Brahmamudi Serial: బ్రహ్మముడి సీరియల్.. వారసత్వం, రక్త సంబంధం వదులేసుకున్న రాజ్.. అనాధలా కొడుకు, కావ్యకు విడాకులు
Brahmamudi Serial Latest Episode: బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్‌లో రాజ్‌ను తన బిడ్డను తన తల్లి దగ్గరే వదిలేసి రావాలని అపర్ణ చెబుతుంది. కానీ రాజ్ అలా చేయడు. దాంతో ఇంట్లో వారసత్వం, రక్త సంబంధం ఉండదని తెగేసి చెబుతుంది అపర్ణ. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
Brahma Mudi Serial: బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఆపద వస్తే ఆదుకునే మనిషి, ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఇన్నాళ్లు కుటుంబం కోసం నన్ను భరించిన మనిషి ఇలా చేశాడంటే నమ్మలేను అమ్మమ్మ. ఆయనే చెప్పినంత మాత్రాన నిజం అయిపోదు కదా అని కావ్య అంటుంది. అలా అని అబద్ధం కూడా కాదని కాదు కదా. నిలువెత్తు సాక్ష్యం కనిపిస్తుంటే నువ్ ఇంకా ఎలా నమ్మగలుగుతున్నావ్ కావ్య. నువ్ ఇలా సర్దుకుపోతుంటే నాకే బాధగా ఉంది కావ్య అని ఇందిరాదేవి అంటుంది.
అపర్ణ ఫైర్
లేదు అమ్మమ్మ. నాకు తను చెప్పేది నమ్మేలా లేదు. నా సంకల్పం బలమైంది అయితే ఆ దేవుడు కూడా నావైపు తిరుగుతాడు. నా నిర్ణయం బలమైంది అయితే రాసిన నా తలరాత కూడా మారుతుంది అని కావ్య అంటుంది. దాంతో కావ్యను ప్రేమగా హగ్ చేసుకుంటుంది ఇందిరాదేవి. దేవుడా కావ్య సంకల్పం నిజం అయ్యేలా చేయు అని ఇందిరాదేవి మనసులో కోరుకుంటుంది. మరోవైపు రాజ్ చేసిన పనికి అపర్ణ ఫైర్ అవుతుంది.
వాడిని ఎంతో నమ్మాను. ఇలా చేస్తాడనుకోలేదు. తప్పు చేసినవాళ్లను తప్పుబడుతుంటే నా కొడుకు అంతటి వాడు లేడని, వాడిని చూసి నేర్చుకోవాలని నలుగురికి చెప్పేదాన్ని. ఇప్పుడు పరువు అంతా తీసినట్లు అయింది. ఒక్క విషయం కూడా దాచని వాడు ఇన్నాళ్లుగా ఇంత పెద్ద విషయం ఎలా దాచాడు. భార్య నచ్చకుంటే గొడవ పడాలి. లేదా విడాకులు తీసుకోవాలి. కానీ ఇదేంటి. వాడి కోసం నా స్థాయి కాకపోయినా ఆ కనకంతో గొడవ పెట్టుకున్నాను. వాడి సంతోషం గురించే ఆలోచించాను అని సుభాష్‌తో ఫైర్ అవుతూ అంటుంది అపర్ణ.
షర్ట్ మార్చుకోండి
మరోవైపు రాజ్ గదిలోకి కావ్య వస్తుంది. రాత్రి మధ్యలో బాబు పాస్ పోస్తాడు. షర్ట్ అంతా పాడు చేశావ్ కదరా అని రాజ్ అంటాడు. పక్కనే ఉన్నా కావ్యను ఏం చేయాలో చెప్పొచ్చు కదా అంటాడు. నాకేం తెలుసు. నేను ఏమైనా పది మందిని కన్నానా. అయినా బాబును తీసుకొచ్చేటప్పుడు ఇలాంటివి జరుగుతాయని తెలియదా. ముందు మీరు షర్ట్ మార్చుకోండి. తర్వాత వాడికి డైపర్ మార్చండి అని కావ్య అంటుంది. డైపర్స్ లేవే అని రాజ్ అంటాడు.
