వర్షాలకు ముంబై మహా నగరం ఉక్కిరిబిక్కిరి..
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఆదివారం ఉరుములతో కూడిన భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
(1 / 5)
ముంబైలో ఆదివారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మహారాష్ట్ర తీరం వెంబడి అనుకూల పరిస్థితుల కారణంగా రుతుపవనాలు సాధారణ షెడ్యూల్ కంటే రెండు రోజులు ముందుగానే ఆదివారం నగరంలోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
(ANI)(2 / 5)
ముంబై: ఆదివారం కురిసిన భారీ వర్షానికి సియోన్, దాదర్, మజ్గావ్, కుర్లా, విఖ్రోలి, అంధేరి వంటి పలు ప్రాంతాలు జలమయం కావడంతో వాహనాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.
(Anshuman Poyrekar/ Hindustan Times)(3 / 5)
ముంబై: నైరుతి రుతుపవనాలు ముంబైలో ప్రవేశించిన మరుసటి రోజే నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి, సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
(PTI)(4 / 5)
సోమవారం ఉదయం 8 గంటలకు ముగిసిన 24 గంటల వ్యవధిలో మహా నగరంలో సగటున 99.11 మిల్లీమీటర్లు, ముంబైలోని తూర్పు ప్రాంతాల్లో 61.29 మిల్లీమీటర్లు, పశ్చిమ ప్రాంతాల్లో 73.78 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారి ఒకరు తెలిపారు.
(PTI)ఇతర గ్యాలరీలు