తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live September 9, 2024: Bandi Sanjay : హైడ్రాతో కాంగ్రెస్ సర్కార్ హైడ్రామా, బీఆర్ఎస్ కు నో ఎంట్రీ బోర్డు- బండి సంజయ్
Bandi Sanjay : హైడ్రాతో కాంగ్రెస్ సర్కార్ హైడ్రామా, బీఆర్ఎస్ కు నో ఎంట్రీ బోర్డు- బండి సంజయ్
Bandi Sanjay : హైడ్రాతో కాంగ్రెస్ సర్కార్ హైడ్రామా, బీఆర్ఎస్ కు నో ఎంట్రీ బోర్డు- బండి సంజయ్

Telangana News Live September 9, 2024: Bandi Sanjay : హైడ్రాతో కాంగ్రెస్ సర్కార్ హైడ్రామా, బీఆర్ఎస్ కు నో ఎంట్రీ బోర్డు- బండి సంజయ్

09 September 2024, 22:49 IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

09 September 2024, 22:49 IST

Telangana News Live: Bandi Sanjay : హైడ్రాతో కాంగ్రెస్ సర్కార్ హైడ్రామా, బీఆర్ఎస్ కు నో ఎంట్రీ బోర్డు- బండి సంజయ్

  • Bandi Sanjay : హైడ్రా పేరుతో కాంగ్రెస్ హైడ్రామా ఆడుతుంనది కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. పెద్దల అక్రమ కట్టడాలు కూల్చితే సమర్థించామని, పేదల ఇళ్లు కూలిస్తే ఊరుకోమన్నారు. అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

09 September 2024, 22:28 IST

Telangana News Live: Ponnam Sathaiah Goud Award : చంద్రబోస్, కొమురమ్మ, మొగిలయ్యలకు పొన్నం సత్తయ్య గౌడ్ అవార్డు, ఈ నెల 13న ప్రదానం

  • Ponnam Sathaiah Goud Award : ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్, బలగం ఫేం కొమురమ్మ, మొగిలయ్యలు పొన్నం సత్తయ్య గౌడ్ మెమోరియల్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 13న రవీంద్రభారతిలో వీరికి అవార్డులు అందించనున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వారి తండ్రి జ్ఞాపకార్థం ఈ అవార్డులు అందిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

09 September 2024, 19:54 IST

Telangana News Live: BRS Mlas Party Defection Case : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదా? పార్టీ ఫిరాయింపుల చట్టం ఏం చెబుతోంది?

  • BRS Mlas Party Defection Case : కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత కత్తి వేలాడుతుంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రెటరీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏం చెబుతోంది?
పూర్తి స్టోరీ చదవండి

09 September 2024, 19:25 IST

Telangana News Live: Medak House Collapse : మెదక్ లో విషాదం, ఇంటి పైకప్పు కూలి వృద్దురాలు మృతి

  • Medak House Collapse : మెదక్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నానిన పెంకుటిల్లు పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు మరణించింది. బాధితులకు మంత్రి దామోదర రాజనర్సింహా రూ. 2 లక్షల ఆర్థిక సాయం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

09 September 2024, 17:46 IST

Telangana News Live: Siddipet Crime : వాట్సాప్, ఫేస్ బుక్ ల ద్వారా పరిచయం- తొమ్మిదో తరగతి బాలికను గర్భవతి చేసిన ముగ్గురు యువకులు

  • Siddipet Crime : సిద్దిపేట జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి బాలికపై ముగ్గురు యువకుడు పలుమార్లు లైంగిక దాడి చేశారు. బాలిక గర్భవతి కావడంతో అసలు విషయం వెలుగుచూసింది. నిందితులపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పూర్తి స్టోరీ చదవండి

09 September 2024, 16:46 IST

Telangana News Live: MLAs Disqualification : ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం.. 6 ముఖ్యమైన అంశాలు ఇవే!

  • MLAs Disqualification : ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశానికి సంబంధించి తాజాగా తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తం ఎపిసోడ్‌కు సంబంధించి ప్రధాన అంశాలు ఈ కథనంలో..
పూర్తి స్టోరీ చదవండి

09 September 2024, 16:07 IST

Telangana News Live: TG Government Jobs 2024 : తెలంగాణ వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే ఆఖరి తేదీ

  • TG Government Jobs 2024 : తెలంగాణ వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను స్వయంగా అందజేసే అవకాశం కల్పించారు. ఈ ఖాళీల భర్తీకి రాత పరీక్ష లేదు. కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

09 September 2024, 15:10 IST

Telangana News Live: Musi Floods : మూసీనదికి పోటెత్తిన వరద.. ఈ ప్రాంతాల్లో హై అలర్ట్‌.. జాగ్రత్తగా ఉండాలన్ని జీహెచ్ఎంసీ

  • Musi Floods : హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగర సమీపంలోని జంట జలాశయాలు నిండు కుండల్లా మారాయి. జంట జలాశయాల నుంచి నీటిని విడుదల చేయడంతో.. మూసీకి వరద పెరిగింది. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
పూర్తి స్టోరీ చదవండి

09 September 2024, 14:11 IST

Telangana News Live: Telangana Police : పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకుడి బర్త్‌డే వేడుకలు.. ఎస్సైపై చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు!

