Rahulgandhi In Telangana: తెలంగాణ నుంచి లోక్‌సభ బరిలోకి రాహుల్ గాంధీ.. ఖమ్మం, భువనగిరి నుంచి పోటీకి ఛాన్స్!-rahul gandhi to contest lok sabha from telangana chance to contest from khammam and bhuvanagiri ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Rahulgandhi In Telangana: తెలంగాణ నుంచి లోక్‌సభ బరిలోకి రాహుల్ గాంధీ.. ఖమ్మం, భువనగిరి నుంచి పోటీకి ఛాన్స్!

Rahulgandhi In Telangana: తెలంగాణ నుంచి లోక్‌సభ బరిలోకి రాహుల్ గాంధీ.. ఖమ్మం, భువనగిరి నుంచి పోటీకి ఛాన్స్!

Sarath chandra.B HT Telugu
Mar 27, 2024 12:01 PM IST

Rahulgandhi In Telangana: కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌ గాంధీ తెలంగాణ నుంచి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. తెలంగాణలోని ఖమ్మం, భువనగిరి స్థానాల్లో రాహుల్ పోటీ చేసే అవకాశాలున్నాయి.

తెలంగాణ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న  రాహుల్ గాంధీ
తెలంగాణ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న రాహుల్ గాంధీ (Twitter)

Rahulgandhi In Telangana: కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. తెలంగాణ నుంచి లోక్‌సభ Loksabha ఎన్నికల బరిలో నిలిచేందుకు ఇప్పటికే రాహుల్‌ నిర్ణయం తీసుకున్నట్టు కాంగ్రెస్Congress వర్గాలు చెబుతున్నాయి.

రానున్న ఎన్నికల్లో తెలంగాణ నుంచి గణనీయమైన స్థాయిలో పార్లమెంటు సీట్లను గెలవాలనే లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే కసరత్తు చేస్తోంది. మెజార్టీ పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తే ఆ ప్రభావం పార్టీ విజయావకాశాలను మెరుగు పరుస్తుందని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది.

త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కొద్ది నెలల క్రితం సిఎం రేవంత్ రెడ్డి Revanthreddy, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కలు కొద్ది నెలల క్రితం సోనియాకు వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య కారణాలతో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానిక సోనియాSonia Gandhi విముఖత చూపించారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో రాజస్థాన్ రాష్ట్రం నుంచి సోనియా ఎన్నికయ్యారు.

ఈ నేపథ్యంలో త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో రాహల్ గాంధీని ఖమ్మం, భువనగిరి పార్లమెంటు నియోజక వర్గాల్లో పోటీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. 2019లో రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి గెలిచారు. ఈసారి తెలంగాణలో పోటీ చేయడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తదితరులతో సిఎం రేవంత్ చర్చించినట్టు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణతో పాటు యూపీలోని అమేఠీ నుంచి కూడా రాహుల్ పోటీ చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సోనియా ప్రాతినిథ్యం వహించిన రాయబరేలీలో ప్రియాంకగాంధీ పోటీ చేసే అవకాశం ఉంది.

మరోవైపు రాహుల్ గాందీ ప్రాతినిథ్యం వహిస్తున్న వయనాడ్‌లో సిపిఐ పోటీ చేయాలని భావిస్తోంది. ఇండియా కూటమిలో ఉన్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా సతీమణి యానీ రాజాను వయనాడ్‌లో పోటీ చేయించాలని యోచిస్తున్నారు. ఇండియా కూటమిలో పార్టీల మధ్య ఇంకా సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలోనే సిపిఐ అభ్యర్ధిని ప్రకటించారు. ఇండియా కూటమిలో ఉన్న ఇండియన్ ముస్లిం లీగ్‌ కూడా వయనాడ్‌లో పోటీ చేయాలని యోచిస్తోంది.

తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఒత్తిడి…

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీని సీఎం రేవంత్‌ రెడ్డి కోరినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మం, నల్లగొండ, భువనగిరి సీట్లలో ఒకటి ఎంచుకోవాలని ఆయన వద్ద ప్రతిపాదన పెట్టారు. దీనికి రాహుల్ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు రుణం తీర్చుకునేందుకు ప్రజలకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌ నేతలు అక్కడ నుంచి పోటీకి ఒత్తిడి చేస్తున్నారు. తెలంగాణలో పోటీకి నిరాకరించిన సమయంలో సోనియా గాంధీకి తెలంగాణ నుంచి రాజ్యసభ సీటునూ ఆఫర్‌ చేశారు. ఆమె రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

తాజాగా రాహుల్ గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలనే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. తెలంగాణ నుంచి రాహుల్‌ పోటీ చేస్తే దక్షిణాదిలో ఇండియా కూటమి పార్టీలకూ ఉపయోగకరంగా ఉంటుందని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

తెలంగాణ నుంచి పోటీ ప్రతిపాదనను రాహుల్‌ అంగీకరిస్తే గాంధీ కుటుంబం నుంచి ఈ ప్రాంతంలో పోటీ చేయనున్న రెండో నేత కానున్నారు. గతంలో మెదక్‌ సీటు నుంచి ఇందిరా గాంధీ ప్రాతినిథ్యం వహించారు. భువనగిరి, మెదక్‌, ఖమ్మం, నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గాల గురించి కాంగ్రెస్‌ పెద్దలు ఆరా తీసినట్లు తెలుస్తోంది.

రాహుల్ గాందీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన అమేఠీతో పాటు తొలిసారి వయనాడ్‌లో కూడా పోటీ చేశారు. అమేఠీలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ చేతుల్లో ఓడిపోగా, వయనాడ్‌లో ఘన విజయం సాధించారు. ఈ సారి తెలంగాణ నుంచి పోటీ చేయడానికి రాహుల్ కూడా సానుకూలంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఏపీతో పాటు కర్ణాటకలో కూడా రాహుల్ గాంధీ పోటీ చేసే అవకాశాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

Whats_app_banner