Brahmamudi March 25th Episode: బ్రహ్మముడి- అపర్ణకు ఎదురు తిరిగిన కావ్య- అనామికపై ధాన్యలక్షి ఆగ్రహం- మరో కన్నింగ్ ప్లాన్-brahmamudi serial march 25th episode raj gave divorce to kavya dhanya lakshmi angry on anamaika brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Brahmamudi Serial March 25th Episode Raj Gave Divorce To Kavya Dhanya Lakshmi Angry On Anamaika Brahmamudi Today Episode

Brahmamudi March 25th Episode: బ్రహ్మముడి- అపర్ణకు ఎదురు తిరిగిన కావ్య- అనామికపై ధాన్యలక్షి ఆగ్రహం- మరో కన్నింగ్ ప్లాన్

Sanjiv Kumar HT Telugu
Mar 25, 2024 07:26 AM IST

Brahmamudi Serial March 25th Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 25వ తేది ఎపిసోడ్‌లో ఇక నిన్ను ఉండమనే హక్కు తనకు లేదంటూ స్వేచ్ఛగా బతుకు అంటూ కావ్యకు రాజ్ విడాకులపై పేపర్స్‌పై సంతకం చేసి ఇస్తాడు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ మార్చి 25వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ మార్చి 25వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో తన కొడుకు రాజ్ విషయంలో అపర్ణ చేసింది తప్పు అని కావ్య చెబుతుంది. తప్పు చేస్తే సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోలేని తప్పు చేస్తే శిక్ష పడాలి. అంతే కానీ ఆ నిజాన్ని డబ్బుతో పాతి పెట్టాలని చూడకూడదు. మీరు అన్నట్లు నాకు డబ్బుపై ఆశే ఉంటే ఈపాటికీ నేను చాలా సంపాదించుకునేదాన్ని. నాకు కావాల్సింది నా కాళ్ల దగ్గరికి తెచ్చుకునేదాన్ని అని ధాన్యలక్ష్మీ, రుద్రాణి, అనామిక, అపర్ణ అన్న మాటలకు సమాధానంగా మాట్లాడుతుంది.

చూస్తూ ఉండలేను

నాకు డబ్బుపై కానీ, ఆస్తులపై కానీ ఎలాంటి ఆశ లేదు. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది పోయిన పరువు గురించి, అంటున్న మాటల గురించి కాదు. మీ కొడుకు గురించి. మీ కొడుకు చేసిన పనిని ఎలా పరిష్కరించాలో ఆలోచించండి. అంతేగానీ మధ్యలో ఆ పసివాన్ని బాధ పెట్టడం కాదు. ఆ పసివాన్ని బాధ పెడితే నేను చూస్తూ ఊరుకోలేను. ప్రాణం పోయినా నేను అలా చూస్తూ ఉండలేను. అందుకే మీరు చేస్తుంది తప్పు అని చెబుతున్నాను. ఇందులో మీరే కాదు.. ఆ దేవుడు వచ్చిన ఎదురిస్తాను అని కావ్య అంటుంది.

ఇంతలో ఇందిరాదేవి చప్పట్లు కొడుతూ ఎంట్రీ ఇస్తుంది. శభాష్ కావ్య.. నా మనవరాలు అని నిరూపించావ్ అని ఇందిరాదేవి అంటుంది. అంటే అపర్ణ వదినా చేసింది తప్పు అని నువ్ కూడా అంటున్నావా అమ్మ అని రుద్రాణి అంటుంది. కాదు.. ఆ పసివాడిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు అంటున్నాను. కావ్య చెప్పింది కరెక్ట్ అంటున్నాను. ఇలా పెద్దింట్లోనో, గొప్ప కుటుంబంలోనో పుడితేనో కాదు.. గొప్ప ఆలోచనలు రావు. అందుకు గొప్ప మనసు ఉండాలి అని ఇందిరాదేవి అంటుంది.