పంచెలు కట్టండి అని కావ్య అంటే.. పెద్దవి అయితాయేమో అని రాజ్ అంటాడు. ముక్కలు చేస్తే చిన్నవిగా అవుతాయ్. వాటిని ముక్కులో దూర్చుకోండి స్మెల్ రాకుండా అని కావ్య అంటుంది. ఏంటీ వెటకారమా అని రాజ్ అంటే.. మరి మమకారామ.. ఎవరికో పుట్టిన బాబుని తీసుకొచ్చి నా పక్కన పడుకోబెట్టి.. వాడు పాస్ పోస్తే ఏం చేయాలని నన్ను అడుగుతున్నారా. వాడి తల్లిని కూడా తీసుకురావాల్సింది. అసలు మీ అంత ధైర్యం ఎవరికీ ఉంటుంది అని కావ్య అంటుంది.
సైలెంట్‌గా పని
తర్వాత పంచెను కట్ చేసి చేశానని రాజ్ చెబితే ఏంటీ నా గుండెనా అని కావ్య అంటుంది. కాదు పంచెను అని రాజ్ అంటాడు. దాన్ని బాబుకి డైపర్‌గా కట్టిండి అని కావ్య అంటుంది. రాజ్‌కు సరిగ్గా కట్టరాకపోయేసరికి.. ముడ్డికి డైపర్ కట్టరాదు గానీ బిడ్డను కని ఇంటికి తీసుకొచ్చేస్తారు అని కావ్య కోపంగా అంటుంది. మరుసటి రోజు కావ్య సైలెంట్‌గా పని చేసుకుంటుంటే ఏంటీ ఇల్లు పీకి పందిరేస్తుంది అనుకుంటే సైలెంట్‌గా పని చేసుకుంటుందని అనామిక అంటుంది.
రుద్రాణి వస్తుంది. బెడ్ రూమ్‌లో పెద్ద వార్ నడిచి ఉంటుంది. ఇక్కడ బెట్టు చేస్తుంది అని రుద్రాణి అంటుంది. కావ్యకు ఉన్న పొగరుకు బెట్టు చేయకూడదే. గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్తుంది అనుకున్నా అని అనామిక అంటుంది. ఆ మాటలు కావ్య వింటుంది. ఇంతలో అపర్ణ వస్తే.. ఏవేవో మాటలు అంటూ పరువు తీస్తారు రుద్రాణి, ధాన్యలక్ష్మీ. ఇంతలో బాబు ఏడుపు వినిపిస్తుంది. ఆహా ఎంత బాగుంది. రాజ్‌కు బాబును హ్యాండిల్ చేయడం రాదేమో అని రుద్రాణి అంటుంది.
పరువు గోవిందా
ఇన్నాళ్లు తెలియకుండా చేసిన రాజ్‌కు బాబును చూసుకోవడం తెలిసే ఉంటుందిలే అని ధాన్యలక్ష్మీ అంటుంది. వదిన కంటే ఎక్కువగా ఎవరికీ తెలుస్తుంది. ఇంట్లో అందరిని చేతులతో పెంచింది కదా అని రుద్రాణి అంటుంది. నీ కొడుకును కూడా అలాగే పెంచాను. అందుకేనా ఇలా మాట్లాడుతున్నావ్ అని అపర్ణ అంటుంది. మరోవైపు ఏడుపు బాగా వినిపించడంతో ఆయన ఇంకా లేవలేదా ఏంటీ అని కావ్య పైకి వెళ్తుంది. ఇలా అయితే ఇంటి పరువు గోవిందా అని రుద్రాణి అంటుంది.
