IND vs PAK: ట్రాక్టర్ అమ్మి టికెట్ కొన్నా.. గుండె బద్దలైంది: పాకిస్థాన్ ఫ్యాన్.. వీడియో-pakistan fan says he sold tractor to buy ticket for ind vs pak match in t20 world cup 2024 watch video ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Pak: ట్రాక్టర్ అమ్మి టికెట్ కొన్నా.. గుండె బద్దలైంది: పాకిస్థాన్ ఫ్యాన్.. వీడియో

IND vs PAK: ట్రాక్టర్ అమ్మి టికెట్ కొన్నా.. గుండె బద్దలైంది: పాకిస్థాన్ ఫ్యాన్.. వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 10, 2024 01:55 PM IST

IND vs PAK T20 World Cup 2024: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ చూసేందుకు ట్రాక్టర్ అమ్మేశాడు ఓ అభిమాని. పాక్ ఓడిపోవటంతో బాధగా ఉందని అన్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.

IND vs PAK: ట్రాక్టర్ అమ్మి టికెట్ కొన్నా.. గుండె బద్దలైంది: పాకిస్థాన్ ఫ్యాన్.. వీడియో
IND vs PAK: ట్రాక్టర్ అమ్మి టికెట్ కొన్నా.. గుండె బద్దలైంది: పాకిస్థాన్ ఫ్యాన్.. వీడియో

IND vs PAK T20 World Cup 2024: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే ఇరు దేశాల అభిమానులు భావోద్వేగంగా తీసుకుంటారు. ఈ సమరంలో ఎలాగైనా తమ జట్టే గెలువాలని కోరుకుంటారు. కాగా, టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ చూసేందుకు ఓ అభిమాని ఏకంగా తన ట్రాక్టర్ అమ్మేశాడు. ఆ డబ్బుతో టికెట్ కొని న్యూయార్క్ వేదికగా ఆదివారం (జూన్ 9) జరిగిన మ్యాచ్‍కు ఆ పాక్ అభిమాని హాజరయ్యాడు. అయితే, ఈ మ్యాచ్‍లో తమ జట్టు ఓడిపోవటంతో తన గుండె బద్దలైందని అతడు అన్నాడు. ఆ ఫ్యాన్ ఏం చెప్పారంటే..

ట్రాక్టర్ అమ్మేసి..

తాను ట్రాక్టర్ అమ్మేసి 3వేల డాలర్ల (సుమారు రూ.2.50లక్షలు) విలువైన టికెట్ కొన్నానని ఓ పాకిస్థాన్ అభిమాని చెప్పాడు. కానీ తమ జట్టు ఓడిపోవడం చాలా బాధగా ఉందని అన్నాడు. “3వేల విలువైన టికెట్ కొనేందుకు నేను ట్రాక్టర్ అమ్మేసి వచ్చా. ఇండియా స్కోరు చూశాక.. ఈ మ్యాచ్ మేం ఓడిపోతామని అనుకోలేదు. మ్యాచ్ మా చేతుల్లోనే ఉండేది. కానీ బాబర్ ఆజమ్ ఔటయ్యాక చాలా మంది బాధపడ్డారు” అని ఏఎన్‍ఐతో ఆ అభిమాని అన్నాడు.

120 పరుగుల లక్ష్యం సునాయాసంగా ఛేదించేదే అని ఆ అభిమాని చెప్పాడు. కానీ పాక్ ఓడడం చాలా బాధగా, సిగ్గుగా ఉందని చెప్పాడు. భారత అభిమానుంలందరికీ అభినందనలు చెప్పాడు ఆ పాక్ ఫ్యాన్. హృదయం బద్దలైందంటూ ఆవేదనతో మాట్లాడాడు.

న్యూయర్క్ స్టేడియం వద్ద సంబరాలు

టీమిండియాను సపోర్ట్ చేసేందుకు ఈ మ్యాచ్‍కు భారీ సంఖ్యలో అభిమానులు న్యూయార్క్ స్టేడియానికి వచ్చారు. మ్యాచ్ ఇండియాలో జరుగుతుందా అనేలా సపోర్ట్ చేశారు. మ్యాచ్ గెలిచిన తర్వాత టీమిండియా అభిమానులు న్యూయార్క్ స్టేడియం బయట సంబరాలు చేసుకున్నారు. డోళ్లు వాయిస్తూ సెలెబ్రేట్ చేసున్నారు. ఇండియా.. ఇండియా అంటూ హోరెత్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి.

పాకిస్థాన్‍పై గెలువటంతో ఇండియాలోనూ చాలా నగరాల్లో అభిమానులు భారీ స్థాయిలో సంబరాలు చేసుకున్నారు. అర్ధరాత్రి తర్వాత మ్యాచ్ ముగిసినా ఆ సమయంలోనూ చాలా చోట్ల వీధుల్లో మోతెక్కించారు.

టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ గ్రూప్-ఏలో భారత్ తొలి రెండు మ్యాచ్‍లు గెలిచి సత్తాచాటింది. గ్రూప్ దశలో మరో రెండు మ్యాచ్‍లు మిగిలి ఉన్నాయి. అమెరికా, కెనడాతో టీమిండియా ఆడాల్సి ఉంది. ఒక్క మ్యాచ్ గెలిచినా సూపర్-8కు భారత్ దూసుకుపోతుంది.

భారత్ ఉత్కంఠ గెలుపు

పాకిస్థాన్‍పై టీమిండియా ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. తక్కువ స్కోరే చేసినా భారత బౌలర్లు సమిష్టిగా సత్తాచాటడంతో విజయం సాధించింది. ప్రపంచకప్‍ల్లో పాకిస్థాన్‍పై ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. అయితే, 120 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో పాక్ తడబడింది. 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులు చేసి ఆరు పరుగులు తేడాతో ఓడింది. భారత పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా 4 ఓవర్లలో కేవలం 14 పరుగుకే ఇచ్చి మూడు వికెట్లు తీసున్నాడు. భారత గెలుపులో కీలకపాత్ర పోషించాడు.

టీ20 ప్రపంచకప్‍లో తదుపరి మే 12న న్యూయార్క్ వేదికగా అమెరికాతో తలపడనుంది భారత్.

టీ20 వరల్డ్ కప్ 2024