వారసుడు వచ్చిన విశేషం

మీరు అన్నది నిజమే.. కావ్య స్థానంలో మరో ఆడది ఉండుంటే గొడవ పెట్టేది. కానీ కావ్యల గొప్పగా ఆలోచించడం ఎవరికీ రాదు. తన భర్త విషయంలో తాను ఎంత గొప్పగా ఆలోచించిందో నాకు తెలుసు. అది మీకు ఈ జన్మలో అర్థం కాదు. నువ్ వెళ్లు కావ్య. నువ్ ఏం చేసిన నీకు నేను తోడుగా ఉంటాను అని ఇందిరాదేవి వెళ్లిపోతుంది. కావ్య కూడా పైకి వెళ్లిపోతుంది. వారసుడు వచ్చిన వేళా విశేషం నీ మాట నిలబడలేకపోయింది. ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు ముందు ఇంకెలా ఉంటుందో అని రుద్రాణి పుల్లలు పెడుతుంది.

అపర్ణ కోపంగా చూడటంతో సైలెంట్‌గా వెళ్లిపోతుంది రుద్రాణి. అనంతరం బాబుకు పాలు పట్టమని రాజ్‌కు పాలు ఇస్తుంది కావ్య. రాజ్ బాబుకు పాలు పడుతుంటాడు. కావ్య వెళ్లిపోతుంటే.. థ్యాంక్స్ అని రాజ్ చెబుతాడు. నాకెందుకు థ్యాంక్స్ అని కావ్య అంటుంది. నీ ఔదార్యానికి అని రాజ్ అంటే.. మీ థ్యాంక్స్ వల్ల నాకు ఒరిగిదేంటీ అని కావ్య అంటుంది. అది నా బాధ్యత అని రాజ్ అంటే.. అది పక్కన పెట్టుకున్నారు కదా అని కావ్య అంటుంది.

ఆశించిన జవాబు రాదు

నువ్ పంచుకున్నావ్ కదా అని రాజ్ అంటే.. పంచుకున్నాను కదా అని పెంచుకోలేను అని కావ్య అంటుంది. అలా నేను అడగలేను అని రాజ్ అంటే.. కానీ, నేను అడగాల్సినవి చాలా ఉన్నాయని కావ్య అంటుంది. ఆ ప్రశ్నలన్నీ నీ కళ్లలో కనిపిస్తూనే ఉన్నాయని రాజ్ అంటాడు. వాటికి జవాబు చెప్పాల్సిన బాధ్యత మీదే అని కావ్య అంటుంది. ఆ ప్రశ్నలకు నువ్ ఆశించిన జవాబు రాదు అని రాజ్ అంటే.. సమాధానం వచ్చేదాకా ప్రశ్నిస్తూనే ఉంటాను అని కావ్య అంటుంది.

ఇలాంటి పరిస్థితులో ఎవరైనా ఇలాగే ఉండిపోతారు అని రాజ్ అంటే.. ఏది ఈ పరిస్థితా.. ఇలా ఎంతకాలం. నా మనసు ముక్కలు చేశారు. ఇలానే సైలెంట్‌గా ఎన్నాళ్లు ఉండమని చెబుతున్నారు అని కావ్య అంటుంది. నేను నిన్ను ఇలాగే సైలెంట్‌గా ఉండమని చెప్పలేను. జరిగిన మార్పును జీర్ణం చేసుకోమని చెప్పలేను. నువ్ ఎంత వేధన చెందుతున్నావో నాకు తెలుసు. అత్తారింటికి పుట్టింటిక మధ్య సమాజం గీసిన గీతపై ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో అర్థం అవుతుంది అని రాజ్ అంటాడు.

నమ్మకం పోయి

హుమ్.. తెలుస్తాయి.. అర్థం అవుతాయి.. కానీ, ఏం లాభం. నష్టం పూర్చలేం కదా. కష్టం మార్చలేరు కదా అని కావ్య అంటుంది. కష్టాన్ని, నష్టాన్ని భరించాల్సిన అవసరం ఇక నీకు రాకుండా చేయగలను అని రాజ్ అంటాడు. అయోమయంగా కావ్య ఉంటుంది. ఇంతలో రాజ్ విడాకులు పేపర్స్ తీసి చూస్తాడు. ఈ విడాకులు నువ్ ఇచ్చినవే. ఇందులో నువ్ చేసిందే చివరి సంతకం. నేను ఈ బిడ్డను తీసుకురాకముందే నువ్ నాకు ఇచ్చావ్. ఏడాదిపాటు విసిగిపోయి, నమ్మకంపోయి ఇచ్చావ్ అని రాజ్ అంటాడు.

