TG Government Jobs 2024 : తెలంగాణ వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే ఆఖరి తేదీ
TG Government Jobs 2024 : తెలంగాణ వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను స్వయంగా అందజేసే అవకాశం కల్పించారు. ఈ ఖాళీల భర్తీకి రాత పరీక్ష లేదు. కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు.
తెలంగాణలోని వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యారోగ్య శాఖ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీల భర్తీకి రాత పరీక్ష లేదు. కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. అప్లికేషన్ ఫిజు కూడా లేదు. డైరెక్ట్ ఇంటర్వ్యూకి హాజరై దరఖాస్తును అందజేయవచ్చు. దరఖాస్తులు సమర్పించడానికి ఈనెల 10 ఆఖరి తేదీ అని అధికారులు చెబుతున్నారు.
మొత్తం ఖాళీలు 06..
మొత్తం 06 ఖాళీలు ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్, పారామెడిక్ కమ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈనెల 10వ తేదీన ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. 2024 జులై 1వ తేదీ వరకు 18 ఏళ్లు నిండిన వారు ఈ పోస్టులకు అర్హులు. అదే తేదీ నాటికి 46 ఏళ్ల వయస్సు మించకూడదు.
సడలింపు ఇలా..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ అభ్యర్థులకు ఐదేళ్లు సడలింపు ఇచ్చారు. పీడబ్ల్యుబీడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఇచ్చారు. ఎక్స్ సర్విస్ మెన్ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఇచ్చారు. ఇంటర్వ్యూకు హాజరు కావడానికి ఎటువంటి ఫీజు లేదు. రాత పరీక్ష లేదు. కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన అభ్యర్థుల్లో మెడికల్ ఆఫీసర్‌కు రూ.52,000, ల్యాబ్ టెక్నీషియన్‌కు రూ.27,500, పారామెడిక్ కమ్ అసిస్టెంట్‌కు రూ.15,000 జీతం ఇవ్వనున్నారు.
జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో..
పాల్వంచలోని జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు.. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు, పదో తరగతి మెమో, ఇంటర్మీడియట్ లేదా 10+2 పరీక్ష సర్టిఫికేట్లు, సంబంధిత కోర్సు పాస్ సర్టిఫికేట్లు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు, కులం, అనుభవం పత్రాలను అందజేయాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరవ్వొచ్చని అధికారులు స్పష్టం చేశారు.