితాబ్ యంగ్ లుక్ అద్భుతంగా ఉంది. అమితాబ్ యువకుడిగా ఉన్నప్పుడు ఎలా ఉండేవారో అచ్చం అలాంటి లుక్‍నే టెక్నాలజీతో సాధించడంలో నాగ్ అశ్విన్ సక్సెస్ అయ్యారు. అమితాబ్ బచ్చన్ యంగ్ లుక్‍కు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగ్‍అశ్విన్‍ను అందరూ ప్రశంసిస్తున్నారు.
ఈ విషయంలో నిరాశ
కల్కి 2898 ఏడీ సినిమాను మే 9వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ గతంలో ప్రకటించింది. అయితే, ఎన్నికల వల్ల వాయిదా పడడం ఖాయమైంది. అయితే, నేడు గ్లింప్స్‌తో పాటు కొత్త రిలీజ్ డేట్‍ను మూవీ టీమ్ ప్రకటిస్తుందని సినీ ప్రేక్షకులందరూ ఆశించారు. అయితే, ఆ విషయాన్ని కల్కి టీమ్ వెల్లడించలేదు. రిలీజ్ డేట్ లేకుండానే గ్లింప్స్ తీసుకొచ్చింది. దీంతో ప్రేక్షకులకు ఈ విషయంలో నిరాశ ఎదురైంది. త్వరలోనే కొత్త విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉంది.
కల్కి 2898 ఏడీ సినిమాను భారత హిందూ పురాణాల స్ఫూర్తితో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్‍తో పాటు తమిళ స్టార్ కమల్ హాసన్, దీపికా పదుకొణ్, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. సుమారు రూ.600 కోట్ల భారీ బడ్జెట్‍తో ఈ మూవీని వైజయంతీ మూవీస్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. గ్లోబల్ రేంజ్‍లో కల్కి సినిమా రిలీజ్ కానుంది.