  • Telangana Police : తెలంగాణలోని పలు చోట్ల పోలీసులు తీరు విమర్శలకు దారితీస్తోంది. ఇటీవల వరంగల్‌లో మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకల్లో ఏసీపీ కేక్ కట్ చేయగా.. తాజాగా ఓ కాంగ్రెస్ నాయకుడి పుట్టినరోజు వేడుకలను వట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లోనే నిర్వహించారు. ఈ వ్యవహారంలో ఎస్సైపై బదిలీ వేటు పడింది.
పూర్తి స్టోరీ చదవండి

09 September 2024, 12:29 IST

Telangana News Live: Vande Bharat Express : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లో అతి త్వరలోనే వందేభారత్ పరుగులు

  • Vande Bharat Express : సికింద్రాబాద్ నుంచి మరో వందేభారత్ రైలు అందుబాటులోకి రానుంది. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ అతి త్వరలో ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్- నాగ్‌పూర్ మధ్య ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నడవనుంది. సాధారణ ప్రయాణం కంటే 45 నిమిషాల తక్కువ సమయంలో గమ్యస్థానం చేరుకోవచ్చు.
పూర్తి స్టోరీ చదవండి

09 September 2024, 11:45 IST

Telangana News Live: Telangana High Court : ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

  • Telangana High Court : ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అనర్హత పిటిషన్లు స్పీకర్‌ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీని హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో స్టేటస్‌ రిపోర్ట్‌ ఇవ్వాలన్న హైకోర్టు.. పిటిషన్ల విచారణపై షెడ్యూల్‌ రిలీజ్‌ చేయాలని ఆదేశించింది.
పూర్తి స్టోరీ చదవండి

09 September 2024, 11:41 IST

Telangana News Live: Adilabad Viral Fevers: విషజ్వరాలతో పల్లె ప్రజలు విల విల, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతటా వైరల్ ఫీవర్స్

  • Adilabad Viral Fevers: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతటా వైరల్ ఫీవర్స్ జనాన్ని వణికిస్తున్నాయి. అసలు ఇవి ఏ తరహా జ్వరాలో అంతుబట్టక సీనియర్ డాక్టర్లు కూడా ఆందోళన చెందుతున్నారు.జ్వరం వచ్చిన వారికి చికెన్ గున్యా, డెంగ్యూ లక్షణాలు కూడా ఉంటున్నాయి.పరీక్షల్లో నెగెటివ్ వస్తుండ డంతో  అయోమయానికి గురవతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

09 September 2024, 11:05 IST

Telangana News Live: Telangana ACB : వామ్మో.. తెలంగాణలో ఈ స్థాయిలో అవినీతి అధికారులు ఉన్నారా.. ఒక్క ఏడాదిలోనే 145 కేసులు!

  • Telangana ACB : తెలంగాణలో ఏసీబీ కొత్త రికార్డును నెలకొల్పింది. ఒక్క ఏడాదిలోనే ఏకంగా 145 క్రిమినల్ కేసులు నమోదు చేసింది. గడిచిన ఐదేళ్లలో ఇదే రికార్డ్ అని అధికారులు చెబుతున్నారు. ఒక్క ఏడాదిలోనే 145 కేసులు నమోదు కావడంతో.. తెలంగాణలో అవినీతి ఈ స్థాయిలో ఉందా అనే చర్చ జరుగుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

09 September 2024, 9:27 IST

Telangana News Live: Adilabad Crime: ఇన్‌స్టా గ్రామ్ ప్రేమలో ఆదిలాబాద్ బాలిక, హోటల్లో 20 రోజులు బంధించి వేధింపులు

  • Adilabad Crime: ఇన్‌‌స్టా‌ గ్రామ్‌లో పరిచియమైన యువతిని 20రోజులు హోటల్ లో బందించి.. లైంగికంగా వేధించిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. భైంసాకు చెందిన బాలికతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం చేసుకున్న యువకుడు అపహరించి హోటల్లో బంధించి వేధింపులకు గురి చేశాడు.
పూర్తి స్టోరీ చదవండి

09 September 2024, 6:03 IST

Telangana News Live: Sangareddy School: ఆ ఊర్లో బడికి వెళ్లాలంటే పిల్లలకు భయంభయం,ప్రమాదకరంగా స్కూలు భవనం…

  • Sangareddy School: గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ముదిమాణిక్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదుల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. పురాతన భవనం కావడంతో పై కప్పు (స్లాబ్) బీటలు వారి వర్షపు నీరు క్లాస్ రూంలో నుండి బయటకు వస్తున్నాయి. 
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి