Instagram Love: ఇన్‌స్టా గ్రామ్ ప్రేమలో ఆదిలాబాద్ బాలిక, హోటల్లో 20 రోజులు బంధించి వేధింపులు-adilabad young woman was molested for 20 days in a hotel for instagram love ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Instagram Love: ఇన్‌స్టా గ్రామ్ ప్రేమలో ఆదిలాబాద్ బాలిక, హోటల్లో 20 రోజులు బంధించి వేధింపులు

Instagram Love: ఇన్‌స్టా గ్రామ్ ప్రేమలో ఆదిలాబాద్ బాలిక, హోటల్లో 20 రోజులు బంధించి వేధింపులు

HT Telugu Desk HT Telugu
Sep 09, 2024 10:39 AM IST

Adilabad Crime: ఇన్‌‌స్టా‌ గ్రామ్‌లో పరిచియమైన యువతిని 20రోజులు హోటల్ లో బందించి.. లైంగికంగా వేధించిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. భైంసాకు చెందిన బాలికతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం చేసుకున్న యువకుడు అపహరించి హోటల్లో బంధించి వేధింపులకు గురి చేశాడు.

ఇన్‌స్టా గ్రామ్‌లో పరిచయం, హోటల్లో బంధించి వేధింపులు
ఇన్‌స్టా గ్రామ్‌లో పరిచయం, హోటల్లో బంధించి వేధింపులు

Adilabad Crime: ఇన్‌‌స్టా‌ గ్రామ్‌లో పరిచియమైన యువతిని 20రోజులు హోటల్ లో బందించి.. లైంగికంగా వేధించిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. భైంసాకు చెందిన బాలికతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం చేసుకున్న యువకుడు అపహరించి హోటల్లో బంధించి వేధింపులకు గురి చేశాడు.

ఇన్స్టాలో పరిచయమైన బాలికను ఓ యువకుడు 20 రోజులుగా గదిలో బంధించిన ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భైంసాకు చెందిన బాలికకు ఇన్‌ స్టా గ్రామ్‌లో ఓ యువకుడితో పరిచయమైంది. అతడి మాటలకు ఆకర్షితులైన ఆమె ప్రేమ పేరుతో నగరానికి వచ్చింది.

బాలికను అతడు నారాయణగూడలోని ఓ హోటల్ గదిలో 20 రోజులు బంధించాడు. లైంగిక వేధింపులకు గురి చేశాడు. చివరకు యువతి పిర్యాదు తో పోలీసులకు దొరికిపోయాడు.

ఇన్‌ స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడు ప్రేమిస్తున్నానంటూ చెప్పి ఆమెకు మాయ మాటలు చెప్పాడు. ఆమెను హైదరాబాద్ కు పిలిచిన యువకుడు ఆమెను ఇరవై రోజులపాటు ఒక హోటల్లో బంధించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది.

నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన విద్యార్థి(20)కి బాధితురాలు సమాచారం ఇవ్వడంతో అతను బాలిక తల్లి దండ్రులకు సమాచారం అందిచడం తో విషయం బయటకు పొక్కింది. పోలీసులు హోటల్లో ఉన్న బాలికను రక్షించి నిందితుడిని పట్టుకొని నారాయణగూడ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి పోలీసులు నిందితుడిని రిమాండ్ కు తరలించారు.

(రిపోర్టింగ్ : వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి, హిందూస్తాన్ టైమ్స్ తెలుగు)