కాపురం రెండు ముక్కలు చేయడానికి అటు నీ సంతకం, ఇటు నా సంతకం అవసరం కదా. నువ్ ఏది అడిగినా చేయలేకపోయాను. కనీసం ఈ ఒక్కటి అయినా చేయనివ్వు అని చెప్పిన రాజ్ విడాకులపై సంతకం చేస్తుంటే కావ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. తర్వాత సంతకం చేసి కావ్య చేతిలో రాజ్ విడాకుల పేపర్స్ పెడుతాడు. కానీ, కావ్య మాత్రం షాక్ అవుతుంది. ఇక నుండి విముక్తి పొందే అవకాశం నీ చేతుల్లోనే ఉంది. ఇన్నాళ్లు ఏదో ఒక పరీక్ష పెట్టి, అడ్డు చెప్పి వాయిదా వేస్తూ వచ్చాను. నిన్ను ఉండమని చెప్పాను. ఇప్పుడు నాకు ఆ అర్హత లేదు అని రాజ్ అంటాడు.

నువ్ కోరుకుందే కదా

నిన్ను ఆపే హక్కు ఇక నాకు లేదని రాజ్ చాలా చెబుతాడు. దాంతో అయిపోయిందా. ఇంతటితో మీ బాధ్యత తీరిపోయిందా. నేను మిమ్మల్ని వదిలేసి పోవాలంటే ఈ కాగితాలు నాకు అవసరమా. నమ్మకం పోయినప్పుడే భార్యాభర్తల మధ్య మానసికంగా విడాకులు అవుతాయి. ఈ కాగితాలు సమాజానికి చెప్పడానికి మాత్రమే అని కావ్య అంటుంది. నువ్ కోరుకుందే కదా అని రాజ్ అంటాడు. దాంతో నేను కోరుకున్నది అన్ని చేశారా. మీరు ఏది చెబితే అలా చేయాలా. నాకంటూ మనసు, కోరికలు ఉండవా అని కావ్య అంటుంది.

నేను వెళ్లను. ఇలా సింపుల్ సంతకంతో నేను వెళ్లను. ఈ బిడ్డకు తల్లి ఎవరో తెలియాలి. తాళి కట్టిన భార్య ఉండగా ఆ తల్లి తల్లిగా ఎలా అయిందో నేను తెలుసుకోవాలి. తల్లి లేకుండా ఈ బిడ్డను మాత్రమే ఇంటి వారసుడిగా ఇంటికి ఎందుకు తీసుకొచ్చారో తెలియాలి. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరికాక ఇక్కడే ఉండాలో లేదో నేను నిర్ణయించుకుంటున్నాను. అప్పటి వరకు నన్ను వెళ్లమనే హక్కు ఎవరికీ లేదు అని కావ్య చెప్పేసి వెళ్లిపోతుంది.

అనామికపై ఫైర్

మరోవైపు రాజ్ బాబును తీసుకొచ్చిన విషయం తన అమ్మకు చెబుతుంది అనామిక. ఇప్పుడే బాబును తీసుకొచ్చి వారసుడు అంటున్నాడు అని అనామిక అంటుండగా అపర్ణ వచ్చి ఫోన్ లాక్కుంటుంది. తర్వాత కాల్ కట్ చేసి ఎవరు మీ అమ్మేనా. ఇంటి విషయాలు బయటకు చెప్పొద్దని నీకు తెలియదా అని అపర్ణ అంటే.. జరిగిన బాగోతమే కదా అని అనామిక అంటుంది. షటప్.. నువ్ ఈ ఇంటి కోడలివి. ఇంట్లో విషయాలు బయటకు ఎలా చెబుతావ్ అంటూ క్లాస్ తీసుకుంటుంది అపర్ణ.

