East Coast Trains : ప్రయాణికులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే గుడ్‌న్యూస్‌-28 స్పెష‌ల్ రైళ్లు, 26 రైళ్లకు అద‌న‌పు కోచ్ లు-east coast railway 28 special trains on dasara deepavali festive season from visakhapatnam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  East Coast Trains : ప్రయాణికులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే గుడ్‌న్యూస్‌-28 స్పెష‌ల్ రైళ్లు, 26 రైళ్లకు అద‌న‌పు కోచ్ లు

East Coast Trains : ప్రయాణికులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే గుడ్‌న్యూస్‌-28 స్పెష‌ల్ రైళ్లు, 26 రైళ్లకు అద‌న‌పు కోచ్ లు

HT Telugu Desk HT Telugu
Sep 30, 2024 10:50 PM IST

East Coast Special Trains : వరుస పండుగల ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని ఈస్ట్ కోస్ట్ స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది. విశాఖ నుంచి సికింద్రాబాద్, తిరుపతి, అరకు, చెన్నై, షాలిమార్, తిరుపతి, శ్రీకాకుళం, అరకు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. పలు రైళ్లకు అదనపు కోచ్ లు జోడిస్తున్నారు.

ప్రయాణికులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే గుడ్‌న్యూస్‌-28 స్పెష‌ల్ రైళ్లు, 26 రైళ్లకు అద‌న‌పు కోచ్ లు
ప్రయాణికులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే గుడ్‌న్యూస్‌-28 స్పెష‌ల్ రైళ్లు, 26 రైళ్లకు అద‌న‌పు కోచ్ లు

East Coast Special Trains : రైల్వే ప్రయాణికుల‌కు ఈస్ట్ కోస్ట్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. పండుగ సీజన్ కోసం ప్రత్యేక రైళ్లను నడ‌పాల‌ని నిర్ణయించింది. రాబోయే పండుగ సీజన్‌లో భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని, దసరా, చాట్, దీపావళి పండుగల సమయంలో ప్రయాణికుల ప్రయాణానికి పెరిగిన డిమాండ్‌ను తీర్చడానికి ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్‌ డివిజన్ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ పండుగ కాలంలో ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడ‌మే ల‌క్ష్యంగా రైళ్లను న‌డుపుతున్నట్లు వాల్తేర్ డివిజ‌న్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె సందీప్ తెలిపారు.

ఈ పండుగ సందర్భాలలో గమనించిన ప్రయాణికుల డిమాండ్, రద్దీగా ఉండే ప్రయాణ విధానాల ఆధారంగా డివిజన్ ద్వారా మొత్తం 14 జతల ప్రత్యేక రైళ్లు నడపబడుతున్నట్లు తెలిపారు. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్, విశాఖపట్నం నుంచి తిరుపతి, విశాఖపట్నం నుంచి బెంగళూరు, విశాఖపట్నం నుంచి అరకు, విశాఖపట్నం నుంచి ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్, విశాఖపట్నం నుంచి షాలిమార్, శ్రీకాకుళం రోడ్డు నుంచి తిరుపతి, శ్రీకాకుళం రోడ్డు నుంచి కొల్లం, విశాఖపట్నం నుంచి అరకు ఈ రైళ్లు 24 ప్రత్యేక రైళ్లు న‌డుస్తాయ‌ని తెలిపారు.

అదనంగా, జనరల్ క్లాస్ కోచ్‌లు, స్లీపర్ క్లాస్ కోచ్‌లు, థ‌ర్డ్ ఏసీ కోచ్‌లు కూడా ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి అనేక రైళ్లకు యాడ్ అయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రద్దీ సమయంలో ప్రయాణీకుల సౌకర్యాన్ని, సురక్షితమైన, సమర్థవంతమైన ప్రయాణాన్ని మెరుగుపరచడానికి తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని తెలిపారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఈ ప్రత్యేక సర్వీసులను ప్లాన్ చేసిన‌ట్లు పేర్కొన్నారు. ప్రయాణికులందరికీ సంతోషకరమైన పండుగ సీజన్‌ను తాము కోరుకుంటున్నామ‌ని అన్నారు.

26 రైళ్లకు జనరల్, స్లీపర్, ఏసీ క్లాస్ కోచ్‌లు పెంపు

వెయిట్‌లిస్ట్ చేయబడిన ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి, అదనపు కోచ్‌లతో రైళ్లను పెంచాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది.

1. భువనేశ్వర్-కేఎస్ఆర్ బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (18463) రైలుకు అక్టోబ‌ర్ 2 నుండి అక్టోబ‌ర్ 11 వ‌ర‌కు ఒక స్లీప‌ర్ కోచ్ పెంచారు.

2. కేఎస్ఆర్‌ బెంగళూరు - భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (18464) రైలుకు అక్టోబ‌ర్ 3 నుండి అక్టోబ‌ర్ 12 వ‌ర‌కు ఒక స్లీప‌ర్ కోచ్ పెంచారు.

3. భువనేశ్వర్-తిరుపతి సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22871) రైలుకు అక్టోబ‌ర్ 6 నుండి న‌వంబ‌ర్ 10 వ‌ర‌కు ఒక జ‌న‌ర‌ల్ సెకండ్ సిట్టింగ్ క్లాస్ కోచ్ పెంచారు.

4. తిరుపతి-భువనేశ్వర్ సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22872) రైలుకు అక్టోబ‌ర్ 7 నుండి న‌వంబ‌ర్ 11 వ‌ర‌కు ఒక జ‌న‌ర‌ల్ సెకండ్ సిట్టింగ్ క్లాస్ కోచ్ పెంచారు.

5. భువనేశ్వర్-పుణె సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22882) రైలుకు అక్టోబ‌ర్ 1 నుండి న‌వంబ‌ర్ 5 వ‌ర‌కు ఒక జనరల్ సెకండ్ సిట్టింగ్ క్లాస్ కోచ్ పెంచారు.

6. పూణే - భువనేశ్వర్ సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22881) రైలుకు అక్టోబ‌ర్ 3 నుండి న‌వంబ‌ర్ 7 వ‌ర‌కు ఒక జనరల్ సెకండ్ సిట్టింగ్ క్లాస్ కోచ్ పెంచారు.

7. సంబల్‌పూర్-నాందేడ్ నాగావళి ఎక్స్‌ప్రెస్ (20809) రైలుకు అక్టోబ‌ర్ 4 నుండి అక్టోబ‌ర్ 28 వ‌ర‌కు ఒక థ‌ర్డ్ ఏసీ క్లాస్, ఒక స్లీప‌ర్ క్లాస్ కోచ్ పెంచారు.

8. నాందేడ్ - సంబల్‌పూర్ నాగావళి ఎక్స్‌ప్రెస్ (20810) రైలుకు అక్టోబ‌ర్ 5 నుండి అక్టోబ‌ర్ 29 వ‌ర‌కు ఒక థ‌ర్డ్ ఏసీ క్లాస్, ఒక స్లీప‌ర్ క్లాస్ కోచ్ పెంచారు.

9. సంబల్‌పూర్-ఈరోడ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08311) రైలుకు అక్టోబ‌ర్ 2 నుండి అక్టోబ‌ర్ 30 వ‌ర‌కు ఒక థ‌ర్డ్ ఏసీ క్లాస్, ఒక స్లీప‌ర్ క్లాస్ కోచ్ పెంచారు.

10. ఈరోడ్-సంబల్‌పూర్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (08312) రైలుకు అక్టోబ‌ర్ 4 నుండి న‌వంబ‌ర్ 1 వ‌ర‌కు ఒక థ‌ర్డ్ ఏసీ క్లాస్, ఒక స్లీప‌ర్ క్లాస్ కోచ్ పెంచారు.

11. విశాఖపట్నం-కిరండూల్ ప్యాసింజర్ స్పెషల్ (08551) రైలుకు అక్టోబ‌ర్ 1 నుండి అక్టోబ‌ర్ 31 వ‌ర‌కు ఒక స్లీప‌ర్ క్లాస్ కోచ్ పెంచారు.

12. కిరండూల్-విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ (08552) రైలుకు అక్టోబ‌ర్ 1 నుండి అక్టోబ‌ర్ 31 వ‌ర‌కు ఒక స్లీప‌ర్ క్లాస్ కోచ్ పెంచారు.

13. విశాఖపట్నం-గుణుపూర్ ప్యాసింజర్ స్పెషల్ (08522) రైలుకు అక్టోబ‌ర్ 1 నుండి అక్టోబ‌ర్ 31 వ‌ర‌కు ఒక స్లీప‌ర్ క్లాస్ కోచ్ పెంచారు.

14. గుణుపూర్-విశాఖపట్నం ప్యాసింజర్ ప్రత్యేక (08521) రైలుకు అక్టోబ‌ర్ 1 నుండి అక్టోబ‌ర్ 31 వ‌ర‌కు ఒక స్లీప‌ర్ క్లాస్ కోచ్ పెంచారు.

15. భువనేశ్వర్- ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (12830) రైలుకు అక్టోబ‌ర్ 3 నుండి న‌వంబ‌ర్ 14 వ‌ర‌కు ఒక సిట్టింగ్‌ క్లాస్ కోచ్ పెంచారు.

16. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-భువనేశ్వర్ (12829) రైలుకు అక్టోబ‌ర్ 4 నుండి న‌వంబ‌ర్ 15 వ‌ర‌కు ఒక సిట్టింగ్‌ క్లాస్ కోచ్ పెంచారు.

17. భువనేశ్వర్- ఎస్ఎంవీటీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (12845) రైలుకు అక్టోబ‌ర్ 6 నుండి న‌వంబ‌ర్ 17 వ‌ర‌కు ఒక జ‌న‌ర‌ల్ సెకండ్ సిట్టింగ్‌ క్లాస్ కోచ్ పెంచారు.

18. ఎస్ఎంవీటీ బెంగళూరు-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ (12846) రైలుకు అక్టోబ‌ర్ 7 నుండి న‌వంబ‌ర్ 18 వ‌ర‌కు ఒక జ‌న‌ర‌ల్ సెకండ్ సిట్టింగ్‌ క్లాస్ కోచ్ పెంచారు.

19. భువనేశ్వర్-పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ (12898) రైలుకు అక్టోబ‌ర్ 1 నుండి న‌వంబ‌ర్ 12 వ‌ర‌కు ఒక జ‌న‌ర‌ల్ సెకండ్ సిట్టింగ్‌ క్లాస్ కోచ్ పెంచారు.

20. పుదుచ్చేరి-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ (12897 ) రైలుకు అక్టోబ‌ర్ 2 నుండి న‌వంబ‌ర్ 13 వ‌ర‌కు ఒక జ‌న‌ర‌ల్ సెకండ్ సిట్టింగ్‌ క్లాస్ కోచ్ పెంచారు.

21. భువనేశ్వర్- రామేశ్వరం ఎక్స్‌ప్రెస్ (20896) రైలుకు అక్టోబ‌ర్ 4 నుండి న‌వంబ‌ర్ 15 వ‌ర‌కు ఒక జ‌న‌ర‌ల్ సెకండ్ సిట్టింగ్‌ క్లాస్ కోచ్ పెంచారు.

22. రామేశ్వరం-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ (20896) రైలుకు అక్టోబ‌ర్ 6 నుండి న‌వంబ‌ర్ 17 వ‌ర‌కు ఒక జ‌న‌ర‌ల్ సెకండ్ సిట్టింగ్‌ క్లాస్ కోచ్ పెంచారు.

23. భువనేశ్వర్-జగ్దల్పూర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ (18447) రైలుకు అక్టోబ‌ర్ 1 నుండి అక్టోబ‌ర్ 31 వ‌ర‌కు ఒక జ‌న‌ర‌ల్ సెకండ్ సిట్టింగ్‌ క్లాస్ కోచ్ పెంచారు.

24. జగ్దల్పూర్-భువనేశ్వర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ (18448) రైలుకు అక్టోబ‌ర్ 2 నుండి న‌వంబ‌ర్ 1 వ‌ర‌కు ఒక జ‌న‌ర‌ల్ సెకండ్ సిట్టింగ్‌ క్లాస్ కోచ్ పెంచారు.

25. భువనేశ్వర్-జునాగఢ్ ఎక్స్‌ప్రెస్ (20837) రైలుకు అక్టోబ‌ర్ 1 నుండి అక్టోబ‌ర్ 31 వ‌ర‌కు ఒక స్లీప‌ర్‌ క్లాస్ కోచ్ పెంచారు.

26. జునాగర్-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ (20838) రైలుకు అక్టోబ‌ర్ 2 నుండి న‌వంబ‌ర్ 1 వ‌ర‌కు ఒక స్లీప‌ర్‌ క్లాస్ కోచ్ పెంచారు.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు