LIVE UPDATES
Andhra Pradesh News Live October 6, 2024: Pawan Kalyan On Vizag Steel Plant : ఆ రోజే అందరూ కలసి వచ్చి ఉంటే- విశాఖ స్టీల్ ప్లాంట్ పై పవన్ కీలక వ్యాఖ్యలు
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 06 Oct 202405:08 PM IST
Andhra Pradesh News Live: Pawan Kalyan On Vizag Steel Plant : ఆ రోజే అందరూ కలసి వచ్చి ఉంటే- విశాఖ స్టీల్ ప్లాంట్ పై పవన్ కీలక వ్యాఖ్యలు
- Pawan Kalyan On Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ స్థాపన కోసం చేసిన త్యాగాలను మరచిపోకూడదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఉద్యోగులు, భూ నిర్వాసితుల ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి తెలియచేస్తానన్నారు. పరిశ్రమను కాపాడుకోవాలనే భావోద్వేగం కార్మికులు, ఉద్యోగులు, వారి సంఘాల్లో ఉండాలన్నారు.
Sun, 06 Oct 202404:14 PM IST
Andhra Pradesh News Live: Alipiri Foot Steps Way : అలిపిరి మెట్లమార్గం సమీపంలో వ్యక్తి మృతదేహం, కొంత దూరంలో జింక కళేబరం
- Alipiri Foot Steps Way : తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణలో భాగంగా స్పెషల్ పార్టీ పోలీసులు...అలిపిరి-తిరుమల మెట్ల మార్గంలో కూంబింగ్ నిర్వహించారు. శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం, దానికి సమీపంలో జింక కళేబరం కలకలం రేపాయి.
Sun, 06 Oct 202403:37 PM IST
Andhra Pradesh News Live: Sri Gadi Bapanamma Temple : వెదురు పొదల్లో వెలసిన సీతపల్లి శ్రీగడి బాపనమ్మ, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి
- Sri Gadi Bapanamma Temple : వెదురు పొదల్లో వెలిసి శ్రీ గడి బాపనమ్మ కోర్కెలు తీర్చే కల్పవల్లి అని స్థానికులు భావిస్తారు. రంపచోడవరం మండలం సీతపల్లిలో కొలువై ఉన్న అమ్మవారి దర్శనానికి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అమ్మవారి దగ్గరకు చెప్పులతో వెళ్తే మైకం కమ్మినట్లు ఉంటుందని భక్తుల నమ్మకం.
Sun, 06 Oct 202402:31 PM IST
Andhra Pradesh News Live: PG Medical: పీజీ వైద్య విద్య రిజిస్ట్రేషన్లు దాదాపుగా పూర్తి,అడ్మిషన్ల ప్రక్రియలో తొందరపాటులేదు-ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ
- PG Medical Education : రాష్ట్రంలో పీజీ వైద్య విద్య ప్రవేశాల రిజిస్ట్రేషన్ దాదాపుగా పూర్తైందని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ప్రకటించింది.రిజిస్ట్రేషన్ ప్రక్రియను లేటు ఫీజు అవసరం లేకుండా ఈ నెల 7 వరకు పొడిగించినట్లు పేర్కొంది. అడ్మిషన్ల ప్రక్రియ తొందరపాటుగా చేపడుతున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తమని తెలిపింది.
Sun, 06 Oct 202412:52 PM IST
Andhra Pradesh News Live: Online Trading Fraud : ఆన్ లైన్ ట్రేడింగ్ లో అధిక లాభాలంటూ మాయమాటలు, రూ.1.27 కోట్లకు కుచ్చుటోపీ
- Online Trading Fraud : ఆన్ లైన్ ట్రేడింగ్ లో అధిక లాభాలంటూ ఓ మహిళను మోసం చేశాడో సైబర్ కేటుగాడు. మహిళను నమ్మించి ఏకంగా రూ.1.27 కోట్లు కొట్టేశాడు. గత నెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఫేస్ బుక్ లో వచ్చిన ఓ లింక్ ను క్లిక్ చేయడంతో ఇదంతా జరిగిందని బాధితులు అంటున్నారు.
Sun, 06 Oct 202412:20 PM IST
Andhra Pradesh News Live: AP Job Mela : ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్- రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో జాబ్ మేళా, 1278 ఉద్యోగావకాశాలు
- AP Job Mela : ఏపీలోని పలు జిల్లాల్లో ఈ నెల 7, 8 తేదీల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరై తన ప్రతిభకు తగిన ఉద్యోగం పొందవచ్చు. ఏలూరు, నంద్యాల, విజయనగరం, అల్లూరి జిల్లాలో పలు ప్రైవేట్ సంస్థలలో సుమారు 1278 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
Sun, 06 Oct 202411:27 AM IST
Andhra Pradesh News Live: Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్, నాలుగు ప్రత్యేక రైళ్లు
- Special Trains : వరుస పండుగలు, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా న్యూ టిన్సుకియా-ఎస్ఎంవీటీ బెంగళూరు మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వాల్తేరు డివిజనల్ అధికారులు తెలిపారు. అదనపు రద్దీని క్లియర్ చేయడానికి విజయవాడ-శ్రీకాకుళం రోడ్ - విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లు నడుతున్నామన్నారు.
Sun, 06 Oct 202411:12 AM IST
Andhra Pradesh News Live: Pawan Kalyan : సార్.. మూడు నెలలుగా జీతాలు లేవు.. మీరే మాకు దిక్కు.. పవన్ వద్ద ఉద్యోగుల ఆవేదన
- Pawan Kalyan : మూడు నెలలుగా జీతాలు లేవని.. ఆర్‌డబ్ల్యూఎస్ ల్యాబ్ ఉద్యోగులు పవన్ కళ్యాణ్ వద్ద వాపోయారు. చలించిపోయిన డిప్యూటీ సీఎం పెండింగ్ జీతాలు క్లియర్ చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్టీల్‌ప్లాంట్ పోరాట కమిటీ నేతలు కూడా పవన్‌ను కలిశారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
Sun, 06 Oct 202410:57 AM IST
Andhra Pradesh News Live: Punganur Incident : అప్పు తీర్చమన్నందుకు ఇంతటి దారుణం, పుంగనూరు బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు
- Punganur Incident : పుంగనూరు బాలిక హత్య కేసును చిత్తూరు జిల్లా పోలీసులు ఛేదించారు. బాలిక తండ్రి ఇచ్చిన అప్పు తీర్చమన్నందుకు ఓ మహిళ, తన తల్లితో కలిసి ఈ దారుణానికి పాల్పడిందని పోలీసులు ప్రకటించారు. బాలికకు అన్నం పెట్టి, ఆ తర్వాత గొంతు నులిమి హత్య చేశారని పోలీసులు తెలిపారు.
Sun, 06 Oct 202409:42 AM IST
Andhra Pradesh News Live: AP Flood Relief : ఏపీ వరదల బాధితులకు ప్రభుత్వ పరిహారం, రేపు ఖాతాల్లో నగదు జమ
- AP Flood Relief : వరదల బాధితుల్లో 98 శాతం మందికి ఇప్పటికే వరద సాయం ఖాతాల్లో జమ చేశామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మిగిలిన 2 శాతం మందికి సోమవారం పరిహారం జమ చేస్తామని స్పష్టం చేసింది. బ్యాంక్ ఆధార్ లింక్, సాంకేతిక కారణాలతో పరిహారం అందజేత ఆలస్యమైందని పేర్కొంది.
Sun, 06 Oct 202408:57 AM IST
Andhra Pradesh News Live: AP TET Key : ఏపీ టెట్ ప్రాథమిక కీ విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
- AP TET Key : ఏపీలో టెట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల 3, 4 తేదీల్లో జరిగిన టెట్ పరీక్షల కీ లను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. పరీక్ష జరిగిన తర్వాతి రోజున టెట్ కీ లను విడుదల చేస్తున్నారు. త్వరలోనే ప్రాథమిక కీ లపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు.
Sun, 06 Oct 202407:39 AM IST
Andhra Pradesh News Live: ANU Distance Admissions 2024 : నాగార్జున యూనివర్సిటీ దూర విద్యలో డిగ్రీ, PG అడ్మిషన్లు - నవంబర్ 1 వరకు దరఖాస్తుల గడువు
- ANU Distance Education Admissions 2024 : గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్యలో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఈ గడువును నవంబర్ 1వ తేదీ వరకు అధికారులు పొడిగించారు. డిగ్రీ, పీజీ, డిప్లోమా, సర్టిఫికెట్ కోర్సులతో కలిపి మొత్తం 30కి పైగా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.
Sun, 06 Oct 202406:27 AM IST
Andhra Pradesh News Live: Punganur Girl Missing : మీ ప్రభుత్వంలో ఫైల్స్‌కి ఉన్న విలువ ఆడవాళ్లకు లేదా? : రోజా
- Punganur Girl Missing : పుంగనూరులో బాలిక మిస్సింగ్ ఘటన విషాదాంతమైంది. ఈ ఘటనపై వైసీపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఇష్యూపై తాజాగా మాజీమంత్రి రోజా స్పందించారు. ఈ ప్రభుత్వంలో ఫైల్స్‌కి ఉన్న విలువ ఆడవాళ్లకు లేదా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి.
Sun, 06 Oct 202406:26 AM IST
Andhra Pradesh News Live: Guntur Crime : పోలీసునంటూ బెదిరించి బీఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం
- గుంటూరు జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పోలీస్ పేరుతో ఓ దుండగుడు బీఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అక్కడ్నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కొత్తపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Sun, 06 Oct 202405:56 AM IST
Andhra Pradesh News Live: Chittoor Tragedy : చిత్తూరు జిల్లాలో విషాదం.. కుటుంబాన్ని బలి తీసుకున్న ఆన్‌లైన్ బెట్టింగ్
- Chittoor Tragedy : ఆన్‌లైన్ బెట్టింగ్ ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. ఒకేసారి నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ముగ్గురు మృతిచెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరులో జరిగింది.
Sun, 06 Oct 202404:14 AM IST
Andhra Pradesh News Live: Kurnool Tragedy : కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం.. నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి
- Kurnool Tragedy : దసరా సెలవులొచ్చాయి.. అల్లరి చేస్తూ స్నేహితులతో ఆటల్లో చిన్నారులు నిమగ్నమయ్యారు. సెలవుల్లో సరదాగా గడుపుతున్న ముగ్గురు చిన్నారులను మృత్యువు కబళించిది. బహిర్భూమికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు.. ఆడుకుంటూ నీటి కుంటలో మునిగిపోయారు. ఈ ఘటనలు కర్నూలు జిల్లాలో జరిగింది.
Sun, 06 Oct 202403:02 AM IST
Andhra Pradesh News Live: AP Intermediate : మారనున్న మార్కుల విధానం..! ఏపీ ఇంటర్ విద్యలో సరికొత్త మార్పులు
- ఏపీ ఇంటర్ విద్యలో మార్పులకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త సంస్కరణలను తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఇటీవలే విద్యాశాఖ మంత్రి లోకేశ్ కూడా ఇదే విషయం చెప్పారు. ఇంటర్మీడియట్ విద్యలో సమూల మార్పులు ఉంటాయని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా అడుగులు పడే అవకాశం ఉంది.
Sun, 06 Oct 202411:30 PM IST
Andhra Pradesh News Live: Lalitha Tripura Sundari: శ్రీచక్ర అధిష్టాన దేవతగా లలితా త్రిపుర సుందరీదేవి, దేవీ నామస్మరణతో మార్మోగుతున్న ఇంద్రకీలాద్రి
- Lalitha Tripura Sundari: ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గ అమ్మవారు శ్రీ లలితా సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. లలితా సుందరీ దేవి శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్ణరీ మహామంత్రాధి దేవతగా వేంచేసి తనని కొలిచే భక్తులకు ఉపాసకులకు అనుగ్రహిస్తుంది.