Pakistan Cricket team: ఇదో చెత్త టీమ్.. ఆ ఇద్దరినీ ఇంట్లో కూర్చోబెట్టండి: పాకిస్థాన్ టీమ్‌పై మాజీల ఆగ్రహం
Pakistan Cricket team: టీమిండియా చేతుల్లో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ మరో ఓటమి తర్వాత ఆ టీమ్ మాజీ క్రికెటర్లు తీవ్రంగా మండిపడ్డారు. మొత్తం జట్టునే మార్చేయాలని మాజీ పేస్ బౌలర్లు వసీం అక్రమ్, షోయబ్ అక్తర్, వకార్ యూనిస్ అభిప్రాయపడ్డారు.
Pakistan Cricket team: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కు టీ20 వరల్డ్ కప్ లలో ఇండియా చేతుల్లో మరో ఓటమి తప్పలేదు. 120 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక 6 పరుగులతో ఆ టీమ్ ఓడటం అక్కడి అభిమానులకే కాదు మాజీ క్రికెటర్లకు కూడా మింగుడు పడటం లేదు. వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్ లాంటి పాక్ మాజీ క్రికెటర్లు బాబర్ ఆజం అండ్ టీమ్‌ను చీల్చి చెండాడుతున్నారు.
ఆ ఇద్దరినీ ఇంట్లో కూర్చోబెట్టిండి: అక్రమ్
పాకిస్థాన్ లెజెండరీ ఆల్ రౌండర్ వసీం అక్రమ్ పాక్ ఓటమిపై స్పందించాడు. "వాళ్లు 10 ఏళ్లుగాక్రికెట్ ఆడుతున్నారు. నేను వాళ్లకు నేర్చించలేను. రిజ్వాన్ కు అసలు మ్యాచ్ పై అవగాహనే లేదు. బుమ్రాకు వికెట్లు తీయడానికే బౌలింగ్ ఇచ్చారని, అందుకే అతన్ని జాగ్రత్తగా ఆడాలన్నది రిజ్వాన్ కు తెలిసి ఉండాల్సింది. కానీ అతడు భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు" అని అక్రమ్ మండిపడ్డాడు.
"తాము బాగా ఆడకపోతే కోచ్ లను తీసేస్తారు తప్ప తమకు ఏమీ కాదన్నట్లు పాకిస్థాన్ టీమ్ ప్లేయర్స్ వ్యవహరిస్తున్నారు. ఇక నుంచి కోచ్‌లను అలాగే ఉంచి మొత్తం జట్టునే మార్చేయాలి. జట్టులో కొందరు ప్లేయర్స్ అసలు ఒకరితో మరొకరు మాట్లాడుకోరు. ఇది అంతర్జాతీయ క్రికెట్. మీరు దేశం కోసం ఆడుతున్నారు. ఇలాంటి ప్లేయర్స్ ను ఇంట్లో కూర్చోబెట్టండి" అని షహీన్ అఫ్రిది, బాబర్ ఆజంల గురించి వసీం అక్రమ్ స్పందించాడు.
మాటలు రావడం లేదు: వకార్ యూనిస్
ఇక మరో మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మాట్లాడాడు. తన యూట్యూబ్ ఛానల్లో మ్యాచ్ పై స్పందించాడు. "చాలా నిరాశగా ఉంది. బాల్ కి ఒక రన్ తీస్తే సరిపోయేది. అంతకుముందు ఇండియా మిడిలార్డర్ చేతులెత్తేసింది. 160 రన్స్ చేస్తుందనుకున్నా.. పాకిస్థాన్ అందుకోలేకపోయింది. రిజ్వాన్ మరో 20 రన్స్ చేసి ఉంటే పాకిస్థాన్ గెలిచేది, కానీ బ్యాటర్లు వాళ్ల మెదళ్లకు పని చెప్పలేదు" అని వకార్ యూనిస్ అన్నాడు.
ఇక మరో మాజీ వకార్ యూనస్ కూడా స్పందించాడు. "పాకిస్తాన్ ఓ సూపర్ టీమ్. కానీ ఈ మ్యాచ్ కూడా గెలిపించలేదంటే నేనేం చెప్పాలి. మంచిగా ఓ పళ్లెంలో పెట్టి ఇచ్చారు. కానీ మీరు మాత్రం దానిని పారవేసుకున్నారు" అని వకార్ యూనిస్ అన్నాడు.
పాకిస్థాన్ పై ఇండియా కేవలం 6 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ ఓటమితో ఈ ఏడాది ఆడిన రెండు మ్యాచ్ లలోనూ పాక్ ఓటమిపాలైంది. దీంతో టీ20 వరల్డ్ కప్ ప్లేఆఫ్స్ ఆశలు సన్నగిల్లాయి. ఇప్పుడు కెనడా, ఐర్లాండ్ లతో గెలిస్తేనే ముందడుగు వేసే పరిస్థితి నెలకొంది. అంతేకాదు ఇండియా కూడా తన రెండు మ్యాచ్ లలో యూఎస్ఏ, కెనడాలను ఓడించాల్సి ఉంటుంది. అంటే మళ్లీ పాక్ సూపర్ 8 ఆశలు ఇండియా చేతుల్లోనే ఉన్నాయి. టీమిండియా తన తర్వాతి మ్యాచ్ ను బుధవారం (జూన్ 12) యూఎస్ఏతో ఆడనుంది. జూన్ 15న చివరి లీగ్ మ్యాచ్ కెనడాతో జరుగుతుంది.