Brahmamudi March 27th Episode: బ్రహ్మముడి- అడ్డంగా బుక్కయిన కల్యాణ్- ధాన్యలక్ష్మీపై అరిచిన కావ్య- రాజ్ బిడ్డకోసం పాట్లు
Brahmamudi Serial March 27th Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 27వ తేది ఎపిసోడ్‌లో రాజ్ బిడ్డ కోసం బయటకు వెళ్లిన కావ్య, కల్యాణ్ ఇంట్లో వాళ్లందరికి అడ్డంగా దొరికిపోతారు. దాంతో కావ్యపై అపర్ణ ఫైర్ కానుందని తెలుస్తోంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రుద్రాణి, అనామిక, ధాన్యలక్ష్మీ, రాహుల్‌కు పెద్ద షాక్ ఇస్తాడు ప్రకాశం. ఆర్డర్ పెట్టిన ఫుడ్‌ను డెలీవరీ బాయ్ తీసుకొస్తాడు. కానీ, ఇంటి బయటే ఉన్న ప్రకాశంను చూసి నలుగురు దాక్కుంటారు. ఇంతలో డెలీవరీ బాయ్‌తో ఇక్కడ రాహుల్ అని ఎవరు లేరని, ఆ ఫుడ్ తననే తినమని చెప్పిన ప్రకాశం ఇంట్లోకి వెళ్తాడు. తర్వాత ఓ క్యారేజీ తీసుకొస్తాడు ప్రకాశం.
రాత్రంతా పస్తులు
అయితే, ఇంట్లో ఉన్న ఫుడ్ అయిన తిందామని, ఉదయం రోజు ఏం జరిగితే అది చూసుకుందామని రుద్రాణి అంటుంది. కానీ, ఇంట్లో ఉన్న ఫుడ్ అంతా క్యారేజీలో తీసుకొచ్చి ఫుడ్ డెలీవరీ బాయ్‌కి ఇచ్చి పెద్ద ట్విస్ట్ ఇస్తాడు ప్రకాశం. అది చూసి రుద్రాణితోపాటు అనామిక, రాహుల్, ధాన్యలక్ష్మీ ఒక్కసారిగా కంగుతింటారు. ఇలా చేశాడేంటీ అని బాధపడుతుంటారు. దాంతో ఈ నలుగురు తినకుండా రాత్రంతా పస్తులు ఉంటారు. మరోవైపు రాజ్ కొడుకు ఏడుస్తూ ఉంటాడు.
ఆశ్చర్యంగా రాజ్
రాజ్ ఎంత ఊరుకోపెట్టిన బాబు ఊరుకోడు. ఏడుస్తూనే ఉంటాడు. ఇదిగో పాలు తాగు.. పాలు తాగు.. నీ బొజ్జ నిండుద్దేమో అని రాజ్ అంటాడు. అక్కడే అదంతా చూస్తున్న కావ్య.. వాడి వయసుకి పాలు తాగితేనే బొజ్జ నిండదు అని అంటుంది. దాంతో మరి అని రాజ్ అడుగుతాడు. ఉగ్గు తినిపించాలి అని కావ్య బదులు ఇస్తుంది. ఉగ్గా.. అని ఆశ్చర్యంగా అడిగిన రాజ్.. అదెక్కడ ఉంటుందని అడుగుతాడు. మీ ఆకలి తీరిపోతే చాలదు. వాడి ఆకలి గురించి కూడా ముందే పట్టించుకోవాలి అని కావ్య అంటుంది.
కల్యాణ్ చేతిలో
ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అని రాజ్ అడుగుతాడు. దాంతో ఇప్పుడే వస్తాను అని కావ్య వెళ్లిపోతుంది. ఏయ్.. ఏయ్.. అని రాజ్ పిలుస్తుంటాడు. కానీ, కావ్య వెళ్లిపోతుంది. కట్ చేస్తే.. కావ్య, కల్యాణ్ ఇంటి బయట నుంచి వస్తారు. వాళ్లు వచ్చేటప్పుడు ఇంట్లోని వారంత హాల్లో ఎదురుచూస్తుంటారు. వాళ్లందరిని చూసి కల్యాణ్ షాక్ అవుతాడు. వారిపై అపర్ణ, అనామిక గుర్రుగా చూస్తుంటారు. కల్యాణ్ చేతిలో బాబుకు తినిపించే ఉగ్గు ప్యాకెట్ ఉంటుంది.
బాబును బాధపెట్టడం
కల్యాణ్ చేతిలో ఉన్న ఉగ్గు ప్యాకెట్ చూసిన అపర్ణ కోపంగా కల్యాణ్‌ను చూస్తూ ఉంటుంది. ఏం తెలియనట్లుగా కల్యాణ్ ఫేస్ పెడతాడు. మరోవైపు ఏడుస్తున్న బాబును రాజ్ ఓదార్చుతుంటాడు. అయితే, ఇంట్లో రాజ్‌ను, తన కొడుకుకు ఎవరు సహాయసహకారాలు అందించకూడదని అపర్ణ రూల్ పెట్టిన విషయం తెలిసిందే. కానీ, కావ్య మాత్రం అది తప్పని, మీ కొడుకు చేసిన తప్పుకు ఆ బాబును బాధపెట్టడం కరెక్ట్ కాదని ఇదివరకే చెబుతుంది.
సపోర్ట్ చేస్తుందా?
మళ్లీ ఇప్పుడు కావ్య మాత్రమే కాకుండా బాబు కోసం కల్యాణ్‌ను కూడా బయటకు తీసుకెళ్లడం, అతని సహాయం తీసుకోవడంతో కావ్యపై అపర్ణ ఫైర్ అవనుందని తెలుస్తోంది. మరోవైపు కల్యాణ్‌పై అనామిక కూడా కోపంగా చూస్తుంది. ఇలా ఇంట్లో అందరిముందు రాజ్ బిడ్డ కోసం కావ్య, కల్యాణ్ ఇంటి బయటకు వెళ్లి అడ్డంగా బుక్కయినట్లు తెలుస్తోంది. ఏంట్రా నువ్ ఎప్పటి నుంచి మొదలు పెట్టావురా ఈ పనులన్నీ. నీకు నా మాట అంటే లెక్కలేదా. మీ అన్నయ్య లాగా నువ్ కూడా నా మాట లెక్కచేయవా అని కల్యాణ్‌పై కోప్పడుతుంది అపర్ణ.
కోప్పడిన కావ్య
దాంతో విన్నావా కల్యాణ్. ఆఖరికి మీ పెద్దమ్మ కొడుకు బాగానే ఉన్నాడు, కోడలు బాగానే ఉంది. కలిసొచ్చే కాలం వచ్చి నడిచి వచ్చిన మనవడు బాగానే ఉన్నాడు. అంతా చుట్టూ చుట్టి నీ మెడకు తగిలించారు అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో ఆపండి చిన్నత్తయ్య అని కోప్పడుతుంది కావ్య. కావ్య అలా అనడంతో అంతా షాక్ అవుతారు. మరి కావ్య, కల్యాణ్ చేసిన పనికి ఇందిరాదేవి సపోర్ట్ చేస్తుందా.. తన పనికి కావ్య ఎలాంటి సంజాయిషీ ఇచ్చుకుంటుందో చూడాలి. ఇక రుద్రాణి, అనామిక, ధాన్యలక్ష్మీల సూటిపోటి మాటలు ఎలాగు ఉంటాయని తెలిసిందే.
టాపిక్