Brahmamudi March 18th Episode: బ్రహ్మముడి.. అనామిక పరువు తీసిన కల్యాణ్.. భార్యాభర్తల ఛాలెంజ్.. అమ్మమ్మ వ్రతం ప్లాన్-brahmamudi serial march 18th episode kalyan insult anamika indira devi vratham plan for raj brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi March 18th Episode: బ్రహ్మముడి.. అనామిక పరువు తీసిన కల్యాణ్.. భార్యాభర్తల ఛాలెంజ్.. అమ్మమ్మ వ్రతం ప్లాన్

Brahmamudi March 18th Episode: బ్రహ్మముడి.. అనామిక పరువు తీసిన కల్యాణ్.. భార్యాభర్తల ఛాలెంజ్.. అమ్మమ్మ వ్రతం ప్లాన్

Sanjiv Kumar HT Telugu
Apr 03, 2024 09:38 AM IST

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 18వ తేది ఎపిసోడ్‌లో అనామిక ఫ్రెండ్స్ ముందు తన పరువు తీస్తాడు కల్యాణ్. దాంతో ఇద్దరూ ఛాలెంజ్ చేసుకుంటారు. మరోవైపు రాజ్, కావ్యలను కలిపేందుకు ఇందిరాదేవి వ్రతం అనే కొత్త ప్లాన్ వేస్తుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ మార్చి 18వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ మార్చి 18వ తేది ఎపిసోడ్‌

Brahmamudi Serial March 18th Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో బెంగళూరు నుంచి అనామిక ఫ్రెండ్స్ వస్తారు. ధాన్యలక్ష్మీని అనామిక పరిచయం చేస్తే.. అపర్ణ గురించి కావ్య గొప్పగా చెబుతుంది. తనే ఇంటి పెద్ద దిక్కు. ఇంట్లో ఏం జరిగినా తన నిర్ణయంతోనే జరుగుతుంది. మా అత్తయ్య. నేను పెద్ద కోడలిని అని కావ్య అంటుంది. ఇంతలో ఎంట్రీ ఇచ్చిన రుద్రాణి.. ఇన్నాళ్లు మా వదినా చెప్పినట్లు వినేవాళ్లం. ఇప్పుడు తను చెప్పినట్లు వింటున్నాం అని అంటుంది.

ఎక్కడ దాచిపెట్టావ్

ఇంత వెటకారంగా అంటున్నారంటే మీరు కచ్చితంగా ఈ ఇంటి ఆడపడుచు అని అనామిక ఫ్రెండ్స్ అంటారు. అవును, కరెక్ట్‌గా చెప్పారు అని కావ్య అంటుంది. ఈ కావ్య నా పరువు తీసేలా ఉంది అత్తయ్య అని అనామిక అంటే.. వెళ్లి కాఫీలు తీసుకొస్తావా అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో కావ్య కాఫీలు తీసుకొస్తుంది. మీ ఆయన ఎక్కడ. దాచిపెట్టావా అని అనామికను అడుగుతారు తన ఫ్రెండ్స్. బిజినెస్ మొత్తం ఆయనే చూసుకుంటారు కదే. అందుకే బిజీగా ఉన్నారు అని అనామిక చెబుతుంది.

అనామిక మాటలు ఇంట్లో వాళ్లంతా ఆశ్చర్యంగా చూస్తారు. భార్య ఫ్రెండ్స్‌ను కలవనంతా బిజీనా అని వాళ్లు అంటే.. అవును, 23 బ్రాంచ్‌లు కదా అన్ని ఒక్కడే చూసుకుంటాడు. అందుకే అంత బిజీ అని అనామిక అంటుంది. అవును అవును అని ధాన్యలక్ష్మీ అంటుంది. మరి కావ్య వాళ్ల భర్త ఏం చేస్తారు అని అనామిక ఫ్రెండ్స్ అడుగుతారు. ఆయన కూడా చేస్తారు. కానీ, మా వారికి హెల్ప్ చేస్తారు అని అనామిక అంటుంది. దాంతో అపర్ణ, కావ్య, ఇందిరాదేవి షాక్ అవుతుంది.

ప్రేమగా చూసుకుంటాడు

ఏంటీ హెల్ప్ చేస్తాడా.. ఇది రాజ్ వింటే నిన్ను పాతేస్తాడు అని రుద్రాణి మనసులో అనుకుంటుంది. రోజు నాలుగైదు మీటింగ్స్‌ చేస్తుంటారు. కేవలం నాలుగు గంటలే నిద్రపోతారు. ఎంత బిజీగా ఉన్న నాకు ఇచ్చే టైమ్ నాకు ఇస్తారు. నాతో గడుపుతారు. చాలా ప్రేమగా చూసుకుంటారు అని అనామిక అంటుంది. నువ్ చాలా లక్కీనే అని ఫ్రెండ్స్ అంటారు. అవును, చాలా ప్రేమగా చూసుకుంటాడు. అసలు నిజం తెలిస్తే ఉంటుంది అని రుద్రాణి మనసులో అనుకుంటుండగా.. కల్యాణ్ వస్తాడు.

కల్యాణ్ రావడంతో అనామిక టెన్షన్ పడుతుంది. తర్వాత ఇతనే నా హస్బండ్ అని పరిచయం చేస్తుంది. మీరు చాలా గ్రేట్ అండి. కంపెనీ మొత్తం చూసుకుంటూ ఇంత సింపుల్‌గా ఉన్నారు. అంతేకాకుండా భార్యకు టైమ్ ఇచ్చి ప్రేమగా చూసుకుంటున్నారు. అలా ఎవరికీ సాధ్యం కాదు అని అనామిక ఫ్రెండ్స్ అంటారు. చూడండి.. నేను ఏ కంపెనీని చూసుకోవట్లేదు. మీకు చెప్పినట్లుగా మాకు కంపెనీలు ఉన్నమాట నిజమే. కానీ, వాటన్నింటిని మా అన్నయ్య రాజే చూసుకుంటాడు అని కల్యాణ్ చెబుతాడు.

నీ అదృష్టం అనామిక

మరి అనామిక అలా ఎందుకు చెప్పింది అని ఫ్రెండ్స్ షాక్‌తో అడుగుతారు. నేను ఒక రైటర్‌ను. గొప్పగా చెప్పుకునేందుకు నేను ఇంకా ఏం సాధించలేదు. మీ ముందు నామోషీగా ఉంటుందని అలా చెప్పింది అంతే అని వెళ్లిపోతాడు కల్యాణ్. ఏంటిది అనామిక. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంది. మేము నీ ఫ్రెండ్స్. అబద్ధాలు చెబితేనే విలువ ఇస్తామని ఎలా అనుకున్నాం. మీ ఆయన చాలా నిజాయితీపరుడు. అలాంటి వాడు భర్తగా దొరకడం నీ అదృష్టం అని అనామిక ఫ్రెండ్స్ చెబుతారు.

పెళ్లయ్యాకా నువ్ మారావు అనుకున్నాం. కానీ, కాలేజ్‌లో ఉన్న అనామికలానే ఉన్నావు. నీకు మంచి ఫ్యామిలీ దొరికింది. ఇప్పటికైనా మారు. నిన్ను హర్ట్ చేసి ఉంటే సారీ అని ఫ్లైట్‌కు టైమ్ అవుతుందని వెళ్లిపోతారు అనామిక ఫ్రెండ్స్. నిమిషం పరిచయంలోనే కల్యాణ్ గురించి నీ ఫ్రెండ్స్ అర్థం చేసుకున్నారు. కానీ, నీకు మాత్రం ఇంకా అర్థం కావట్లేదు అని అపర్ణ అంటుంది. మీ కొడుకు లాగా నా భర్త కంపెనీస్ చూసుకుంటే నేను కూడా గొప్పగా చెప్పుకునేదాన్ని. ఇలా అబద్ధాలు ఎందుకు చెబుతాను అని వెళ్లిపోతుంది అనామిక.

నాకు టైమ్ పడుతుంది

ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉందా అని కల్యాణ‌్‌ను అనామిక అడుగుతుంది. నాకు కాదు. నీకు ఉంటుంది. ఇంకెప్పుడు అబద్ధం ఎలా చెప్పాలా అనే టెన్షన్ ఉండదు అని కల్యాణ్ అంటాడు. చాలు ఆపు.. తన ఫ్రెండ్స్ ముందు పరువు తీసి కవితలు చెబుతున్నావా అని ధాన్యలక్ష్మీ అంటుంది. కవితల్లోనే నిజాలు ఉంటాయి అని కల్యాణ్ అంటాడు. అవి నాకు వద్దు అని అనామిక అంటుంది. తాతయ్యకు ఇంతా ఆస్తి సంపాదించడానికి జీవితకాలం పట్టింది. నాకు కూడా టైమ్ పడుతుంది అని కల్యాణ్ అంటాడు.