చాలు ఆపు అని ఇందిరాదేవి వారిస్తుంది. నేను అన్నదాంట్లో తప్పేముంది. నిజమే కదా అన్నాను అని రుద్రాణి అంటుంది. కళావతి ఎవరో ఏడుస్తున్నారు చూడు అని రాజ్ అంటే.. కళ్లు తెరిచి చూడండి. కన్న కొడుకుని మర్చిపోయే తండ్రిని ఇప్పుడే చూస్తున్నాను అని కావ్య అంటుంది. దాంతో రాజ్ లేచి బాబును తీసుకుని ఎందుకు ఏడుస్తున్నావ్. వాకింగ్ వెళ్దామా అని ఏదేదో అంటాడు రాజ్. దాంతో కావ్య సెటైర్లు వేస్తుంది. వాడికి ఆకలి వేస్తుంది. వాడి భాషలో అదే చెబుతున్నాడు. పెంపకం తెలియదు కానీ, కనేసి పిల్లలను తీసుకొస్తారు అని కావ్య అంటుంది.
కావాలంటే డబ్బు ఇచ్చేయ్
దాంతో హాల్లోకి వెళ్తాడు రాజ్. బాబుతో వచ్చిన రాజ్‌ను చూసి ఆశ్చర్యపోతారు అంతా. రాజ్ బయటకు వెళ్తుంటే.. నువ్ అడుగు బయట పెడితే.. నీకంటే ముందే పరువు వీధిపాలు అవుతుంది. కాబట్టి బయటకి వెళ్లిన నా కొడుకు తన కొడుకుని వదిలేసి నా కొడుకు మాత్రమే రావాలి. వాడిని వాడి తల్లి దగ్గరే వదిలేసి రా. కావాలంటే వాడికి జీవన భృతికి ఎంత డబ్బు కావాలంటే అంతా ఇచ్చిరా అని అపర్ణ అంటుంది. లేదు. ఈ బాల్యాన్ని నేను చిదిమేసి.. వీడిని తండ్రిలేని వాన్ని చేయలేను అని రాజ్ అంటాడు.
రాజ్ తెగేదాకా లాగకు. ఎప్పుడు సపోర్ట్ చేసే మావయ్య, అత్తయ్య కూడా మాట్లాడట్లేదంటే అర్థం చేసుకో. వదిలేసి రా. మళ్లీ ఇంట్లో ప్రశాంతతను తీసుకురా అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఎవరేం చెప్పినా నా నిర్ణయంలో మార్పు లేదు. వీడిని విడిచిపెట్టను అని రాజ్ అంటాడు. అదే నీ నిర్ణయం అయితే.. ఈరోజు నుంచి ఈ ఇంట్లో నిన్ను కానీ, నీ బిడ్డను కానీ వంశ వారసులుగా గుర్తించరు. ఈ ఇంటి సభ్యుల్లో నీకు నీ బిడ్డకు సహాయం, సహాకారం అందించరు అని అపర్ణ అంటుంది.
ఎమోషనల్ సీన్
నా ఇంట్లో నా కొడుకు ఒక అతిథిలాగే ఉంటాడు. వాడి కొడుకు అనాథలాగే ఉంటుంది. ఏ రక్తబంధం, ఏ ప్రేమ పాశం వాన్ని, వాడి కొడుకుని ఈ కుటుంబంలో కలుపుకోడానికి నేను అంగీకరించను అని అపర్ణ తెగేసి చెబుతుంది. దాంతో సుభాష్ అలా చేయకు రాజ్. రక్త సంబంధాన్ని దూరం చేసుకోకు. మీ అమ్మ ప్రశాంతంగా బతకలేదు. ఇంత వ్యతిరేకతో ఈ బిడ్డ కోసం నీ ఉనికిని పొగొట్టుకోకురా. మీ అమ్మ చెప్పినట్లు గుట్టుచప్పుడు కాకుండా డబ్బిచ్చి వదిలించుకుందాం అని సుభాష్ అంటాడు.
ఏంటీ నాన్న.. ఇంత గొప్పింట్లో.. ఒక అతిథికి, ఒక అనాథకు ఆ మాత్రం అన్నం పెట్టలేరా అని రాజ్ అంటాడు. ఈ సీన్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. తర్వాత రాజ్ వెళ్లిపోతాడు. అంటే రాజ్ రక్త సంబంధం, వారసత్వం వదులుకున్నట్లు తెలుస్తోంది. రాజ్ కిచెన్‌లో పాలకోసం తంటాలు పడుతుంటాడు. వేడి పాలు పట్టబోతుంటే.. చాలు ఆపండి. అవి ఎలా తాగుతాడు. మీరు వెళ్లండి నేను తీసుకొస్తాను అని కావ్య అంటుంది. మరి అమ్మా అని రాజ్ అంటే.. మీ అమ్మ కూడా ఒక అమ్మే కదా అని కావ్య అంటుంది.
ఏం నిరూపిద్దామని
తర్వాత కావ్య పాలు తీసుకెళ్తుంది. అది చూసి రుద్రాణి.. వావ్ కావ్య.. ఇందాకే వదిన చెప్పింది అని అపర్ణ చెప్పిన మాటలు గుర్తు చేస్తుంది రుద్రాణి. ఇదంతా తాను ఇంట్లో కోడలిగా తన స్థానం నిలుపుకునేందుకే అని రుద్రాణి, అనామిక, ధాన్యలక్ష్మీ సూటిపోటి మాటలు అంటుంటారు. దానికి మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదని కావ్య అంటే.. నాకు ఉంది అని అపర్ణ ఎంట్రీ ఇస్తుంది. ఏం ప్రూవ్ చేద్దామని ఇలా చేస్తున్నావ్ అని అపర్ణ అడుగుతుంది.
మీరు చేస్తుంది తప్పు అని నిరూపించేందుకే అని కావ్య అంటుంది. ఏంటా తప్పు అని అపర్ణ అంటుంది. తప్పు చేసింది మీ కొడుకు. శిక్ష పడాల్సింది అనుభవించాల్సింది మీ కొడుకు. కానీ, మధ్యలో నలిగిపోతుంది ఎవరు ఆ పసివాడు. డబ్బు ఇచ్చి వాడిని వదిలించుకోమని చెప్పారు. డబ్బు పడేస్తే.. చేసిన తప్పు పోతుందా. డబ్బుతో నిజాన్ని పాతిపెట్టలేరు. మీ కొడుకు చేసినదానికి ఆ పసివాడు ఏం చేశాడు. ఇలా చేస్తే నిజం ఎప్పుడు బయటకు వస్తుంది. శిక్ష పడాల్సింది మీ కొడుకు అని కావ్య అంటుంది. నిజమే అన్నట్లుగా అపర్ణ ఉండిపోతుంది.
జవాబు రాదు
తర్వాతి ఎపిసోడ్‍లో బాబుకు పాలు తీసుకొచ్చి ఇస్తుంది కావ్య. బాబుకు రాజ్ పాలు పడుతాడు. థ్యాంక్స్ అని రాజ్ అంటాడు. నేను అడగాల్సినవి చాలా ఉన్నాయి అని కావ్య అంటే.. నువ్ ఆశించే జవాబు నా నుంచి రాదు అని రాజ్ అంటాడు. నా మనసు ముక్కలైపోయి నిల్చున్నాను అని కావ్య అంటుంది. ఇక నుంచి నువ్ బాధ పడాల్సిన అవసరం లేదు అని చెప్పిన రాజ్ కావ్య సైన్ చేసి ఇచ్చిన విడాకులపై సంతకం పెట్టి ఇస్తాడు. అంటే కావ్యకు రాజ్ విడాకులు ఇచ్చేస్తాడు.