Brahmamudi March 28th Episode: కొడుకు కోసం ఊయల కొన్న రాజ్ - భర్త తప్పుకు కావ్యకు శిక్ష - రుద్రాణి టైమ్ ఆగయా!
Brahmamudi March 28th Episode: తన కొడుకు కోసం ఊయల ఆర్డర్ పెడతాడు రాజ్. ఊయలను చూసి ఇంట్లో పెద్ద రాద్దాంతం చేస్తుంది రుద్రాణి. ఆ తర్వాత నేటి బ్రహ్మముడి సీరియల్‌లో ఏం జరిగిందంటే?
Brahmamudi March 28th Episode: రాజ్ కొడుకు గుక్కపెట్టి ఏడుస్తాడు. ఆ చిన్నారిని ఎలా సముదాయించాలో తెలియక రాజ్ ఇబ్బంది పడతాడు. చివరకు కళ్యాణ్ సహాయంతో ఉగ్గు ప్యాకెట్ తీసుకొచ్చి ఆ చిన్నారికి తినిపిస్తుంది కావ్య. ఉగ్గు తిన్న చిన్నారి నిద్రపోతాడు. కావ్యకు థాంక్స్ చెబుతాడు రాజ్. మీరు థాంక్స్ చెబితే సంతోషపడే రోజులు పోయాయని కావ్య అంటుంది. నేను అడిగితే మీరు చెప్పలేరు. మీరు చెప్పేది నాకు అక్కరలేదని కావ్య అంటుంది.
ఊయల ఆర్డర్...
రాజ్ తన కొడుకు కోసం ఊయల ఆర్డర్ పెడతాడు. డెలివరీ బాయ్ ఇంటికొస్తాడు. ఈ ఊయల నువ్వే ఆర్డర్ పెట్టావా అంటూ అపర్ణను ఏడిపించాలని చూస్తుంది రుద్రాణి. అవును నిన్నే పడుకోబెట్టి ఊపుదామని ఆర్డర్ పెట్టానని కోపంగా బదులిస్తుంది అపర్ణ. ఈ ఊయల నీ మనవడి కోసం నువ్వే ఆర్డర్ పెట్టావు...కానీ మాకు చెప్పడం లేదని రుద్రాణి అంటుంది.
షటప్ అంటూ రుద్రాణిపై సీరియస్ అవుతుంది అపర్ణ. నేను నా కొడుకునే పక్కనపెట్టాను. ఇంక మనవడిని ఊయలలో ఎలా పెడతాను అంటూ కోప్పడుతుంది. మరి ఈ ఊయల ఎవరూ ఆర్డర్ పెట్టారు అంటూ పార్సిల్‌పై పేరు కోసం వెతుకుతుంటుంది రుద్రాణి. అప్పుడే అక్కడికి వచ్చిన రాజ్ ఈ ఊయలను నేనే ఆర్డర్ పెట్టానని అంటాడు.
చిన్నారికి బారసాల...
ఊయలలో చిన్నారిని వేసి బారసాల చేస్తారా? అతడికి దుగ్గిరాల సీతారామయ్య అని మా నాన్న పేరు పెడతారా అంటూ ఎగతాళి చేస్తుంది రుద్రాణి. పంచ్‌లు, ప్రాసలతో తన నోటికి పనిచెబుతూనే ఉంటుంది. ఆమె మాటల ధాటికి ఇందిరాదేవి అడ్డకట్టవేస్తుంది. ఇంకో మాట ఎక్కువ మాట్లాడితే నీకు తలంటు పోస్తా. ఆరేసరికి ఆరు నెలలు పడుతుంది అంటూ వార్నింగ్ ఇస్తుంది. రాజ్‌కు ఫోన్ వస్తుంది. మాట్లాడుతుండగా...వాడి తల్లి కావచ్చు. కొడుకు యోగక్షేమాలు కనుక్కోవడానికి అంటూ మరోసారి సెటైర్ వేస్తుంది రుద్రాణి.
రాజ్ ఇంటికి రారాజు...
హాల్‌లో ఊయల సెటప్ రెడీ చేసిన రాజ్ బాబును అందులో పడుకోబెట్టి ఫోన్ మాట్లాడటానికి బయటకు వెళతాడు. నట్టింట్లో ఈ ఊయల ఏంటి అంటూ ధాన్యలక్ష్మి చిరాకుపడుతుంది. రారాజ్ ఇంటికి రారాజు కదా అతడిని అడిగే ధైర్యం ఎవరికి లేదని రుద్రాణి మరోసారి పంచ్ వేస్తుంది.
స్వప్న ఎంట్రీ...
ఆ చిన్నారి గుక్కపెట్టి ఏడవడం మొదలుపెడతాడు. ఆ చిన్నారిని ఎత్తుకోవడానికి ఎవరూ ముందుకు రారు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన స్వప్న చిన్నారిని ఎత్తుకొని లాలిస్తుంది. చిన్నారి ఏడుస్తుంటే ఎవరూ పట్టనట్లు ఉన్నారు. ఎవరికి మానవత్వం లేదా అంటూ ఫైర్ అవుతుంది. ఆ చిన్నారి ఎవరి బిడ్డ? ఈ చిన్నారి తల్లి ఎవరు అని అందరిని స్వప్న అడుగుతుంది. తల్లి ఎవరో తెలియదు కానీ ఈ చిన్నారి మాత్రం రాజ్ కొడుకు అని స్వప్నతో అంటుంది రుద్రాణి.
రాజ్ కొడుకా..రాహుల్ కొడుకా...
నిజం చెప్పండి ఇతడు రాజ్ కొడుకా...రాహుల్ కొడుకా అంటూ స్వప్న అంటుంది. నేను అలాంటి తప్పు చేశానని నింద మాత్రమే వేశావు. ఇప్పుడు అదే పని రాజ్ చేశాడు. ఎవరినో తల్లిని చేసి కొడుకును ఇంటికి తీసుకొచ్చాడని భార్యపై ఫైర్ అవుతాడు రాహుల్. ఇలాంటి తప్పుడు పనులు నువ్వు తప్ప ప్రపంచంలో ఎవరు చేయరు. రాజ్ లాంటి జెంటిల్‌మెన్ అసలు చేయడని స్వప్న అంటుంది. మా అత్తయ్య రాజ్ క్యారెక్టర్‌పై నింద వేస్తుంటే పెద్దవాళ్లంతా ఏం చేస్తున్నారని స్వప్న అందరిని నిలదీస్తుంది. నిజం చెప్పమని అంటుంది.
స్వప్న షాక్…
అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన రాజ్...ఆ చిన్నారి నా బిడ్డేనని స్వప్నతో అంటాడు. నీ చెల్లెలికి సవతి యోగం ఉన్నట్లు ఉంది. ఆ చిన్నారి తల్లి ఎవరో ఆమెనే అడుగు అంటూ స్వప్నతో అంటుంది రుద్రాణి.
అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో చెప్పమని చెల్లెలిని నిలదీస్తుంది స్వప్న. నాకు కొడుకు ఉన్నాడని రాజ్ చెబితే ఇలా మౌనంగా ఉండటం కరెక్ట్ కాదని కావ్యతో అంటుంది స్వప్న. నేను ఉండగా మరో ఆడదానితో ఎలా సంబంధం పెట్టుకున్నావని కాలర్ పట్టుకొని రాజ్‌ను నిలదీయమని అంటుంది.
రాజ్‌పై పోలీస్ కేసు...
ఇప్పుడు ఏం చేసినా ప్రయోజనం ఉండదని స్వప్న ఆవేశాన్ని కంట్రోల్ చేయబోతుంది కావ్య. కానీ స్వప్న మాత్రం ససేమిరా వినదు. రాజ్‌పై కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్‌కు వెళదామని కావ్యతో అంటుంది స్వప్న. భార్య ఉండగా మరో ఆడదానితో సంబంధం పెట్టుకొని బిడ్డను కనడం నేరం. ఈ నేరానికి గాను రాజ్‌నుజైలుకు పంపిద్దామని స్వప్న అంటుంది. అలా చేసి తానే ఈ ఇంటి పరువు తీయాలా అని కావ్య అంటుంది. రాజ్‌ను జైలుకు పంపించడం పరిష్కారం కాదని స్వప్నకు సమాధానమిస్తుంది కావ్య.
దుగ్గిరాల ఫ్యామిలీ శిక్ష…
ఇంట్లోవాళ్లు రాజ్‌ను వెలివేసి అతడికి పెద్ద శిక్ష వేశారని, జైలుతో సమానమైన శిక్షను రాజ్ అనుభవిస్తున్నాడని స్వప్నతో అంటుంది కావ్య. అలాగని రాజ్‌ను వదిలేస్తావా అని కావ్యపై ఫైర్ అవుతుంది రాజ్. తాను చేసిన తప్పుకు రాజ్ సమాధానం చెప్పేవరకు అతడిని వదలనని కావ్య అంటుంది.
రాజ్ సమాధానం చెబుతాడని అనుకుంటున్నావా...నీకు తెలియకుండా ఓ బిడ్డను కన్న మనిషిని ఇంకా నమ్ముతున్నావా అక్కను తప్పుపడుతుంది స్వప్న. నిజం ఏమిటో బయటకు వచ్చే వరకు వేచిచూద్దామని కావ్య అంటుంది. అప్పటివరకు ఏ గొడవ చేయద్దని స్వప్నను రిక్వెస్ట్ చేస్తుంది కావ్య.
