Dasara Special Trains : దసరా, దీపావళి పండుగ రద్దీ- దక్షిణ మధ్య రైల్వే 650 ప్రత్యేక రైళ్లు, తిరుపతికి స్పెషల్ సర్వీసులు
Dasara Special Trains : దసరా, దీపావళి పండుగల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మొత్తం 650 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. అలాగే సికింద్రాబాద్-తిరుపతి, కాచిగూడ-తిరుపతి మధ్య ప్రత్యేక సర్వీసులు అక్టోబర్, నవంబర్ నెలలో నడుపుతున్నట్లు పేర్కొంది.
Dasara Special Trains : దసరా, దీపావళి పండుగల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ నెలలో సుమారు 650 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా భారతీయ రైల్వే మొత్తం 6,000 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో రిజర్వేషన్లు వెయిటింగ్ లిస్ట్ లు చూపిస్తున్నాయి. దీనిని పరిష్కరించడానికి రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.
అలాగే కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. కాచిగూడ-తిరుపతి, తిరుపతి-కాచిగూడ (రైలు నంబర్ 07063/07064)మధ్య 14 ప్రత్యేక రైళ్ల సర్వీసులను నడపనున్నట్లు పేర్కొన్నారు. రైలు నెం.07063 కాచిగూడ-తిరుపతి అక్టోబర్ 1, 8, 15, 22 , 29, నవంబర్ 5, 12 తేదీల్లో మంగళవారాల్లో, రైలు నెం.07064 తిరుపతి-కాచిగూడ అక్టోబర్ 2, 9, 16, 23, 30 నవంబర్ 6, 13 తేదీల్లో బుధవారాల్లో నడపనున్నారు.
ఈ ప్రత్యేక రైళ్లు ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఇరువైపులా ఆగుతాయి. రైలు నెం. 07041 సికింద్రాబాద్-తిరుపతి స్పెషల్ ట్రైన్ సర్వీసులు బుధ, శుక్రవారాల్లో అక్టోబర్ 2, 4, 9, 11, 16, 18, 23, 25, 30 నవంబర్ 1, 6, 8, 13, 15 తేదీల్లో నడపనున్నారు. రైలు నెం. 07042 తిరుపతి-సికింద్రాబాద్ రైలు సర్వీసులు అక్టోబర్ 3, 5, 10, 12, 17, 19, 24, 26, 31 నవంబర్ 2, 7, 9, 14, 16 తేదీల్లో గురు, శనివారాల్లో నడపనున్నారు.
ఈ స్పెషల్ ట్రైన్స్ జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఇరువైపులా ఆగుతాయి.
నాందేడ్ నుంచి పన్వెల్‌కు 12 ప్రత్యేక రైళ్లు
వచ్చేది దసరా, దీపావళి పండుగల సీజన్. సెలవులకు స్వగ్రామాలకు, విహారయాత్రలకు ప్రయాణాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు రద్దీ దృష్ట్యా 48 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. అక్టోబర్ 21 నుంచి నవంబర్ 27 వరకు సోమ, బుధ వారాల్లో నాందేడ్ నుంచి పన్వెల్‌కు 12 ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. అలాగే అక్టోబర్ 22 నుంచి నవంబర్ 28 వరకు మంగళ, గురు వారాల్లో పన్వెల్ నుంచి నాందేడ్ కు 12 ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.
వీటితో పాటు అక్టోబర్ 11వ తేదీ నుంచి నవంబర్ 29 వరకు ప్రతి శుక్రవారం కొచువెలి నుంచి నిజాముద్దీన్ వరకు 8 ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. అక్టోబర్ 14 నుంచి డిసెంబర్ 2 వరకు ప్రతి సోమవారం నిజాముద్దీన్-కొచువెలి మధ్య 8 ప్రత్యేక రైళు, అక్టోబర్ 21 నుంచి నవంబర్ 11 వరకు ప్రతి సోమవారం పూణే నుంచి కరీంనగర్ వరకు 4 ప్రత్యేక రైళ్లు, అక్టోబర్ 23 నుంచి నవంబర్ 13 వరకు ప్రతి బుధవారం కరీంనగర్ నుంచి పూణే వరకు నాలుగు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
సంబంధిత కథనం