ఆ మాటలు విన్న రుద్రాణి వెళ్లి ధాన్యలక్ష్మీని తీసుకొస్తుంది. అపర్ణ క్లాస్ తీసుకోవడం వచ్చి ధాన్యలక్ష్మీ చూస్తుంది. నా కోడలు ఏం చేసింది అక్క అని ధాన్యలక్ష్మీ అడిగితే.. బావగారు చేసిన పని మా అమ్మకు చెప్పాను. దానికే అత్తయ్య నాపై అరుస్తున్నారు అని అనామిక అంటుంది. మరి నువ్వెందుకు చెప్పావ్. జరిగిన పనిని గుట్టు చప్పుడు కాకుండా ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తుంటే నువ్ పని గట్టుకుని పబ్లిసిటీ చేస్తున్నావా. ఇంటికి తలవంపులు తెచ్చే విషయాన్ని బయటకు ఎలా చెబుతావ్ అని అనామికపైనే ధాన్యలక్ష్మీ ఫైర్ అవుతుంది.

నీ రూట్‌లోనే వచ్చా

అది చూసి ఏంటీ ఇలా రివర్స్ అయిందని రుద్రాణి అనుకుంటుంది. ఇంకోసారి ఇంటి పరువు పోయే విషయాలను బయటకు చెప్పకు. అనామికను అని కూడా ఏం లాభం లేదు అక్క. రాజ్ చేసిన పనికి ఏం చేయాలో ఆలోచించాలి. కావ్య కూడా సహాకారం అందిస్తోంది. అందరం సర్దుకుపోలేం కదా. అనామిక నువ్ వెళ్లు. ఇంకోసారి ఇలా చేయకు కల్యాణ్ కూడా ఊరుకోడు అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో అనామిక తర్వాత అపర్ణ వెళ్లిపోతారు.

ఇదేంటి ధాన్యలక్ష్మీ ఇలా చేశావ్. నీ కోడలికే క్లాస్ పీకావ్ అంటీ అని రుద్రాణి అడుగుతుంది. నేను నీ రూట్‌లోకే వచ్చాను రుద్రాణి. రాజ్ నిజంగా తప్పు చేసి బిడ్డను కని ఉంటే గుట్టు చప్పుడు కాకుండా బిడ్డను వదిలించుకోవాలి. లేకుంటే వాడే వారసుడు అవుతాడు. ఇంత పెద్ద తప్పు చేశాకా రాజ్‌ను వారసుడిగా ఎలా ఉండనిస్తారు. అప్పుడు నా కొడుకే కదా కంపెనీని నడిపేది. అందుకే బిడ్డను వదిలించుకోవాలన్న విషయాన్ని మా అక్కకు గట్టిగా చెప్పాను అని ధాన్యలక్ష్మీ అంటుంది.

రాజ్ ఆకలి తీర్చిన కావ్య

వామ్మో ధాన్యలక్ష్మీ నీకు ఇంత ముందు చూపు ఉందా అని రుద్రాణి అంటుంది. నువ్వే కదా నాకు ట్యూషన్ చెప్పేది అని ధాన్యలక్ష్మీ వెళ్లిపోతుంది. నువ్ ఈ రూట్‌లో రాజ్‌ను తప్పించి కల్యాణ్‌ను అందెలం ఎక్కిస్తే.. నేను నీ కొడుకును తప్పించి.. రాహుల్‌ను వారసుడిని చేస్తా అని రుద్రాణి అనుకుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

తర్వాతి ఎపిసోడ్‌లో రాజ్ భోజనానికి వచ్చి కూర్చుంటే అపర్ణ లేచి వెళ్లిపోతుంది. రాజ్ ఆపుతాడు. నాకు ఆకలి చచ్చిపోయిందని అపర్ణ అంటుంది. నాకోసం మీరు వెళ్లడం ఎందుకు. నేనే వెళ్లిపోతాను అని రాజ్ తినకుండా వెళ్లిపోతాడు. రాజ్‌కు కావ్య భోజనం తీసుకెళ్తుంటే.. ఎందుకు ఈ తప్పు చేస్తున్నావ్ అని అపర్ణ అడుగుతుంది. ఇలా చేస్తే అయినా కరిగి ఆయన నిజం చెబుతారేమో అని ఆశ పడుతున్నాను. నిజం తెలుసుకునే హక్కు నాకే ఉందని కావ్య వెళ్లి రాజ్‌కు భోజనం ఇస్తుంది. దాంతో రాజ్ భోజనం చేస్తుంటాడు.

WhatsApp channel