జూన్ 11, నేటి రాశి ఫలాలు.. బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడతాయి, రుణ ప్రయత్నాలు విఫలం-today june 11th 2024 rasi phalalu in telugu check your zodiac signs result for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  జూన్ 11, నేటి రాశి ఫలాలు.. బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడతాయి, రుణ ప్రయత్నాలు విఫలం

జూన్ 11, నేటి రాశి ఫలాలు.. బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడతాయి, రుణ ప్రయత్నాలు విఫలం

HT Telugu Desk HT Telugu
Jun 11, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ111.06.2024 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

జూన్ 11వ తేదీ నేటి రాశి ఫలాలు
జూన్ 11వ తేదీ నేటి రాశి ఫలాలు (pixabay)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 11.06.2024

వారం: మంగళవారం, తిథి : పంచమి,

నక్షత్రం : అశ్లేష, మాసం : జ్యేష్టము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యుల నుండి సహకారముంటుంది. మీ ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయిస్తారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడులుంటాయి. కోర్టు కేసులలో పురోగతిని చూస్తారు. మీ కృషి ప్రయత్నాలకు పూర్తి ఫలితాలు పొందుతారు. వ్యాపారాలు విస్తరిస్తాయి. బంధుమిత్రులతో అభిప్రాయభేదములేర్పడు సూచనలున్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మేష రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వరునికి దీపారాధన చేయండి. రాహుకాల సమయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారంలో ధనలాభమున్నది. విదేశాల్లో వ్యాపారం చేసే వారికి ఊహించని లాభాలుంటాయి. ఉద్యోగస్తులకు అదనపు ఆదాయ వనరులు లభిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపాలలో అశించిన పురోగతి లభిస్తుంది. ప్రతి రంగంలో విజయం సాధించే అవకాశముంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలుంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దుర్గాదేవిని పూజించటం మంచిది. దేవీ ఖద్గమాల పఠించండి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. మనోధైర్యంతో మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అనవసర విషయాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు. ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగపరంగా అంత అనుకూలంగా లేదు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడే సూచనలున్నాయి. రుణ సమస్యలు అధికమై మానసిక ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు చేస్తారు. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సుబ్రహ్మణ్యుని ఆలయం దర్శించటం మంచిది. రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. మీ పనులు మీరు సకాలంలో పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందాన్నిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. కర్కాటక రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆంజనేయ స్వామి వారిని పూజించండి. అప్పాలను ఆంజనేయస్వామికి నివేదించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలసి శుభకార్యాలకు హాజరవుతారు. వృత్తి వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. ఉద్యోగ వ్యవహారాలలో ఆటంకాలు అధిగమిస్తారు. ఆరోగ్యపరంగా అనుకూలించును. మరింత శుభఫలితాలు పొందటం కోసం అమ్మవారిని పూజించాలి. సుబ్రహ్మణ్యుని ఆలయాన్ని దర్శించడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆప్తుల వలన కొన్ని విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కొన్ని సమస్యలు తొలగి ఊరట కలుగుతుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దుర్గాదేవిని పూజించడం, ఆరాధించడం మంచిది. రాహుకాల సమయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. ధన, వస్తు, వాహన లాభాలున్నాయి. కొన్ని వివాదాల నుంచి మీ తెలివితేటలతో బయటపడతారు. సంఘంలో పెద్దల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి. తులా రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం రుణ విమోచన అంగారక స్తోత్రం పఠించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. మీరు చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థిక వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. వృశ్చిక రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం వినాయకుడిని పూజించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగాలలో స్వల్ప మార్పులుంటాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ధనవ్యయముండును. కుటుంబ సమస్యలుంటాయి. రుణ ప్రయత్నాలు అనుకూలించవు. ఆరోగ్య విషయమై వైద్య సహాయం అవసరమవుతుంది. విద్యార్థులు కష్టపడవలసినటువంటి సమయం. ధనూ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. స్థిరాస్తి లాభం కలుగుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారపరంగా అనుకూల సమయం. బంధు మిత్రుల సహాయ సహకారాలుంటాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం సాయంకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. గణపతి స్తోత్రం పఠించాలి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలుంటాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత మెరుగైన పరిస్థితులుంటాయి. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. ముఖ్యమైన పనులలో కావలసినవారి సహాయ సహకారాలు లభిస్తాయి. కుంభ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం విఘ్నేశ్వరుని పూజించాలి. సంకట నాశన గణపతి స్తోత్రం పఠించాలి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఆకస్మిక ధన వ్యయ సూచనలున్నాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్య సమస్యలొచ్చే సూచనలున్నాయి. పనులు నిదానంగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాపరంగా అనుకూలంగా లేదు. మీన రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం రుణవిమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner