Festival Special Trains : భువనేశ్వర్-యశ్వంతపూర్ మధ్య ఏసీ ప్రత్యేక రైళ్లు - ఏపీలో ఆగే స్టేషన్లు ఇవే-ac special trains between bhuvaneshwar yeshwantapur route full details read here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Festival Special Trains : భువనేశ్వర్-యశ్వంతపూర్ మధ్య ఏసీ ప్రత్యేక రైళ్లు - ఏపీలో ఆగే స్టేషన్లు ఇవే

Festival Special Trains : భువనేశ్వర్-యశ్వంతపూర్ మధ్య ఏసీ ప్రత్యేక రైళ్లు - ఏపీలో ఆగే స్టేషన్లు ఇవే

HT Telugu Desk HT Telugu
Sep 27, 2024 05:41 PM IST

పండగల సీజన్ సమీపించిన వేళ రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లపై దృష్టిపెట్టింది. ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు భువనేశ్వర్-యశ్వంతపూర్-భువనేశ్వర్ మధ్య ఏసీ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. ఈ వివరాలను వాల్తేరు రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ తెలిపారు.

ఏసీ ప్రత్యేక రైళ్లు
ఏసీ ప్రత్యేక రైళ్లు

దీపావళి, పూజ పండుగ సీజన్‌లో ప్ర‌యాణికుల ర‌ద్దీని త‌గ్గించ‌డానికి, ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ఈస్ట్ కోస్ట్ రైల్వే రెండు ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మేరకు వాల్తేర్ డివిజ‌న్‌ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ వివరాలను తెలిపారు.

భువనేశ్వర్ నుండి బ‌య‌లుదేరే భువనేశ్వర్-యశ్వంత్‌పూర్ వీక్లీ ఏసీ స్పెషల్ (02811) రైలు 2024 అక్టోబ‌ర్ 5 నుండి 2024 న‌వంబ‌ర్ 30 వ‌ర‌కు ప్ర‌తి శ‌నివారాల్లోరాత్రి 7:15 గంటలకు బయలుదేరుతుంది. ఇది శ్రీకాకుళం రోడ్‌కి రాత్రి 11:28 గంటలకు చేరుకుని అక్క‌డ నుంచి రాత్రి 11:30 గంటలకు బయలుదేరుతుంది. విజయనగరం అర్థ‌రాత్రి 12:30 గంటలకు చేరుకుని, అక్క‌డి నుంచి అర్థ‌రాత్రి 12:40 గంటలకు బయలుదేరుతుంది.

కొత్తవలసకు అర్థ‌రాత్రి 1:05 గంటలకు చేరుకుని, అక్క‌డ‌ నుంచి అర్థ‌రాత్రి 1:07 గంట‌ల‌కు బయలుదేరుతుంది. దువ్వాడకు అర్థ‌రాత్రి 1:53 గంటలకు చేరుకుని, అక్క‌డ నుంచి అర్థ‌రాత్రి 1:55 గంటలకు బయలుదేరి సోమవారాల్లో అర్థ‌రాత్రి 12:15 గంటలకు యశ్వంతపూర్ చేరుకుంటుంది. మొత్తం తొమ్మిది ట్రిప్పులు ఈ రైలు తిరుగుతుంది.

యశ్వంత్‌పూర్ నుండి బయలుదేరే యశ్వంత్‌పూర్-భువనేశ్వర్ వీక్లీ స్పెషల్ (02812) రైలు 2024 అక్టోబ‌ర్ 7 నుండి 2024 డిసెంబ‌ర్ 2 వ‌ర‌కు సోమవారాల్లో ఉద‌యం 4.30 గంటలకు బ‌య‌లుదేరుతుంది. అది మ‌రుస‌టి రోజు తెల్ల‌వారుజామున‌ 4:30 గంటలకు దువ్వాడ చేరుకుని, అక్క‌డ నుంచి తెల్ల‌వారుజామున‌ 4:32 గంటలకు బయలుదేరుతుంది. కొత్తవలస ఉద‌యం 5:20 గంటలకు చేరుకుని, అక్క‌డ నుంచి ఉద‌యం 5:22 గంటలకు బ‌య‌లుదేరుతుంది.

విజయనగరం ఉద‌యం 6:00 గంటలకు చేరుకుని, అక్క‌డ నుంచి ఉద‌యం 6:10 గంటలకు బ‌య‌లుదేరుతుంది. శ్రీకాకుళం రోడ్డుకు ఉద‌యం 7:03 గంటలకు చేరుకుని, అక్క‌డ నుంచి ఉద‌యం 7:05 గంటలకు బయలుదేరి మంగళవారం మధ్యాహ్నం 12.15 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది.మొత్తం తొమ్మిది ట్రిప్పులు ఈ రైలు తిరుగుతుంది.

ఈ రెండు రైళ్లు భువ‌నేశ్వ‌ర్‌-య‌శ్వంత్‌పూర్ మ‌ధ్య ఖుర్దా రోడ్, బ్రహ్మాపూర్, పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, మార్కాపురం రోడ్, గిద్దలూరు, నంద్యాల, ధోనే, ధరంవరం, యస్త్యసాయి ప్రశాంతి నిలయం, భువంత్‌పూర్ స్టేషన్‌లో ఆగుతాయి. ఈ రైళ్లలో థ‌ర్డ్‌ ఏసీ-16, జనరేటర్ మోటార్ కార్-02 ఉన్నాయి. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సర్వీసులను వినియోగించుకోవాలని వాల్తేర్ డివిజ‌న్‌ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ కోరారు.

రిపోర్టింగ్ - జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

 

సంబంధిత కథనం