Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్, నాలుగు ప్రత్యేక రైళ్లు-waltair division four special trains for dasara rush vijayawada srikakulam road ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్, నాలుగు ప్రత్యేక రైళ్లు

Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్, నాలుగు ప్రత్యేక రైళ్లు

HT Telugu Desk HT Telugu
Oct 06, 2024 04:58 PM IST

Special Trains : వరుస పండుగలు, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా న్యూ టిన్సుకియా-ఎస్ఎంవీటీ బెంగళూరు మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వాల్తేరు డివిజనల్ అధికారులు తెలిపారు. అదనపు రద్దీని క్లియర్ చేయడానికి విజయవాడ-శ్రీకాకుళం రోడ్ - విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లు న‌డుతున్నామన్నారు.

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్, నాలుగు ప్రత్యేక రైళ్లు
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్, నాలుగు ప్రత్యేక రైళ్లు (HT)

పండుగ సీజన్‌లో ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి, న్యూ టిన్సుకియా-ఎస్ఎంవీటీ బెంగళూరు మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపాలని ఇండియ‌న్ రైల్వే నిర్ణయించింద‌ని వాల్తేర్ డివిజన్‌ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ తెలిపారు. అలాగే దసరా పండుగ సీజన్‌లో ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి విజయవాడ-శ్రీకాకుళం రోడ్ - విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లను న‌డుతుంద‌ని తెలిపారు.

న్యూ టిన్సుకియా- ఎస్ఎంవీటీ బెంగళూరు ప్రత్యేక రైలు (05952)ను న‌వంబ‌ర్ 7 నుంచి డిసెంబ‌ర్ 26 వరకు న‌డ‌ప‌నున్నారు. ఈ రైలు ప్రతి గురువారం సాయంత్ర 6.45 గంటలకు న్యూ టిన్సుకియా నుంచి బయలుదేరుతుంది. ఇది తన ప్రయాణంలో మూడో రోజు (శనివారం) మ‌ధ్యాహ్నం 12:12 గంటలకు శ్రీకాకుళం రోడ్‌కు చేరుకుంటుంది. విజయనగరం మ‌ధ్యాహ్నం 1:30 గంటలకు చేరుకుంటుంది. కొత్తవలస మ‌ధ్యాహ్నం 2:05 గంట‌ల‌కు చేరుకుంటుంది. పెందుర్తి మ‌ధ్యాహ్నం 2:15 గంటలకు, దువ్వాడ మ‌ధ్యాహ్నం 3:20 గంటలకు చేరుకుని, అక్కడ నుంచి మ‌ధ్యాహ్నం 3:25 గంటలకు బయలుదేరి ఆదివారం ఉదయం 9:00 గంటలకు ఎస్ఎంవీటీ బెంగళూరు చేరుకుంటుంది. ఈ రైలు మొత్తం ఎనిమిది ట్రిప్పులు తిరుగుతుంది.

ఎస్ఎంవీటీ బెంగళూరు -న్యూ టిన్సుకియా ప్రత్యేక రైలు (05951)ను న‌వంబ‌ర్ 11 నుంచి డిసెంబ‌ర్ 30 వరకు న‌డ‌ప‌నున్నారు. ఎస్ఎంవీటీ బెంగళూరు నుండి ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటలకు బ‌య‌లుదేరి, ఇది సోమవారాల్లో రాత్రి 9:15 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. పెందుర్తి రాత్రి 10:08 గంట‌ల‌కు, కొత్తవలస రాత్రి 10:20 గంట‌ల‌కు, విజయనగరం రాత్రి 10:50 గంటలకు, శ్రీకాకుళం రోడ్డు రాత్రి 11:50 చేరుకుని, అక్కడి నుంచి రాత్రి 11:52 బయలుదేరి బుధవారం మ‌ధ్యాహ్నం 1:15 గంటలకు న్యూ టిన్సుకియా చేరుకుంటుంది. ఈ రైలు మొత్తం ఎనిమిది ట్రిప్పులు తిరుగుతుంది.

ఈ రెండు ప్రత్యేక‌ రైళ్లు దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, ఈస్ట్ కోస్ట్ రైల్వే మీదుగా కటక్, భద్రక్‌లలో ఆగుతాయి. ఈ రైళ్లలో సెకెండ్ ఏసీ-1, థ‌ర్డ్‌ ఏసీ-5, స్లీపర్ క్లాస్-14, సెకండ్ క్లాస్ కమ్ లగేజీ కోచ్‌లు-2 ఉంటాయి. ఈ ప్రత్యేక రైలు సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కె. సందీప్ కోరారు.

శ్రీకాకుళం రోడ్డు- విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లు

దసరా పండుగ సీజన్లో ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి విజయవాడ - శ్రీకాకుళం రోడ్ - విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లను న‌డుపుతున్నారు.

విజయవాడ - శ్రీకాకుళం రోడ్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (07215) రైలు అక్టోబర్ 6 నుంచి 8 వ‌ర‌కు న‌డ‌ప‌నున్నారు. ఈ రైలు విజయవాడ నుంచి రాత్రి 8:00 గంటలకు బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు తెల్లవారుజామున 1:28 గంటలకు దువ్వాడ చేరుకుని, అక్కడ నుంచి ఉద‌యం 1:30 గంటలకు బయలుదేరుతుంది.

పెందుర్తి ఉద‌యం 2:23 గంట‌ల‌కు చేరుకుని, అక్కడ నుంచి తెల్లవారు జామున 2:25 గంట‌ల‌కు బ‌య‌లుదేరుతుంది. కొత్తవలసకు తెల్లవారు జామున 2:33 గంట‌ల‌కు చేరుకుని, అక్కడ నుంచి తెల్లవారు జామున 2:35 గంట‌ల‌కు బ‌య‌లు దేరుతోంది. విజయనగరం తెల్లవారు జామున 3:05 గంట‌ల‌కు చేరుకుని, అక్కడ నుంచి తెల్లవారు జామున 3:15 గంట‌ల‌కు బయలుదేరుతుంది. చీపురుపల్లి తెల్లవారు జామున 3:38 గంట‌ల‌కు చేరుకుని, తెల్లవారు జామున 3:40 గంట‌ల‌కు బ‌య‌లుదేరుతుంది. పొందూరు తెల్లవారుజామున 3.58 గంటలకు చేరుకుని, అక్కడ నుంచి తెల్లవారు జామున 4.00 గంటలకు బ‌య‌లుదేరి, శ్రీకాకుళం రోడ్డుకు ఉద‌యం 5:30 గంటలకు చేరుకుంటుంది.

శ్రీకాకుళం రోడ్ - విజయవాడ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (07216) రైలు అక్టోబర్ 7 నుంచి 9 వ‌ర‌కు న‌డ‌ప‌నున్నారు. ఈ రైలు శ్రీకాకుళం రోడ్‌లో ఉద‌యం 6:30 గంటలకు బయలుదేరుతుంది. ఇది ఉద‌యం 6.43 గంటలకు పొందూరు చేరుకుంటుంది. అక్కడ నుంచి ఉద‌యం 6.45 గంటలకు బయలుదేరుతుంది. చీపురుపల్లి ఉద‌యం 7:10 గంట‌ల‌కు చేరుకుని, అక్కడ నుంచి ఉద‌యం 7:12 గంట‌ల‌కు చేరుకుంటుంది. విజయనగరం ఉద‌యం 7:50 గంటలకు చేరుకుని, అక్కడ నుంచి ఉద‌యం 8:00 గంటలకు బయలుదేరుతుంది. కొత్తవలస ఉద‌యం 8:30 గంటలకు చేరుకుని, అక్కడ నుంచి ఉద‌యం 8:32 గంటలకు బ‌య‌లుదేరుతుంది. పెందుర్తి ఉద‌యం 8:40 గంట‌ల‌కు చేరుకుని, అక్కడ నుండి ఉద‌యం 8:42 గంట‌ల‌కు బయలుదేరుతుంది. దువ్వాడ ఉద‌యం 9:30 గంటలకు చేరుకుని, అక్కడ నుండి ఉద‌యం 9:32 గంటలకు బయలుదేరుతుంది. విజయవాడ సాయంత్రం 4:00 గంటలకు చేరుకుంటుంది.

ఈ రెండు ప్రత్యేక రైళ్లకు ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుప‌ల్లి, శ్రీకాకుళం, రోడ్ల మధ్య స్టాప్‌లు ఉంటాయి. ఈ రైళ్లలో సెకెండ్ ఏసీ కోచ్‌లు -02, థ‌ర్డ్‌ ఏసీ కోచ్‌లు-06, స్లీపర్ క్లాస్ కోచ్‌లు -07, జనరల్ సెకండ్ క్లాస్ -03, సెకండ్ క్లాస్ కమ్ దియాగన్ కోచ్ -01, మోటార్ కార్-01 ఉన్నాయి. ఈ ప్రత్యేక రైలు సేవలను ప్రజలు వినియోగించుకోవాలని వాల్తేర్ ఎస్‌డీసీఎం కె.సందీప్ కోరారు.

జ‌గ‌దీశ్వరరావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం