Babar Azam: లైవ్ టీవీ డిబేట్‌లో గొడవ పడిన పాకిస్థాన్ క్రికెటర్లు.. బాబర్ ఆజం ఏమీ ధోనీ కాదంటూ..-pakistan cricketers heated argument on live tv over captaincy to babar azam ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Babar Azam: లైవ్ టీవీ డిబేట్‌లో గొడవ పడిన పాకిస్థాన్ క్రికెటర్లు.. బాబర్ ఆజం ఏమీ ధోనీ కాదంటూ..

Babar Azam: లైవ్ టీవీ డిబేట్‌లో గొడవ పడిన పాకిస్థాన్ క్రికెటర్లు.. బాబర్ ఆజం ఏమీ ధోనీ కాదంటూ..

Hari Prasad S HT Telugu
Jun 05, 2024 01:22 PM IST

Babar Azam: పాకిస్థాన్ క్రికెటర్లు లైవ్ టీవీ డిబేట్ లో గొడవ పడ్డారు. బాబర్ ఆజంకు తిరిగి కెప్టెన్సీ ఇవ్వడంపై వీళ్లు వాగ్వాదానికి దిగారు. అతడేమీ ధోనీ కాదంటూ షెహజాద్ అనడం గమనార్హం.

లైవ్ టీవీ డిబేట్‌లో గొడవ పడిన పాకిస్థాన్ క్రికెటర్లు.. బాబర్ ఆజం ఏమీ ధోనీ కాదంటూ..
లైవ్ టీవీ డిబేట్‌లో గొడవ పడిన పాకిస్థాన్ క్రికెటర్లు.. బాబర్ ఆజం ఏమీ ధోనీ కాదంటూ.. (AFP)

Babar Azam: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్సీని తిరిగి బాబర్ ఆజంకు ఇవ్వడంపై ఆ టీమ్ ఓపెనర్లు అహ్మద్ షెహజాద్, ఇమాముల్ హక్ వాగ్వాదానికి దిగారు. లైవ్ టీవీ చర్చలోనే ఈ ఇద్దరు క్రికెటర్లు తీవ్రంగా వాదించుకున్నారు. టీ20 వరల్డ్ కప్ 2024లో యూఎస్ఏతో ఆ టీమ్ తొలి మ్యాచ్ ఆడబోయే ముందు వీళ్లు జియో టీవీ ఛానెల్ చర్చలో పాల్గొన్నారు.

yearly horoscope entry point

బాబర్ ఆజంను టార్గెట్ చేసిన షెహజాద్

ఈ చర్చలో బాబర్ ఆజంను లక్ష్యంగా చేసుకొని అహ్మద్ షెహజాద్ తీవ్ర విమర్శలు చేశాడు. ప్లేయర్స్ ఎంపికలో అతడు పక్షపాతం చూపించాడని ఆరోపించాడు. "బాబర్ ఆజం గురించి చెప్పాలంటే స్నేహం గురించి మాట్లాడాలి. చాలా కాలంగా అతడు కొందరు ప్లేయర్స్ ను కొనసాగిస్తున్నాడు. వాళ్లు ఫామ్ లో లేరు. వాళ్లు ఆడిన మ్యాచ్ ల సంఖ్య చూస్తే ఎవరూ అంతకాలం ఉండరు.

మరో కెప్టెన్ ఉండి ఉంటే అతడు 35, 40 మ్యాచ్ ల పాటు కొనసాగించడు. అతడు తన గురించి ఆలోచించేవాడు. మనం క్రికెట్ ఆడేది ద్వైపాక్షిక సిరీస్ లు గెలవడానికి కాదు. ఐసీసీ ఈవెంట్ల కోసం. గత నాలుగైదేళ్లుగా అసలు గెలిచామా? మనం గెలవలేదంటే జట్టులో గ్యాంగ్స్, ఫ్రెండ్‌షిప్స్ తోపాటు నాలుగైదేళ్లుగా క్రికెట్ ను తారుమారు చేస్తున్న ఏజెంట్ ఉన్నాడని నేను అంటాను" అని షెహజాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

ఈ ప్లేయర్స్ అందరూ సర్ఫరాజ్ కెప్టెన్సీలోనే వచ్చారని గుర్తు చేయగా.. అతడు 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాడని, అందుకే ఆ ప్లేయర్స్ ను కొనసాగించినా.. బాబర్ ఏం గెలిచాడని వాళ్లనే నమ్ముకున్నాడని ప్రశ్నించాడు. కెప్టెన్సీ నుంచి తొలగించి మళ్లీ తీసుకురావడానికి బాబర్ ఆజం ఏమీ ధోనీ కాదని ఈ సందర్భంగా షెహజాద్ తీవ్రంగా స్పందించాడు.

ఇమామ్, షెహజాద్ మధ్య వాగ్వాదం

పాకిస్థాన్ టీమ్ బాబర్ కు తిరిగి కెప్టెన్సీ అప్పగించే అంశంపైనే షెహజాద్, ఇమామ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బాబర్ కు మళ్లీ కెప్టెన్సీ అప్పగించడంపై అభిప్రాయం చెప్పాల్సిందిగా ఇమామ్ ను కోరగా.. అతడు ఇలా స్పందించాడు. "బాబర్ ఆజంను అతని అనుమతి లేకుండానే కెప్టెన్సీ నుంచి తొలగించారు. మళ్లీ అతని అనుమతి లేకుండానే తీసుకొచ్చారు.

2021లో మనం సెమీఫైనల్స్ వెళ్లాం. 2022లో ఫైనల్స్ ఆడాము. అంటే బాగా ఆడినట్లే కదా. మనం గెలవలేదు. అది వేరే చర్చ. బాబర్ ఈ ప్లేయర్స్ ను ఇష్టపడతాడని అనొచ్చు కానీ ఫ్రెండ్షిప్ అని అనడం వ్యక్తిగతంగా విమర్శించినట్లు అవుతుంది" అని ఇమామ్ అన్నాడు.

ఇక్కడే షెహజాద్ తీవ్రంగా స్పందించాడు. "ఇమామ్ ఇంకా సెంట్రల్ కాంట్రాక్టులో ఉన్నాడు. యువకుడు. మేము కూడా ఆ వయసులో అలాగే మాట్లాడాం. ఇప్పుడు నా వయసు 34 ఏళ్లు. ఇలాంటి చూసి విసుగొచ్చేసింది. ఇప్పటికైనా మారాలి. ప్లేయర్స్ ను నాలుగైదేళ్లపాటు కొనసాగించడం వల్ల దేశవాళీ క్రికెటర్లకు అన్యాయం చేస్తున్నారు. వాళ్ల హక్కులను దోచుకుంటున్నారు" అని షెహజాద్ అన్నాడు.

దీనిపై ఇమామ్ స్పందిస్తూ.. "నేను సెంట్రల్ కాంట్రాక్టులో ఉన్నాను. నేను గత ఆరేడేళ్లుగా ఆడుతున్నారు. కానీ నేను 36 ఏళ్ల వయసులోనే ఇలాగే మాట్లాడతాను. ఎవరికైనా సమస్య ఉంటే వాళ్లు కూడా 28 ఏళ్ల వయసు వారిలాగా మాట్లాడొచ్చు. వాళ్లు ఎందుకు అలా మాట్లాడరు" అని ఇమామ్ అన్నాడు.

Whats_app_banner