తన సమస్యకు పరిష్కారం దొరికేందుకు సాయం చేయమని వేడుకుంటుంది. కొన్నాళ్లు తాను మౌనంగా ఉంటానని, ఈ లోపు నీకు ఈ ఫ్యామిలీ ఏదైనా అన్యాయం తలపెట్టాలని చూస్తే మాత్రం ఇంట్లో వాళ్లను రోడ్డకు ఈడుస్తానని స్వప్న కోపంగా చెబుతుంది.
అప్పుకు కళ్యాణ్ ఫోన్...
అప్పుకు ఫోన్ చేస్తాడు కళ్యాణ్. అన్నయ్య చేసిన తప్పుపై కోపంగా ఉన్నా వదిన మాటకు కట్టుబడి అతడిని ఏం అనలేకపోతున్నానని కళ్యాణ్ అంటాడు. మా అక్కకు సాయంగా అక్కడికి రావాలని ఉన్నా ఏం చేయలేకపోతున్నానని అప్పు బాధపడుతుంది. వదినకు సాయంగా నేను ఉన్నానని, కావ్యకు ఏ అవసరం వచ్చినా నేను చూసుకుంటానని అప్పుకు మాటిస్తాడు కళ్యాణ్.
పోలీస్ సెలెక్షన్స్‌పై దృష్టిపెట్టమని అప్పుకు చెబుతాడు. అప్పుతో కళ్యాణ్ మాట్లాడుతుండటం చాటు నుంచి వింటుంది అనామిక. ఆమెను చూడగానే కళ్యాణ్ ఫైర్ అవుతాడు. దొంగచాటుగా వినడం మానవా అని అంటాడు.దొంగచాటుగా వినాల్సిన ఖర్చ నాకు లేదని అనామిక కోపంగా అంటుంది.
అన్నయ్య నుంచే వచ్చిన బుద్ది...
ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతున్నా నీ లవర్‌తో మాట్లాడటం మానవా అంటూ కళ్యాణ్‌తో అంటుంది అనామిక. అప్పు నా ఫ్రెండ్ మాత్రమేనని కళ్యాణ్ సమాధానమిస్తాడు. తాళికట్టిన భార్య ఉండగా మరో ఆడదానితో మాట్లాడే చీప్ బుద్దులు ఎలా వచ్చాయా అని అనుకున్నాను. కానీ మీ అన్నయ్య రాజ్ నుంచే వచ్చాయని ఇప్పుడే తెలిసిందని కళ్యాణ్‌తో వెటకారంగా మాట్లాడుతుంది అనామిక. నన్ను ఏమైనా అను. కానీ మా అన్నయ్యను అంటూ ఊరుకునేది లేదని కళ్యాణ్ కోపంగా చెబుతాడు.
నేను ఉన్నమాటే అన్నానని అనామిక అంటుంది. కావ్య ఉండగా మీ అన్నయ్య మరో అమ్మాయితో సంబంధం పెట్టుకోవడం నిజం కాదా...కొడుకును కనడం నిజం కాదా అని అంటుంది. నువ్వు మీ అన్నయ్యలా చేస్తూ చూస్తూ ఊరుకోవడానికి నేను కావ్యను కాదని అంటుంది అనామిక. నువ్వు బెదిరింపులకు భయపడి అప్పుతో మాట్లాడటం మానేయనని కళ్యాణ్ బదులిస్తాడు. నువ్వు తెలుసుకోవాల్సింది గొడవలు ఎలా పెట్టుకోవాలన్నది కాదు.
భార్య ఎలా నడుచుకోవాలో నేర్చుకుంటే బాగుంటుందని అనామికతో అంటాడు కళ్యాణ్. భార్యకు నచ్చినట్లుగా భర్త ఎలా ఉండాలో నువ్వు తెలుసుకోమని కళ్యాణ్‌తో అంటుంది అనామిక. అది నీ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు కళ్యాణ్.
రాజ్‌కు కావ్య సాయం...
తన కొడుకుకు స్నానం చేయించడం రాక రాజ్ ఇబ్బంది పడతాడు. కావ్య సాయం చేస్తానని అంటుంది. ఎవరూ చూడకుండా స్నానం చేయించడానికి గార్డెన్‌లోకి రమ్మని అంటుంది. మీరు చేసిన పాపానికి నేను కూడా శిక్షను అనుభవించాల్సివస్తుందని కావ్య ఆవేదనకు లోనవుతుంది.
కోటి రూపాయల నష్టం...
రాజ్ కారణంగా కంపెనీకి కోటి రూపాయల నష్టం వస్తుంది. రాజ్‌ను కాపాడటం కోసం ఆ నిజాన్ని ప్రకాశం దాచిపెడతాడు. అది తెలిసి ధాన్యలక్ష్మి ఇంట్లో గొడవ చేస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.