వారం రోజుల్లో ఒక్క అవకాశం తెచ్చుకో అని అనామిక ఛాలెంజ్ చేస్తుంది. దాంతో తెచ్చుకుంటాను అని కల్యాణ్ అంటే.. తెచ్చుకోకపోతే.. తర్వాత నేను ఏం చెబితే అది చేయాలి అని అనామిక అంటుంది. దానికి సరే. నువ్ ఏం చెబితే అది వింటాను అని కల్యాణ్ అంటాడు. అత్తయ్య మీరే సాక్ష్యం అని చెప్పేసి వెళ్లిపోతుంది అనామిక. ఏంట్రా ఇది అని ధాన్యలక్ష్మీ అడిగితే.. ప్రేమను ప్రూవ్ చేసుకోమ్మంది చేసుకున్నాను. ఇప్పుడు టాలెంట్ ప్రూవ్ చేసుకోమ్మంటుంది. చేసుకుంటాను అని వెళ్లిపోతాడు కల్యాణ్.

వీళ్లు విడిపోరు

తర్వాత రాత్రి కావ్య పరధ్యానంగా ఉంటుంది. ఇంతలో రాజ్ వస్తాడు. అది చూసిన ఇందిరాదేవి అందరూ ఇక్కడే ఉన్నారు. నీ కొడుకు చేసిన నిర్వాకం గురించి చెప్పాలి అని అంటుంది. నేను ఏం చేశాను అని రాజ్ అంటాడు. రాజ్ పెళ్లి చేసుకుని రేపటికి ఏడాది అవుతుంది అని ఇందిరాదేవి అంటుంది. నాకు ఇష్టం లేని వ్యక్తిని సంవత్సరం భరించానా. వీళ్లు విడిపోరు. నేను కలిసిపోను. ధాన్యలక్ష్మీ మీద కోపంతో ఇంకా కోడలి హోదా కట్టబెట్టాను అని అపర్ణ బాధపడుతుంది.

తర్వాత కావ్య గొప్పదనం గురించి, ప్రత్యేకతల గురించి చెప్పిన ఇందిరాదేవి యానివర్సరీ గ్రాండ్‌గా చెద్దామని చెబుతుంది. రాజ్ పెళ్లి అపర్ణ లేదు. ఇప్పుడు వీళ్లను చూసి సంతోషిస్తుందని సుభాష్ అంటాడు. అపర్ణకు ఇష్టం లేదని ధాన్యలక్ష్మీ అంటే.. నేను లేదని చెప్పానా.. నాకు ఇష్టమే. నా కొడుకు సంతోషానికి కావాల్సినదానికంటే నాకు ఏముండదు. చాలా ఘనంగా చేద్దాం అని అపర్ణ అంటుంది. దాంతో అంతా ఫిక్స్ అయిపోతారు.

పుట్టింటి వాళ్లు కూడా

మీరు గ్రాండ్‌గా చేయండి. నాకు ఏ అభ్యంతరం లేదు. కానీ నేను కూడా మీకు నా జీవితానికి సంబంధించిన ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేంటనేది మీ అందరి సమక్షంలోనే బయటపెడదామనుకుంటున్నాను. జీవితంలో తీసుకునే ముఖ్యమైన నిర్ణయం. ఎవరు ఆమోదించినా ఆమోదించకపోయిన ఆ నిర్ణయం మార్చుకోను అని రాజ్ అంటే.. అది రేపే ఎందుకు చెప్పాలి అని ఇందిరాదేవి అంటుంది. రుద్రాణి కూడా అదే అంటుంది. కానీ, కళావతి వాళ్ల పుట్టింటి వాళ్లు కూడా ఉండాలి అని రాజ్ అంటాడు.

దాంతో అంతా కాస్తా టెన్షన్ పడుతారు. కావ్య తల్లిదండ్రులు మాత్రం కచ్చితంగా ఉండాలి. ఈ విషయం అందరికీ ఒకేసారి తెలియాలి. గుడ్ నైట్ అని చెప్పేసి వెళ్లిపోతాడు రాజ్. కావ్య, ఇందిరాదేవి షాక్ అవుతారు. విడాకుల గురించే అంటున్నారా అని కావ్య అనుకుంటుంది. ఏంటిది.. కావ్యపై రాజ్‌కు ఇష్టం లేదా. నేను అనుకుంది ఇలా తప్పు అయిందా ఏంటీ అని ఇందిరాదేవి టెన్షన్ పడుతుంది. తర్వాత రాత్రి పడుకున్న రాజ్‌ను లేపి విడాకుల గురించి ఏం చేశారని అడుగుతుంది.

నాకైనా చెప్పు

రేపు చెబుతానని అన్నాను కదా అని రాజ్ అంటే.. నేను మీ భార్యను నాకు ఇప్పుడే చెప్పాలి అని కావ్య అంటుంది. ఏది ఏమైనా రేపే చెబుతాను. పొద్దునే చెప్పేది ఉంటే అప్పుడే చెప్పేవాన్ని కదా. అందరికీ తలియాలి అన్నావ్ కదా అని రాజ్ ఫైర్ అయి పడుకోమ్మంటాడు. తర్వాత రాజ్ అంతరాత్మ కూడా వచ్చి నీ మనసులో ఏముందో నాకే అర్థం కావట్లేదు. కళావతి పరిస్థితి ఏంటో. నాకైనా చెప్పు అని అంతరాత్మ అంటాడు. నీకు కూడా రేపే చెబుతాను అని రాజ్ అంటాడు. నా టైమ్ వచ్చినప్పుడు నీ సంగతి చూస్తారా అని రాజ్ అంతరాత్మ అనుకుంటాడు.

మరుసటి రోజు కావ్యతో ఇందిరాదేవి మాట్లాడుతుంది. ఏమైనా చెప్పాడా అంటే లేదని కావ్య చెబుతుంది. వాడు రివర్స్ అయ్యేలా ఉన్నాడు. అందుకే ఓ ప్లాన్ వేశాను. ఇవాళ దాంపత్య పూజా చేయిస్తాను. ఇందులో జీవితాంతం నీతోనే ఉండాలని రాజ్ ప్రామిస్ చేయాలి. అలా చేస్తే రాజ్ నీవాడే. లేకుంటే వాడి మనసులో ఇంకేదో ఉందని తెలిసిపోతుంది అని ఇందిరాదేవి అంటుంది. ఈ ఐడియా బాగుందని కావ్య అంటుంది. తర్వాత ఆ వ్రతం గురించి ఇంట్లో అందరికీ చెబుతుంది ఇందిరాదేవి. దానికి అంతా ఓకే అంటారు.

కోడలిగా అంగీకరించలేదు

కానీ, సాయంత్రం ఫంక్షన్ ఉంది. ఇప్పుడు వ్రతం అంటే కష్టం అవుతుంది అని అపర్ణ అంటుంది. చూశావా రుద్రాణి.. నేను అంటే లేస్తుంది. కానీ వ్రతం అనేసరికి వద్దంటుంది. రాత్రి ఏదో ఒప్పుకుంది కానీ, ఇప్పుడు ఇష్టం లేదు అని ధాన్యలక్ష్మీ అంటుంది. మా వదినకు వాళ్లతో వ్రతం చేయించడం ఇష్టం లేదు. పెళ్లయినప్పుడు తనకోసం చేయించిన నగలు తీసుకుంది. ఇప్పటివరకు ఇవ్వలేదు. కోడలిగా అంగీకరిస్తే.. ఒక్క పట్టుచీర అయిన కొని ఇవ్వాలి. అది కూడా చేయలేదు అని రుద్రాణి అంటుంది.

కావ్యకు నగలు అంటే ఇష్టం లేదు కాబట్టి చేయించలేదేమో అని ఇందిరాదేవి కవర్ చేస్తుంది. అది కాదు అత్తయ్య.. కావ్యకు ఇష్టం లేదన్నది విషయం కాదు. అక్క ఎందుకు చేయించలేదన్ని మ్యాటర్. నేను నా కోడలికి చేయించిన నగలు ఇవ్వలేదా అని ధాన్యలక్ష్మీ అంటుంది. తర్వాతి ఎపిసోడ్‌లో రాజ్, కావ్య వ్రతంలో కూర్చుని పూజా చేస్తుంటారు. ఇప్పుడు జీవితాంతం కలిసే ఉంటామని ప్రమాణం చేయండి అని పంతులు చెబుతాడు. దాంతో అగ్నిపై కావ్య చేయి పెడుతుంది. షాక్ అయిన రాజ్ చేయి కాస్తా కదుపుతాడు.

Whats_app_banner